పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శక్తు లవాఙ్మానసగోచరంబులని పురాణంబులం జెప్పంబడియె. ఉత్పత్తి స్థితి లయంబులయందు సర్వశక్తులు భగవంతునికే కలవు. శ్రుతి స్మృతులే తదర్థనిర్వాహకంబులై యుండు." (నార. 364-పుట. 189-వ) ప్రత్యేకించి ఈ ఉభయపదప్రాప్తివిషయకసందర్భంగానే ఈక్రింది వచనంలో నరసింహకవి వాక్యసైతంగా యజుర్వేద ప్రామాణికతను పేర్కొన్నాడు.

"ఈ యజుర్వేదంబు సత్వదవాఙ్మాననవిత్తముండవై నన్నెఱుంగక యట్లు "సహోవాచ వ్యాసః పారాశర్య" యని నిస్వోదేరితార్ధంబునందు నే వచనము ప్రమాణంబుగాఁ బలికె నింతకంటె నిన్ను నెట్లు నుతింపవచ్చు నీవే లోకోత్తరుండ వగుట." (నార. 366-పు. 195. ప.) నరసింహకవి అన్యస్థలాలలో జీవపరమాత్మలకు భేదం సిద్ధమై ఉంటుందని జీవబ్రహ్మలూ దేహదేహివత్త్వాలను పొందుతారని వేదమంత్రప్రమాణపూర్వకంగా నిరూపించాడు. శ్రుతికి వ్యాకరణం అంగం అని పేర్కొంటూ "శ్రోతామాన్తా" అని వేదోక్తచేతనాన్యత్త్వాన్ని వక్కాణించి అనంతరం జీవపరమాత్మల భేదసిద్ధిని వక్కాణిస్తూ ఈ క్రింది వేదమంత్రాన్ని ఉదాహరించాడు.

"క్షరం ప్రధాన మవృతో౽క్షరః
క్షరాత్మనా విశతే దేవమేకం,
భోక్తా భోజ్యం ప్రేరితారం చమత్వా
జుష్టస్తస్మాదమృతత్వమేతి."

(నార. 389-పుట. 14-వ)

ఈ సందర్భంలోనే అఖిలహేయప్రతిభటత్వం విష్ణువు సొమ్ముగా వర్ణిస్తూ "తమేవ విధి" ఇత్యాది "మృత్యుమేతీ" త్యాది "వేదవాక్యంబ విద్యావిషయభూతుండ" - (నార. 392-పుట. 22-వ) అని వేదవాక్యాలను ఉదాహరించాడు. ధర్మాధర్మాభిమానదేవతలు ఆత్మవృత్తి ప్రకారంగురించి తెలుపుతూ "వేదార్థం బైన మిక్కిలియుం న్నెఱుంగరు; సర్వశబ్దంబులకును లోకంబుల యందుఁ గార్యాన్వితార్థత గల దాలిజాదికంబునకు లౌకికంబునందుఁ గార్యాన్వితార్థత్వంబు లేదు గాని లౌకికమైన 'గామాన' యేతి వాక్యంబునం దానయము కార్యంబుగా దాపద మేమిటి చేతఁ గార్యాన్వితార్థ మయ్యెడి" (నార. 404-పు. 51 వ) అని వేదవిషయాలను వివరించాడు.

నరసింహకవి అపూర్వ అమేయ వేదాభిమానదేవతకు పరమభక్తుడుగా కనిపిస్తున్నాడు. తనకున్న అనుపమానమైన వేదాభిమానాన్ని యెలుగెత్తి చాటడంకోసం సనకాదులను విష్ణువు కరుణించినవిధం గురించి వర్ణించిన ఘట్టంలో వేదవైశిష్ట్యంగురించి పేర్కొంటూ వేదవిజ్ఞానరహితులైన వ్యక్తులు జీవించడంకంటే