Jump to content

పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాయెంకి


నన్నిడిసిపెట్టెల్లినాడే,
నా రాజు,
మొన్నె తిరిగోస్తనన్నాడే!
నీలు తేబోతుంటె, నీ తోడె_ వోలమ్మి!
నా యెంటె యెవరోను నడిసినట్టుంటాదె!
నన్నిడిసిపెట్టెల్లినాడే,
నా రాజు......

అద్దములొ సూత్తుంటె అది యేటొ సిగ్గమ్మి!
నా యెనక యెవురోను నవ్వినట్టుంటాదె!
నన్నిడిసిపెట్టెల్లినాడే,
నా రాజు......

నల్లని యెన్నెట్లొ సాపేసి కూకుంటె_
ఒట్టమ్మి_ వొల్లంత ఉలికులికి పడతాదె!
నన్నిడిసిపెట్టెల్లినాడే,
నా రాజు....

నీతైనవోడె, నా రాతెట్ట గుంటాదొ!
కళ్లల్లో సత్తెముగ కట్టినట్టుంటాడె!!!
నన్నిడిసిపెట్టెల్లినాడే,
నా రాజు....
మొన్న తిరిగోస్తానన్నాడే!!!

యెంకి పాటలు 11