పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


"తెలిపగఁ ద్రిపాద్విభూతి నతిక్రమించి
యే పురుషుఁడుండు శుద్ధ సమిద్ధ మహిమ
నాతఁ డాద్యుండు పరమాత్మ యవ్యయుండు
ఘనతరుండు పరంజ్యోతి యనియె శ్రుతియు."

(నార. 344 పు : 113. ప)

ఉపనిషద్విద్యలపరంగా నరసింహకవి వివిధ ఆవరణల విషయాలను పండితైకవేద్యంగా, వేదవేదాంతవేద్యంగా, అతివిపులంగా వర్ణించాడు.

ఏ యే యావరణంబుల
నే యే లోకంబు లుండు నెఱిఁగింపుము నా
కా యుపనిషదుక్తుల విని
యా యజముఖ్యులు నిజాలయస్పృహ విడువన్.

(నార. 345. పు : 120. ప)

అని శకునిచేత ప్రశ్నింపజేసి పంచావరణాగణ్యనియతలోకాలను పరాశరాత్మజునిద్వారా, ప్రకృష్ణంగా తెలియజేశాడు. వైష్ణవుల వైశిష్ట్యం గురించి వర్ణించే సందర్భంలో "ఇది మొదలుగా నేతద్వాక్యోప బృంహిత మహోపనిషదాద్యుపనిషత్తులయందును హరి లాంఛనంబు వహింపఁగా వలయునని వినంబడియె మరియు" (నార. 351 పు : 136. వ.). వైష్ణవ ప్రతికూలానుకూలానుభయభేదాలను వివరించే సందర్భంగా -

"గురుభక్తిమైఁ బ్రతికూలానుకూలాను
       భయభేదముల నేరుపడిన చేత
నుల నెఱింగి సుధీజనుండు నిజాధిక
       రోచితంబుగఁ దగు నాచరింప
నుపనిషన్మతవాక్యయోజన నూహించి
       హరి సమాధిరహితాత్ముఁ డనిన"

(నార. 353. పు : 150 ప.)

అని వైష్ణవవిభేదాలన్నీ ఉపనిషన్మతసమ్మతాలుగానే పేర్కొన్నాడు. అనంతరం వేదాంతమతవైశిష్ట్యం గురించి వివరిస్తూ "బాహ్యదృష్టులు లేని దేశంబునకుం జని నైమిశాది పుణ్యక్షేత్రంబుల విజ్వరులై పరబ్రహ్మోపనిషద్భావనం గొందరు ప్రవర్తిల్లుదురు" (నార. 377. పు : 247. వ.) అని పరబ్రహ్మోపనిషద్విషయాన్ని ఉదాహరించాడు. తరువాత ఉపనిషద్పక్షవ్యతిరేకులైన దుష్టులు సత్పురుషులను దుర్మార్గాలలో యేవిధంగా పెడతారో పేర్కొంటూ "మరియు