పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరసింహకవి దృష్టిలో నరసింహావతారకాలంకంటే పూర్వమే స్థానాన్ని సంపాదించుకొన్నాయి. హిరణ్యకశిపుడు బ్రహ్మవల్ల వరాలు పొందిన తరువాత పేరోలగంలో మాట్లాడుతూ "ఉపనిషత్తులకు సిద్ధవస్తువిషయంబైన ప్రామాణ్యం బంగీకరింపఁబడదు." (నార. 431. పు. 169. వ.) అని ఉపనిషత్తుల ప్రామాణికత్వాన్ని తిరస్కరించినట్లు పేర్కొన్నాడు. ఈ సందర్భంలో ఉపనిషత్తులు నరసింహావతారకాలానికి పూర్వమే ఆవిర్భవించినట్లు స్థానం సంపాయించుకున్నాయన్నమాట. అలా వుండగా - శౌరి, సనకాదులకు కర్మకాండాది విషయాలు తెలిపేసందర్భంలో అసలు విష్ణువే "ఇట్లు నాకు స్వాధీనవిశ్వత్వ ముపనిషత్తులు పలికెనట్లనే నాకుఁ గర్మకాండంబును సావకాశంబయ్యె నిందునకు సందేహంబు లేశంబును లేదు; నన్ను నెవ్వి యడుగవలయు రహస్యం బడిగెద రది యెఱింగింతు వినుండు." (నార. 413-పు. 83. వ) అని ఉపనిషత్తుల గురించి పేర్కొన్నట్లు నరసింహకవి రచించాడు. కొన్నిసందర్భాలలో కేవల శ్రుతి స్మృతులే పరమప్రామాణికాలని నరసింహకవి పేర్కొన్నా, అసలు ఉపనిషత్తులుకూడా వేదాలవలెనే దేవవాఙ్మయంగా భావించినట్లు కనిపిస్తున్నది. సర్వేశ్వరుని సర్వజనేచ్ఛానువృత్తిని గురించి వివరించే సందర్భంలో ప్రత్యక్షమైన విష్ణువును నుతించిన తరువాత వైష్ణవేతరులైన మూర్ఖుల గురించి చెబుతూ

కొందఱు మూఢులు గురుతత్వధీవాత
         భావతావన్మాత్ర దేవతోప
నిషదాగమములు కొన్ని యెఱింగికొని స్వమ
         నీషానుసారైకనియతమహిమ"

(నార. 382 పు 260. ప)

అని ఉపనిషదాగమాలు దేవవాఙ్మయంగా విస్పష్టంగా వక్కాణించాడు. నరసింహకవి ఉపనిషత్తులను వేదాలవలె దేవవాఙ్మయంగా భావించబట్టే, అటు హిరణ్యకశిపుని నోటివెంట, యిటు శ్రీ మహావిష్ణువు నోటితోసైతం ఉపనిషద్విషయాలను ప్రస్తావింపజేసినట్లు కనిపిస్తున్నది.

పురాణగాథల కాలనిర్ణయంలో వ్యత్యాసాలు - స్వవచనవ్యాఘాతాలు

పురాణం వివిధవేదార్థాలను సూటిగా ప్రతిబింబస్తాయని నరసింహకవి యీ క్రిందిపద్యంలో విస్పష్టంగా వక్కాణించాడు.

"బహువాదమూలమై భాషించు వేదంబు
        యజ్ఞకర్మక్రియాచ్యంబు వేద
మఖిలగృహస్థాశ్రమస్ఫూర్తి వేదంబు
        స్మృతి మర్మవిద్యయౌ హృద్యవేద