పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏకాశ్వాసకావ్యంగా రూపొంది ఆశ్వాసాలన్నింటిమధ్య సమన్వయం కుదరడానికి తగిన వాక్యనిర్మాణంతోనే సృజించబడిందనీ, తిక్కన కేతనాదులు మొదట గ్రహించి ఉంటే ఆశ్వాసాలతుదిని వివిధభక్త్యంతాలుగా పద్యములు వ్రాయడానికి ఉపక్రమించేవారు కారనుకుంటాను. కథానుగుణంగా సమన్వయానికి తగేట్లు వివిధవిభక్త్యాంతాలుగా రచించడంలో నన్నెచోడుని ఆంతర్యం తిక్కనాదులు గ్రహించకపోవడంవల్లనే అతడు వ్రాసినవిధంగానే ఆశ్వాసాద్యంతపద్యాలను వివిధవిభక్త్యంతాలుగా వ్రాయాలని ప్రయత్నించి, కొన్నిచోట్ల అన్వయరహితాలయిన పద్యాలను సృష్టించి పెట్టారు. ఇది పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లున్నది. తిక్కన నిర్వచనోత్తరరామాయణ ఆశ్వాసాద్యంతపద్యాలరచనలో కుమారసంభవంలోని ఆశ్వాసాద్యంతపద్యాలను దృష్టిలో ఉంచుకుని తానుకూడా ఆ విధంగ వివిధ విభక్త్యంతాలుగా వ్రాయాలనే వ్రాశాడు. ప్రథమావిభక్త్యంతాలుగా వ్రాసిన పద్యాలకు మామూలుగా కథతో సంబంధం లేకపోయినా, సమన్వయం ఎక్కడయినా కుదురుతుంది. కాని తిక్కన రెండవ ఆశ్వాసం చివర, ఆశ్వాసం మొదట ద్వితీయాంతాలైన పద్యాలు వ్రాశాడు - నాలుగవ ఆశ్వాసం చివర, అయిదవ ఆశ్వాసం మొదట తృతీయావిభక్త్యంతాలయిన పద్యాలు వ్రాశాడు. అయిదవ ఆశ్వాసం చివర ఆరవ ఆశ్వాసం మొదట, షష్ఠ్యంతాలు వ్రాశాడు. ఈ ద్వితీయ, తృతీయ, షష్ఠీ విభక్త్యంత పద్యాలలో ఏ ఒక పద్యానికి సమన్వయం కుదరనే కుదరదు. ఉదాహరణకు ఒక్కపద్యం చూడండి.

శ్రీరమ్యతా నిరూఢమ
హోరస్కుం బుణ్యసంపదుదితయశస్కుం
గారుణ్యార్ద్రమనస్కుఁ బ్ర
జారంజనశీలు మనుమజగతీపాలున్

అని నిర్వచనోత్తరరామాయణం తృతీయాశ్వాసాదిలో మనుమసిద్దిపరంగా నున్న పద్యం యిది. "హరిగని దేవ దూ" అని యీ పద్యంతరువాత ద్వితీయావిభక్తి యుక్తమై కథాప్రారంభ మవుతుంది. అయితే మనుమసిద్దిపై ద్వితీయావిభక్త్యంతంగా పద్యం వ్రాయాలని యెక్కడున్నది? పోనీ అలా వ్రాసినప్పుడు ఆ పద్యానికి అన్వయం కుదిరేట్లు దాని తరువాత మరోవచనమయినా వ్రాయాలికదా ! అటువంటి వచనం ఏమీ లేకపోవడంవల్ల పైపద్యం అంతకు ముందున్న రెండవ ఆశ్వాసాంత పద్యాలు నిరర్ధకాలవుతున్నాయి కదా! "మనుమజగతీపాలున్" అని ముగించితే అది సంపూర్ణవాక్యయుక్తం కాలేదు గదా! "మనుమసిద్ధిని శ్రీరాముడు రక్షించునట్లుగా నాచెప్పంబూనిన యనంతర