పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యందుఁ బెక్కండ్రు నిర్భాగ్యద్విజులై కుమేధస్సులై పుట్టి యయాధాభిదైకదేశలేశులై తోఁచినట్లు వేదార్థనిర్ణయమునందు నింత యనియెడు పరిమితిని వేదంబునందు నింతయన్న పరిమితిని, కూపకూర్మసమానాభిమానులై వేదాంతసాగరంబుల నసంఖ్యేయంబులఁగా నెఱుఁగక దేవమాయామోహితులై తలంచిరి. సమస్తవేదంబులును గార్యపరమే కావలయునని తన్నయంబునం బలికి వేదంబునందును బదవాచ్యబుద్ధిలోకవ్యుత్పత్తిమూల మైనదియె; కార్యానన్వితసిద్దార్థవిషయమై లోకంబునందుఁ బదసంగతి లేదు."

(నార. 402,పుట.51-వ)

ఈ సందర్భంలో బ్రాహ్మణులు దేవద్వేషులై, నిర్భాగ్యద్విజులై, కుమేధస్సులై భూమిమీద పుట్టి వేదార్థవిధ్వంసం చేస్తారని నరసింహకవి సూటిగా వ్యాసమహర్షిచేత చెప్పించాడు. నరసింహకవి వెల్లడించిన యీ యభిప్రాయం నేను గతపదిహేనుసంవత్సరాలుగా బహుముఖాలుగా పరిశోధనలు చేసి రచించి ప్రకటించిన అనేకవ్యాసాలలో, రేడియో ప్రసంగాలలో ప్రాచీనవేదభాష్యాలు ప్రత్యక్షరప్రామాణికాలు కావని నిరూపించిన విషయాన్ని సుదృఢంగా బలపరుస్తున్నది.

నరసింహకవి వివిధవేదాలలో పరిశ్రమించాడనడానికి సాక్షీభూతంగా తననారదీయపురాణంలో వివిధసందర్భాలలో విభిన్నవేదమంత్రభాగాలను ఉటంకించాడు. "ఆత్మ-దేహాదుల" గుఱించి వివరిస్తూ వేదపురుషుడు నాకు తెలుసునని చెప్పే "వేదాః మేతం పురుషం మహాంతమ్" అనే వేదవాక్యాన్ని (నార. 327. పుట. 35-వ) ఉదాహరించాడు. బ్రహ్మవిద్యారహస్యవివరణసందర్భంగా

ఇలలోన బ్రహ్మవిద్యా
కలితులకుఁ బునర్భవములు గలుగవు పరుఁడై
వెలయు హరి నెఱిఁగి మృత్యు
ప్రళయముఁ దాఁటునని శ్రుతి తిరంబుగఁ బలికెన్.

(నార. 327-పుట. 40 ప)

అని శ్రుతిప్రమాణవిషయాన్ని పేర్కొన్నాడు. ఆ తరువాత "శ్రీవిష్ణుధామంబు పునరావృత్తిరహితం బని పార్థసారధి యద్గత్వా న నివర్తంతే తద్దామ పరమం మమ' అని యానతిచ్చె." అని భగవద్గీతావాక్యాన్ని ఉదాహరించినా "యేష దేవోవమో బ్రహ్మపథానేన పరంగతా ఇమమ్ మానవ మావ రంతే" యను శ్రుతి యున్నయది గానఁ బునరావృత్తిరహితం బని పార్థస్ఫురర్ధాము లగువారికి పునరావృత్తి యెక్కడిది యని కొంద ఱాడుదురు" అని శ్రుతిప్రామాణ్యాన్ని