తిరుమల తిరుపతి యాత్ర/రెండవకూర్పు సమపీఠిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రెండవకూర్పునకు పీఠిక.


ఈ పుస్తుకము మొదటికూర్పు అయిపోయి రెండవకూర్పు వేయనవసరము గలిగి నందున యాత్రికుల కుపయోగార్ధము తీర్థములు గుఱించి ఒక్క అధ్యాయము చరిత్ర అనునొక అధ్యాయము నిందు చేర్చబడి ఈ దేవస్థాన మిపుడెటుల పాలింపబడుచున్నదో ఆపద్ధతియు నించుక నిక్కడ వివరించెదను.

శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానము క్రీస్తు శకము 1646-వ వత్సరము వరకు హిందూ రాజుల వలనను, క్రీస్తు శకము 1801-వ వత్సరము వరకు మహమ్మదీయ రాజుల వలనను, అనంతరము ఇంగ్లీషు ఈస్టు ఇండియా కంపెనీ వారి వలనను పాలింపబడెను. (Vide Gazetteer of South India & Volume 5 of the Imperial Gazetter of India.)

గౌరవ నీయులగు కోర్టు ఆఫ్ డైరక్టర్సు వారును, గవర్నమెంటు ఆఫ్ ఇండియా వారును 1840-1841 సంవత్సరములలో దేవాలయములు, మసీదులు; మతసంబంధమై జనులు జేరునటువంటి ఇతర ప్రదేశముల పారిపాలన విషయమై సర్కారు ఉద్యోగస్థులు ఏమాత్రము ప్రవేశించ గూడదనియు అప్పుడు సర్కారు వారి ఆధీనములో నుండు నటువంటి దేవాలయములు మొదలగువార్లను ఆయామతమునకు చేరిన వారికే స్వాధీనము చేయవల్సినదని ఆజ్ఞాపించిరి. 1841 సంవత్సరములో ఆ ఉత్తరవు ననుసరించి ఆలోచన సభతో కూడిన మదరాసు గవర్నరు గారు రెవిన్యూబోర్డు వారిని తగు చర్యలను తీసుకోమని వ్రాసిరి. సర్కారు వారు పరిపాలించుచుండిన దేవాలయములు మొదలగు అన్నిటికి ట్రస్టీలను ఏర్పరచి వారిస్వాధీనము చేయునపుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానములో మిరాశీ కైంకర్యపరులయిన పెద్దజియ్యంగార్లును, ఇతర కైంకర్యపరులును కొందఱు జమీందారులును ఈ దేవస్థానం విచారణ కర్తృత్వము తమకు దయ చేయవలయునని కోరినను 1843 సంవత్సరము ఏప్రల్ నెల తే 21 దిలో ఆలోచన సభతో కూడిన మదరాసు గవర్నరు వారు అప్పటి శ్రీ హత్తిరాంజి మఠాధిపతీ వారైన శ్రీమహంతు శేవాదాసుజీ వారిని శ్రీ వేంకటేశ్వరస్వామి వారు వగైరా దేవస్థానము విచారణకర్తలగా అంగీకరించి వారి తదనంతరం వారి శిష్యులు ఎవరు వారిస్థానమును అలంకరించెదరో వారు దేవస్థానపు కార్యమును జరిపించవలయునని ఏర్పాటు చేసిరి. ఈ ఏర్పాటు ననుసరించి 1843 సంవత్సరం జూలై నెల తే 10ది నాడు శ్రీ మహంతు శేవాదాస్ జీ వారి పేరిట ఒక్క సన్నదుపుట్టి శ్రీ వేంకటేశ్వర స్వామి వగైరా దేవస్థానములును, వార్లకు చేరిన ఆభరణములు వస్త్రములు, వాహనములు, విగ్రహములు మొదలగు సొత్తులను వారిస్వాధీన పరచినందున తదాదిగ నీ దేవస్థానములు శ్రీ హత్తిరాంజిమఠము మహంతుల వారి విచారణకర్తృత్వమునకు లోబడి పరిపాలింపబడుచున్నవి.

ఈ దేవస్థానములకు 1907–వ వత్సరములో ప్రీవికౌన్సిల్ తీర్మానము ననుసరించి యొక స్కీము (Schemes) ఏర్పడినది. ఈస్టు ఇండియా కంపెనీ వారు ఈ దేవస్థానములు శ్రీమహంతుల స్వాధీనముచేసినది మొదలు ప్రస్తుతపు శ్రీవిచారణకర్తల వారయిన శ్రీమహంతు ప్రయాగ దాస్ జీ వారు ఆరవ విచారణ కర్తగా నున్నారు. స్కీము ఏర్పడిన తర్వాత మొదటివారు. వీరు 1900-వ సంహత్సరమున నీహాదాకు విచ్చేసి మరువర్షంబున మైనారిటి తీరిన తర్వాత స్వయముగా నధీకారము జూడ ప్రారం భించిరి. దేవస్థానములు శ్రీమహంతుల స్వాధీనము జేయుసరికి వత్సరంబునకు సుమారు 1.5 లక్ష రూపాయలు రాబడి ఉండెను. 1906-1907 వత్సరములో రు. 4, 43, 158-9-9లు రాబడి వచ్చెను. 1919–1920 వత్సరమున అనగా 1329 ఫసలీలో 14, 97, 267-18–4 రాబడి గల్గెను. ప్రస్తుతపు శ్రీవిచారణకర్త లైన శ్రీమహంతు ప్రయాగదాస్ జీ వారి వలన ఖరీదు చేయబడిన రెండు తాలూకాలు అనగా తిరుతని కచ్చినాడు తాలూకాలు వలన రాబడే 4 లేక 5 లక్షల రూపాయలు కూడ పై మొత్తములో చేరియున్నది. తిరుతని కచ్చినాడు తాలుకాలు గాక కార్వెటి నగరం సంస్థానములో చేరిన అత్తిమాంజేరి మొదలు 62 గ్రామాదులు కూడా ఇటీవల ఖరీదుకు తీసియున్నారు.

తిరుపతిలో నొక హైస్కూలు వేలూరులో నొక హైస్కూలు ఉంచబడి పరిపాలింప బడుచున్నవి. తిరుపతిలో నొక సంస్కృత పాఠశాల కలాశాలగా చేయించి అందులో ఒక ఆయుర్వేద శాఖను కూడా ఏర్పరచి విద్యార్థులకు బసభోజనములిడి విద్యా బుద్ధులు గరపుటకు శ్రీ విచారణ కర్తలవారు ఏర్పాటు చేసియున్నారు. ఇంతియగాక ఆయుర్వేద శాఖకుచేరి ఒక ఆయుర్వేద వైద్యశాలయు తిరుమలలో నొక డిస్పెన్సరియు ఏర్పరచి జనులకు ధర్మార్ధముగ మందు లిప్పించుచున్నారు. యాత్రికులకు తిరుమల తిరుపతిలో భోజన సదుపాయములు జేసినారు. బసలకు సత్రములునిర్మించుచున్నారు, ఇంకను తిరుమలలో నీటివసతికి, శాని టెషనుకు అనేక పనులు జేయించుచున్నారు. తిరుమలలోను మార్గమునందును వెన్నెల చీకటి అను భేదము లేక అటవీ మృగబాధతొలగించి రేయింబగలను భీతి లేక జనులు సంచరించునటుల వాషింగ్ టన్ లైట్లు మొదలగు దీపము ఏర్పాటు చేసినారు. తిరుమలలో యాత్రికుల చంటి పిల్లలకు ధర్మారముగ ఆవు పాలిచ్చుటకు ఏర్పాటు చేసినారు.

శ్రీ విచారణకర్తల వారివద్ద మంత్రిగ దివాన్ పేష్కార్ అనుహోదాలో నొక ప్రధానోద్యోగి గలరు. వారు దేవస్థాన ములు, తాలూకాలు మొదలగు అన్నిటిని పాలించుదురు. వీరు శ్రీ విచారణకర్తల వారి ఖచేరిలో నుండెదరు. వీరి చేతిక్రింద తిరుమలమిదపారుపత్య దార్ ప్రధానోద్యోగస్థుడు. (Chief ministeriel officer on Hills)

తిరుపతి దేవస్థానపు ట్రజరర్ (ఖజాన్జి) అనునుద్యోగి గలరు. వీరుస్కీము ప్రకారము జిల్లా జడ్జిగారివలన నియమింపబడి దేవస్థానములోనుండి జీతము పుచ్చుకొనెదరు. దేవస్థానపు సొమ్ము వీరి స్వాధీనములో నుండును. వీరు శ్రీ విచారణకర్తల వారి వలన అంగీకరింపబడిన (ప్యాసు చేయబడీన) బిల్లుల ప్రకారము సొమ్ముబట్వాడా చేయించుచున్నారు.

వత్సరమునకు కొక సారి లేఖలను తనిఖీ చేయుటకు చిత్తూరు జిల్లా జడ్జికోర్టు వారు ఒక్క ఆడిటర్ ను నియమించెదరు. ఆడిటర్ల రిపోర్టులు సరిగా లేనంతట అట్టిలోపములను శ్రీవిచారణకర్తలవారు చూపించుట గలదు.

గ్రంధబాహుశ్యము గాకుండ నిందు దేవస్థానముల పరిపాలన పద్ధతి సూక్ష్మముగా వివరించినందుకు చదువరులు మన్నించెదరు గాక .

ఎన్. వి. లక్ష్మీనరసింహారావు

తిరుమల

5-9-23