పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రబలెఁ భ్రాంతాభ్రశుభ్రతరంగిణీత
రంగ రంగన్మహాఫౌనరాజి రాజి
తాజరపయస్సుధాలేపనాంచితోచ్చ
గోపురశ్రీలనగు మథురాపురంబు.

కృతిపతి అయిన శ్రీకృష్ణావతారవర్ణనానంతరం కథాప్రారంభం కాగా మహర్షులు శ్రీమన్నారాయణుని దర్శించి నుతించి యాదవశైలక్షేత్రమాహాత్మ్యాన్ని గురించి వివరించవలసిందిగా ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణువు యాదవశైలక్షేత్రమాహాత్మ్యాన్ని బ్రహ్మ సనత్కుమారునికి వివరించగా ఆ సనత్కుమారుని ద్వారా నారదమహర్షి తెలుసుకున్నాడనీ ఆ నారదుడే ఆయా యాదవశైలక్షేత్రమాహాత్మ్యాలను మీకు వివరంగా తెలియజేస్తాడనీ చెప్పి విష్ణువు అదృశ్యమవుతాడు. ఈ విధంగా కథాప్రారంభం కాగా ఆ తరువాత నారదుడు మహర్షులకు ప్రత్యక్షమై యాదవశైలక్షేత్రమాహాత్మ్యం వర్ణన పేరుతో యీమొత్తం నారదీయపురాణవిశేషాలను చెప్పినట్లు స్పష్టపడుతున్నది. కాగా యీపురాణం మూలగ్రంథం నారదప్రోక్తమై నారదపురాణంగా అవతరించింది. (చూడు - తె. నార. పు. 79, 90, 93, 94, 105 పుటలు)

నారదీయపురాణం - శ్రుతులు

శృతి స్మృతి పురాణేతిహాసా లన్నది సంప్రదాయసిద్ధంగా అనాదికాలంనుంచీ వస్తున్న అనుశ్రుతవాక్యంగా గతంలో పేర్కొనడం జరిగింది. తత్కారణంగా పురాణాలలో గాని వాటి సంగ్రహరూపంగా అవతరించిన ఉపపురాణాలలో గాని వేదప్రామాణ్యం గురించి పేర్కొనబడడంలో ఆశ్చర్యకరమైన విషయ మేమీ లేదు.

అయితే శ్రుతిప్రామాణ్యందృష్టితో చూచినప్పుడు ఆర్య ద్రావిడ భాషాకుటుంబభేదాలను అనేకమంది పరిశోధకులు విభిన్నమైనవిగా పేర్కొనడం జరిగింది. ఈ రూపంగా మూలద్రావిడభాషకూ ప్రాచీనసంస్కృతభాషకూ సంబంధం లేదని పెక్కుమంది భాషాశాస్త్రవేత్తలు ఒకానొక విశిష్టనిర్ణయానికి రావడంకూడా జరిగింది. కాని గత పదిసంవత్సరాలుగా ఆర్షవిజ్ఞానం దృష్ట్యా సృష్టి - మానవజాత్యుత్పత్తి - భాషోత్పత్తి - భాషోత్పత్తికి మూలభూతమైన ముఖయంత్రప్రక్రియాసంచలనాది విశేషాలను మూలాధారంగా చేసుకుని నేను చేసిన అగాధమైన పరిశోధనలవల్ల ఆర్య ద్రావిడ భాషాకుటుంబాలు ఏకైకకుటుంబకాలన్న సంగతి తిరుగులేనివిధంగా నిరూపితమైంది. ఈ సత్యాన్వేషణాలక్ష్యంతో నృత్యసంగీతాలలో- ఛందోవిశేషాలలో - రసాలంకారాదులలో - "మార్గ-దేశి" భేదాలు లేవని దేశి మార్గాంతర్గత