పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వక్కాణించాడు. (నార. 328 పుట. 41-ప). అనంతరం ఈ బ్రహ్మవిద్యారహస్యవిషయకంగానే ఒకవంక శ్రుతిప్రామాణ్యాన్ని పేర్కొంటూనే మరోవంక బ్రహ్మసూత్రప్రామాణ్యాన్ని సైతం పేర్కొన్నాడు.

"భవాదృశబ్రహ్మవిత్పాదపద్మసేవాసుధ లేకక్షామమానవ హంసులైనవారికిఁ బ్రజ్ఞాజ్ఞప్తిపుష్టత యెక్కడిది. యజ్ఞాది శ్రుతి వలన బ్రహ్మవిద్య కర్మాంగకంబె యని వినంబడియె. ఆ బ్రహ్మవిద్యకు నశ్వంబునకు గమనసాధనంబులం బలె బ్రహ్మవిద్యకు సర్వాపేక్షయుం గలదని 'సర్వాపేక్షాచ యజ్ఞాదిశ్రుతే రశ్వవత్త'ని సూత్రం బొనర్చితివి అయినను నొకసందేహంబు గల దడిగెద."

(నార. 331-332-పు. 54-ప)

తరువాత పరబ్రహ్మరహస్యార్థాన్ని వర్ణిస్తూ "అత్రాయం పురుషః పరంజ్యోతిరూపం సంవద్య స్వేనరూపేణాభి నిష్పర్యతే అవహత పాప్మా విజరోప మృత్యుర్విశొకో విజిఘత్సో విపిపాసన సత్యకామ సత్ సంకల్ప" (నార. 343-పు, 112-ప) అని శ్రుతివాక్యాన్ని ఉదాహరించాడు. ఇదేవిధంగా వైకుంఠలోకాన్నిగుఱించి ఆవరణపంచకంగుఱించి వివరించే సందర్భంలో "మధ్యే మధ్యేత్వ సంఖ్యే యా స్తత్త ద్వ్యుహన్" (నార. 358-పు, 171 ప) అని శ్రుతివాక్యాన్ని ప్రామాణికంగా పేర్కొన్నాడు. అనంతరం విష్ణుమహిమ, ఉభయపదప్రాప్తి గుఱించి వర్ణిస్తూ మహావిష్ణువుయొక్క మహాశక్తిని అపూర్వ అమేయశక్తిని బహుముఖంగా వర్ణించే వేదమంత్రాన్ని సవివరంగా ఈక్రిందివిధంగా పేర్కొన్నాడు. ఈసందర్భంలో శ్రుతులతోపాటు స్మృతులతో సైతం తదర్థనిర్వాహకాలని శ్రుతులతరువాత స్మృతులకు స్థాన మిస్తూ స్పష్టీకరించాడు. నరసింహకవి అమోఘమైన విష్ణుశక్తిని గురించి వేదమంత్రప్రామాణ్యంతో వివరించిన ఘట్ట మిది.

"అపాణి పాదోజ వనోగ్రహితాపశ్యంత చక్షుః సశ్రుణోనకంనః
సవేత్యవేద్యం నచనశ్యవేత్తా తమాహు రగ్ర్యం పురుషం మహాంతమ్
నకస్యకార్యం కరణంచ విద్యతే నతత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే
పరాస్య శక్తే ర్వివిధైవ శ్రూయతే స్వాభావిక జ్ఞాన బలక్రియాచ"

యనిన నది హస్తంబులు లేక పట్టును. పాదంబులు లేక పఱువెత్తును. చక్షువులు లేక చూచును. కర్ణంబులు లేక వినును. అవేద్యంబైన యది యెఱుంగును. త న్నొకం డెఱుంగలేఁడు. అతండు మహాపురుషుం డని యెంతురు. అతనికిఁ గార్యకరణంబులు లేవు. అతనికి ముందు నధికుండు లేఁడు. అతనిశక్తి వివిధంబైన యదియై స్వాభావికంబులు జ్ఞాన బల క్రియలు. అతని వినుతింప నలవియగునె. భగవంతుని