పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుపనిషత్పక్షంబున కాక్షేపంబు పుట్టించి ప్రాణసంహారపర్యంతంబు ననుదినంబును భయంబు నొందించి ఖలులు సత్పురుషులచేతఁ దత్పక్షంబు విడిపించిరి. కొందఱు బాహ్యమతవిషాబ్ధి మునింగిరి. కొందఱు నూరుసూరులు వహ్నిపరీతంబులైన భవనంబులు విడిచినయట్లు నిజదేశంబులు విడిచి చనిరి. బాహ్యాగమ్యదేశంబుఁ బ్రవేశించి సూరులు మఱికొందఱు దీనులై కానంబడక విష్ణువును భజించిరి. సంసారవిషవారాశియందు నమృతంబైన వేదాంతదర్శనంబు తద్ద్వేషోదధినిమగ్నంబై యుండిన విషయకాంక్షులగు సురలకు వేదాంతవిచారంబులు వలువదు. సాత్వికు లాసురభయంబున వేదాంతంబు నుడవ వెఱతు రది గావున వైష్ణవుల కిచ్చట నిలువం జనదని సనకాదులు హరిమాయాప్రభావంబు ప్రశంసింపుచు బ్రహ్మాండంబు వెడలి మహాభూతావరణంబునకుం జని." (నార. 378. పు. 249. వ) అని వివరించాడు. శ్రీమహావిష్ణుమహత్తరశక్తిని వర్ణిస్తూ "శ్రీ మద్విభూతిం దనరునితండు సర్వోపనిషదగ్ధంబు, మహాప్రభువు." (నార. 499 పు. 235. వ.) అని సర్వోపనిషదర్థస్వరూపుడుగా పేర్కొన్నాడు.

పరబ్రహ్మతత్త్వాన్ని వివరించే సందర్భంలో సర్వాంతర్యామి అయిన హరిని వర్ణిస్తూ "ఇందునకు 'యో బ్రహ్మణా విదధాతిపూర' మ్మను నుపనిషద్వాక్యంబు గలదు." (నార. 326. పు. 33. వ) అని ఉపనిషద్వాక్యాన్ని ఉదాహరించాడు. నరసింహకవి అనేక ఉపనిషత్తులను ప్రత్యేకంగా పరిశోధించినట్లు కనిపిస్తున్నది. మామూలుగా పండితమండలిలో ఉపనిషత్తులు అష్టోత్తరశతసంఖ్యకే పరిమితాలని ఒక అభిప్రాయం వున్నా కల్పితాలుగానో, కాకుండనో 120 వరకూ ఉపనిషత్తులు అవతరించాయి. నరసింహకవి 'విశ్వైక్యోపనిషత్తు' అనే పేరుగల ఒక ఉపనిషత్తును పరిశోధించినట్లు జీవపరమాత్మల భేదసిద్దిగురించి వివరించే సందర్భంలో "తేజంబు వోయినవెనుక మందిరం బంధకారావృతంబయిన నంధకారంబ యని యందురు; ఇత్తెఱఁగున విశ్వైక్యోపనిషద్వాక్యంబులకు గతి గలిగియుండుటం జేసి యైక్యవాక్యంబులకు శ్రుత్యేపికావగతమహదార్యచేతనైక్యవాక్యంబులకు ముఖ్యార్థహీనత యెక్కడిది?" (నార. 390. పు. 14. వ.) అని విశ్వైక్యోపనిషద్విషయాన్ని పేర్కొన్నాడు. అంటే నరసింహకవికాలంలో వున్న విశ్వైక్యోపనిషత్తు మన కిప్పుడు లభ్యం కాలేదు కాబట్టి, ప్రాచీనకాలంలో ప్రామాణికాలుగా భావించబడిన ఉపనిషత్తులు కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయని మనకు తేటతెల్ల మవుతున్నది. విష్ణుమహిమ-ఉభయపదప్రాప్తి గురించి వర్ణిస్తూ "శ్రుతి స్మృతులే తదర్థనిర్వాహకంబులై యుండు? (నార. 364. పు. 189. వ.) అని ఉపనిషత్తులను విడిచిపెట్టి శ్రుతి, స్మృతులను మాత్రమే ప్రామాణికాలుగా పేర్కొన్నాడు. అయితే ఆధునికా లనబడుతున్న ఉపనిషత్తులు