పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని మాత్రమే కాదు వేదవిజ్ఞానవిరుద్ధబుద్ధులైన మానవులను ఆశ్రయించి బ్రతకడం కంటే చావడం మేలని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నరసింహకవి "నిగమాంతనిషేధకులైన వారి నాశ్రయించి బ్రతుకుటకంటెఁ దనుత్యాగంబు సేయుట మేలని బాహ్యదృష్టులు లేని దేశంబునకుఁ జని నైమిశాది పుణ్యక్షేత్రంబుల విజ్వరులై పరబ్రహ్మోపనిషద్ భావనం కొందఱు ప్రవర్తిల్లుదురు" (నార. 377-పు. 247-వ) అని స్పష్టంగా పేర్కొన్నాడు. ధర్మాధర్మాభిమానదేవతలతోపాటు ప్రత్యేకవిశిష్టతతో వేదాభిమానదేవతను సైతం ఒక అపూర్వదేవతగా వర్ణించిన నరసింహకవికి ఇంతటి వేదాభిమాన ముండడంలో మనం ఆశ్చర్యపడవలసిం దేమీ లేదు. నరసింహకవి ప్రబోధనీమహిమ గురించి వర్ణించిన సందర్భంలో వేదవాఙ్మయంయొక్క మహత్తత్వంగురించి యెంతో మహోన్నతదృక్పథంలో వర్ణించాడు.

"బహువాదమూలమై భాషించు వేదంబు
          యజ్ఞకర్మ క్రియాద్యంబు వేద
మఖిల గృహస్థాశ్రమస్ఫూర్తి వేదంబు
          స్మృతి మర్మవిద్య యా హృద్యవేద
మమిత పురాణ రహస్య తంత్రము వేద
         మాదిత్య పురుష జన్మములు జగము
లట్లైన వాఙ్మయంబంతయు నీ పురా
         ణంబులయందె ధన్యత వహించె
నట్లు గానఁ బురాణార్థ మధికతరము
తెలియ వేదార్థమునకంటె వెలయుననుచు
సుప్రతిష్ఠము చేసిరి సూటిగాఁ బు
రాణములయందు వేదతంత్రంబులెల్ల.

పరమార్థం బెఱుంగలేక యల్పశ్రుతులైన వారు మదర్థం బితిహాస పురాణ స్మృతి నిర్ణీతంబైన దానిం జెఱుతు రని వేదంబులు పలుకు. వేదంబునందు గ్రహసంచారంబును లగ్నశుద్ధియుఁ దిథి వృద్ధి క్షయంబులు గాన్పింపవు; యాజ్యాయాజ్యులు నేర్పడరు; బ్రహ్మహత్యాదులకుఁ బ్రాయశ్చితాదులు నిర్ణయింపఁబడవు" - (నార. 275 పు. 54-వ) అని నరసింహకవి వేదవాఙ్మయమహత్తత్వాన్ని వర్ణించి వేదంలో గ్రహసంచారాది విషయాలు లేవని విస్పష్టంగా పేర్కొనడం ద్వారా తన వేదఖగోళవిషయ అనభిజ్ఞతను వెల్లడించాడు. వాస్తవానికి వేదవాఙ్మయం బహుముఖమైన ఖగోళ జ్యోతిర్మంత్రతంత్రాది విషయాలకు