తిరుమలై తిరుపతి యాత్ర/అధ్యాయము 8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నది. గర్భాలయము అనఁగా బంగారువాకిలిదాటి వినూనప్రదక్షణములో దేవతలగు శ్రీయోగనృసింహస్వామి శ్రీవరదరాజ స్వామి దేస్థానములున్ను భక్తులగు శ్రీభాష్యకారులు, శ్రీ సేనాధిపతి, శ్రీగరుడాళ్వార్ల దేవస్థానములు గలవు. వంటశాలలో శ్రీవకుళమాలికా దేవిగడిగలదు. ధ్వజ స్తంభము వద్ద క్షేత్రపాలకశిలగలదు. ఇచ్చటనే అర్చకులు ఇంటికి వెళ్లునపుడున్ను దేవస్థానమునకు వచ్చునపుడున్ను బీగముచెవులు తాకించి వెళ్లవలెను. క్షేత్రపాలకులుపూర్ణకళతో గోగర్భమువద్దనున్నారు. వీరి ప్రభావము గుణించి అనేక కథలుగలవు.

26. ముద్రమండపం.

ఎవరయినను శ్రీవారిదేవస్థానములో తప్తాంకితముచేను కొనవలెనన నఫరు 1–కి ర్పు 0-12–4 పంతున పారుపత్యదార్ ఖచేరిలో చెల్లించినయెడల ఒక్క శ్రీవైష్ణవ బ్రాహణునిచే వారికి చక్రాంకితము కావింపబడును.

***

అధ్యాయము. VIII.

తీథ౯ములు.

ఈ పర్వతమున 360 తీర్థములుగలవనియు అందులో కొన్ని అంతర్థానమనియు, కొన్ని మిగుల కష్టసాధ్యమనియు చెప్పెదరు. యాత్రికులకు సులభ సాధ్యములగు తీర్థములు కొన్ని, గలవు.

1.శ్రీస్వామిపుష్కరిణి.

ఈ తీరమునుగురించి అనేక పురాణములు బహు తెరంగుల వర్ణించినవి. ఏ పురాణములో జూచిననీతీర్థ మహాత్మ్య
తిరుమల తిరుపతి యాత్ర.pdf
తిరుమల తిరుపతి యాత్ర.pdf
87
తిరుమల తిరుపతియాత్ర.

మద్బుతముగా చెప్పబడినది. గ్రంధబాహళ్యమగునని స్వల్పము నిందు చెప్పబడినది.

శ్రీస్వామి పుష్కరిణి గంగాది మొదలగు సర్వతీర్ధములకు జన్మభూమనియు, పంచమహపాతకములు పోగొట్టినదియు, స్నానమాత్రమున నై హికాముష్మికములు నిచ్చునదియునుగ వైకల్య దోషములను బోగొట్టునదియు, వైకంఠముునుండీ మహావిష్ణు అమవార్లసహా క్రీడార్ధం శ్రీస్వామిపుష్కరిణి తీర్ధమునకువచ్చి నారనియు మొదలగు మహిమవర్ణింపబడినది.

శ్లో. స్వామి పుష్కరిణీ పుణ్యా సర్వపాపప్రణాశిని|
వైకుంఠె భగవత్క్రిడా వాపశ్రీ భూమిలా||

 

శ్లో. అపాకృతజకాఘచనుగన్ధా సుమనోహరా|
గజ్ఞాదిసర్వతీర్ధానాం జన్మభూమి శ్శుభోదకా||

 

శ్లో. ఆనీతా నైనతేయేన క్రీడార్ధం తత్ర తిష్టతి|
విరఃకొవడ్రజోదోష ప్రముఖాఘవినాశిని||

వరాహపురాణం

ఈ తీర్థములో మధ్యగనొక చక్కని రాతిమంటపము గలద.అందు దశావతారములు శిలలోబాగాశిల్పము దయబడినవి. ఈమంటపము నాలుగు వత్సరముల క్రిందట జీర్ణోధారము జేయబడినది.

ఈ తీర్షము శ్రీవారి దేవస్థానమునకుత్తరభాగమున ప్రాకారమునకు మూడుగజములదూరమున నున్నది. యాత్రి కులందఱు నిండు స్నానము చేసి శ్రీవారి దర్శనముగావించెదరు.

ధనుర్మాసములో శుక్లపక్షద్వాదశి అరుణోదయము ఈ తీర్థమునకు ముక్కోటి. శ్రీవారి దేనస్థానంనుండి చక్రతాళ్వార్

88 తిరుమల తిరుపతియాత్ర.

వేంచేసి స్నానముగావించెదరు. అప్పుడు విశేషముగ జనముండి చక్రతాళ్వార్తోగూడా స్నానమొనర్చెదను.ఈ సమయమున సర్వతీర్థములందుండుననియు దేవతలందరచ్చట స్నానముచేసెదరని చెప్పెదరు.

శో.ధనుర్మాసే సితే పక్షే ద్వాదశ్యామరుణోదయే|
ఆయా న్తి సర్వతీర్ధాని స్వామిపుష్కరిణీజ లే||

శ్లో.తత్ర స్నాత్వా సరస్సద్యోము క్తిమేతి న సంశయః|
యస్య జన్మసహస్రేషు పుణ్యమేవార్జితం పురా||

శ్లో.తస్యాస్నా నంభ వేద్వి ప్రానాన్యస్యత్వ కృతాత్మా నః|
విభవాసుగుణందానం కార్యం తత్ర యథావిధి||

శో.సాలగ్రామశిలాదానం గాం దద్యాచ్చవి శేషతః|
యే శృణ్వన్తి వ కథాం విష్ణో స్సదాభువనసానసమ్||

స్కన్దపురాణము.

శ్రీవైకుంఠ తీర్థము.

శ్రీ స్వామి పుష్కరిణికి ఈశాన్య భాగమున రెండు మైళ్ల దురమున నొక గుహగలదు. దీని పేరు వైకుంఠ గుహ యని వాడెదరు. ఈగుహలోనుండి తీర్థము సదానచ్చుచుండును దీనిని వైకుంఠ తీర్థమనెదరు. శ్రీరాములవారు పంపానదీ దాటి వానర సైన్యముతో లంకకుఁ బోవుచున్నప్పుడు శ్రీ స్వామి పుష్కరిణి తీరమున నిల్చిరి. వానర బలపరాక్రమ శాలురైన గజ గవాక్ష గవయస్సర భగంధమాధ నాదులు, సింహతుల్య పరాక్రమశాలురు ఆగుహ ప్రవేశించిరి. కోటిసూర్య ప్రకాశ మానమైన నొక తేజస్సును, ఒక పట్టణమును జూచిరి.
తిరుమల తిరుపతి యాత్ర.pdfతిరుమల తిరుపతి యాత్ర.pdf
శ్లో.

తత్ర కాచిత్పురీ రమ్యా త ప్తాహాటక నిర్మితా।
కవాటతోరణవతి రమ్యోద్యాశతైక్యతా॥


శ్లో.

స్ఫటీకోపలవచ్చుద్ధజలనద్యా సమానృతా।
రత్న మాణిక్య వైడూర్యముక్త నిర్మిత గోపురా॥


శ్లో.

అనేక మండ వైర్యుక్తా ప్రాసాశతి సంపలా।
మహావీధి శతోపేతా కదమాతంగా సంయుతా॥


శ్లో.

వరనారీగణోపేత సర్వమంగళశోభిత।
శంఖచక్రధరాస్తత్ర సర్వేచైవ చతుర్భుజాః॥


శ్లో.

సశుక్ల మాల్యవసనాస్సార్వాభరణభూధి తా ।
దివ్యచందనాలిస్తాంగః పరమానందాపురితాః॥


శ్లో.

తన్మధ్యేసుమహద్దిన్యవిమానం సూర్యసన్నిభం।
అత్యున్నతమహామేరుశృంగతుల్యం మనోహరం॥


శ్లో.

బహుప్రకాశసంపన్నం మణిమండపసంయుతః।
భేరీమృదంగపణవమర్దలధ్వనిశోభితం॥


శ్లో.

నృక్తువాదిత్రసంపన్నం కిన్నరసవనసంయుతం।
దదృశుస్తత్ర పురుషం పూర్ణచంద్రనిద్ధభాననం॥


శ్లో.

చతుర్బాహుముదారాంగం శఖచక్రధరంపరం।
పీతాంబరధరం సౌమ్యమాసీనం కాంచసనే॥


శ్లో.

ఫణామణిమహాకాంతి విరాజితకిరీటినం।
భోగిభోగేసమాసీనం సర్వాభరణభూషితం॥


శ్లో.

అసనోపరివిన్య స్తవమే తరకరంభుజం।
ప్రసార్యదక్షిణంపాదము ద్ద్రు తేవామజాను॥

90 తిరుమల తిరుపతియాత్ర.

శ్లో.ప్రసార్య వామహస్తాబ్జం శ్రీభూమిభ్యాం నీషేవితం|
   సేవింగీశయా దేన్యవైజయంత్యావిరాజితం||

శ్లో.శ్రీవత్సకౌస్తుభోరస్కం వనమాలావిభూషితం|
   కృపారసతరంగౌఘ పూర్ణ నేత్రాంభుజద్వయం||

శ్లో.శశి ప్రభాసమచ్ఛుత్రం చానురవ్యజనేశుభే|
   హస్తాభ్యాం ధారయంతీ భిర్నారిభిస్సేవితం ముదా||

వరాహపురాణము.

ఈ ప్రకారము చూచుచుండగా చతుర్బాహువులు గల యొక పురుషుడుకట్టెతో కొట్ట వచ్చినట్టు కనపడ వారలందరు భయపడి గుహబయటికి పారివచ్చి యిదంతయు తన మిత్రులకు దెల్సి మహామాయి కామరూపీ మొదలగు వానర సముదాయ మంతయు బయలు దేరి వెళ్లి గుహయందంతయు పరిశీలించి అదేమియు గానక తిరిగి వచ్చిరి. ఈగుహ చొచ్చుట మునులకు యోగులకు కష్ట సాధ్యము. శ్రీమన్నారాయణ లీలావిలాసము చేత ఈవానర శ్రేష్టులకు శ్రీమహావిష్ణువుండు లోకము దర్శనమాయెను. కలియుగములో జనుల నుద్ధరించుటకు గాను శ్రీమన్నారాయణుడు ఈగుహలో ఈమాదిరిగా నుండును. ఈ ప్రభావము వినినంత మాత్రముననే కలికాలములో జనులకు దోషములు పోయి సమస్త సుఖంబులు బడయుదురు, ఈగుహలో నుండి వచ్చెడి తీర్థము సాక్షాత్ వైకుంఠములో నుండి వచ్చుచున్నందున నిండలి స్నాన ఫలము చెప్పనలవిగాదు.

3.పాండవ తీర్థము.

శ్రీ స్వామివారి దేవస్థానమునకు వాయవ్య మూలలో నుమారుమైలు దూరమున నొకతీర్థము గలదు. అది శ్రీక్షేత్ర
91
తిరుమల తిరుపతి యాత్ర

పొలకులచే కాపాడబడుచున్నది.ఇచ్చట ఒక్కసంవత్సరము నివసించి ఆతీర్ధము స్నాన సముల ఉపయోగించుచుండి అంతటా దక్కము క్షిణించును పుణ్యము సమకూరును. ఇదే మాదిరి పాండవులీతీర్ధముదొక సంవత్సరము నివసించి ఒక దుఃస్వప్నము గాంచిరి.అనంతరము యుద్ధములో జయించి రాజ్యమును సంపాదించిరి .ఇందు స్నానము చేసిన కారణమున జనులు దుఃఖ బాహ్యులై సుఖము బడియుదురు.

శ్లో.వృషభాస్థేరవౌ రాడేదేవదాస్యా    
శుక్లే వాప్యశవా కృష్ణ పక్షే భౌనుమన్వితే||

శ్లో.తథేపాండవనా మ్యాత్రణజ్ఞనేన్నతి యోనర|
నేహాదుఃఖ మవాప్నోతి పఠ త్నసుఖమస్నుతే ||

4.జాబాలితీర్ధము

శ్రీ స్వామి పుష్కరిణికి ఉత్తర భాగమునకు ఐదుమైళ్ళ దూరములో జాబాలి తీర్థముగలదు. ఇచ్చట జావలి ఋషి యొక్క ఆశ్రమముండెను.కొంత కాలమైన తర్వాత తిరిగిరాగల నుద్దేశ్యముతో ఒక్కొక్కరే ఆశ్రమమును వదిలివెళ్లిరి.

అగస్త్యులు వారిచ్చట ననేక యుగములలో భక్తులు రాజులుతోఁ గలిసి శ్రీవారిని గురించి అద్భుతముగా పూజాదులు జరుపు చుండిరి. ఈతీర్ధములో స్నానము చేసినంతట పంచమాహా పాతకము సహా పోవుటయే గాక పిశాచములు వదలును. ప్రాయశ్చిత్తము లేనీ దోషములు గూడచును.
92 తిరుమల తిరుపతియాత్ర.

కావేరీ నదీతీరమున దురాచోరుడను నొక బాహడుండెను. ఎల్లప్పుడు కౄరకర్మయేగాని సుకృత్యము లెన్నడు చేసిన వాడు కాడు. పంచమహా పాతకములు సదా చేయువాడు.ఈ దుష్కర్మవల్ల నొక బ్రహ్మ రక్షసి అతనికి పట్టియనే దేశములు త్రిప్పెను. పూర్వపుణ్యఫలము వలన నీదూరాచారుడు పిశాచ వీడితుడయ్యు నీవేంకటాద్రికివచ్చి యీతీర్థములో స్నానము చేసేను.వెంటనె తన దుష్కర , మంతయు పోయి పిశాచము తోలగుటయే గాక దానికిన్ని విముక్తిగలిగేను. పిశాచము తొలగినందు వలన తెలివిగలిగి చెంతనున్న జాబాలి ఋషి వద్దకు బోయి "నేను కావేరి తీరముననుండి దుష్కరముచేయుచు దురాచారుడను నామమున బిలువబడు చుంటిని, నేనిప్పుడు ఎక్కడనుంటినో నెటులనిక్కడకు వచ్చితీనో డెలుపవేడెదనన" నాముని ముహుర్తమాత్ర మాలోచించీ కనికరము గలిగి “పూర్వ మొకానొక బ్రాహణుండు పితృశ్రాద్ద్ధము పార్వణ విధానముగ చేయనందున పితృశాపము వలన పిశాచరూపము బొందెను. ఆపిశాచముసదా దుష్కరుడవగు నిన్ను దేశమంతయు త్రిప్పి తుదకు నీపుణ్యమువలన నిక్కడకు తీసుకోని రాగా ఈతీర్థ స్నానముచే నాపిశాచమునకుముక్తి గలిగె ను. నీకు దుష్కర తోలిగెను.”

శ్లో. యాని నిష్కృతి హీనాని పాపాన్యపీ వినాశయేత్ |
శూద్రేణ పూజితం లిజ్ఞం విష్ణుంవాయెనమోద్విజః||

శ్లో. ప్రాయశ్చిత్తంగత స్యోక్తం స్మృతిభిః పరమర్షిభిః
నశ్యేత్త స్యాపితత్పాపం తీర్ధే జాబాలిసంజ్ఞకే||

93
తిరుమల తిరుపతియాత్ర.

శ్లో. విప్రనిన్దాకృతాం చైవ ప్రాయశ్చిత్తం న విద్య తే|
విశ్వాసఘాతుకానాం చ కృతఘ్ననాం చ నిష్కృతిః ||

శ్లో. భ్రాతృభార్యా రతానాం చ ప్రాయిశ్చిత్తం నవిద్యతే|
తేషాం జాబాలితీర్ధేనై స్నానాచ్చుద్ధిర్భవిష్యతి||

5. కటహ తీర్థం.

గంగా నదికి దక్షిణభాగమున 200 ఆమడ (యోజనము) దూరమున తూర్పు సముద్రమునకు పంచభిర్యోజనచూరము పశ్చమముగా సుసర్ల ముఖీనదీ తీరమున ను త్తరముగా క్రోశడుదూరములో సమన్తులవలన నందింప బడు వెంకటాద్రిగలడు. ఆ వెంకటద్రీశుని మేరుపుత్రుడు దేవతలు ఋషులు మొదలగు వారు సాకేత్ శ్రీమన్నారాయణుడని పుజించెదరు.మోక్షప్రదాయకుడై శ్రీవెంకటేశ్వరుని చుట్టుకోని శ్రీమహాలక్ష్మీయు భూనీళా   దేవులున్నారు.అట్టి వెంకటేశుని ఆలయములో నుత్తరభాగమున విమాన ప్రదక్షణములో నున్నదనీ భారద్వాజ ఋషి చెప్పిరి. ఇందలి తీర్థమును స్పర్శదోషము లేకుండా బ్రహ్మకుక్షత్రియ వైశ్య శూద్రులు నాల్గుజాతుల వారు తీసుకొనేదరు. ఇందలి తీర్థపానము బ్రహ్మహత్యాది మహాదోషములను గూడ బోగోట్టీముక్తిదాయకముగనున్నది. నాల్గు ఆశ్రమములవారు ఇందలితీర్థము సేవించి ముక్తిబొందేరు. కుష్టు మొదలగు కర్మవ్యాధుల సహాపోగొట్టును.

శ్లో. స్మృతిమాత్రేణ యత్పూంసాం సర్వపాపనిషూదనం,
మంత్రేణాష్టాక్ష రేణై వపిబేతీర్థ మనోహరం.||

శ్లో. అధవా కేశ వాద్యైశ్చ నామభిర్వాపిజ్జలం,
యద్వానామత్రయేణాపి పిబెత్తిీీర్ధం శుభప్రదం.||

94
తిరుమల తిరుపతియాత్ర.

శ్లో.ఆహాస్విద్వే టేశస్య మంత్రేణాష్టాక్షరేణ వై;
పిబేత్కటాహతీర్థం తాద్భుక్తిముక్తి ప్రదాయకఁ;

శ్లో.వినా మంత్రేణ యో వి ప్రస్సం పిబే తీర్ధము త్తమం;
పాపమేనాశయక్షిప్రం జన్మాంతర కృతంమహత్;

శ్లో. ఇత్యుక్త్వా న పిబేన్నిత్యం మోక్షమార్ధైక సాధనం;
స్వామిపుష్కరిణీ స్నానం వరాహ శ్రీశదర్శనం;

శ్లో.కటాహతీర్థ పానం చ  త్రయంత్రైలోక్య దుర్లభం;
బహునాకి మిహోక్తేన బ్రహ్మహత్యా దినాశకం;

స్కన్దపురాణము.

పూర్వము తుంగభద్రానదీతరమున వేదశాస్త్రపారంగతుడైన పద్మనాభశర్మ అనుబ్రాహ్మణోత్త ముండుగలడు. ఆయనకు కేశవర్మ అనుపుత్రుండు గలడు. ఆపుత్రుండు దల్లి దండ్రులను భార్యనుస్వకర్మలను వదలి జూదమాడుచు, సురాపానము జేయుచు, వేశ్యాంగనల నిండ్లభుజించుచు, గాలము గడుపుచుండెను. ద్రవ్యముకొఱకు దొంగతనము శేయుచు చేత ఖడ్గము బూని బ్రహ్మహ్యత లొనర్చుచుండెను. ఒ కేపుత్రుడిటుల దుష్కరుఁడయ్యెనని దుఃఖించుచు తండ్రి తుదకు భరద్వాజ ఋషికడకేగి నమస్కరించి జెప్పుచుకొనగవారు ఈతీర్థముపుచ్చు కొన్నంతటన్ని దోషములు పోవుననీ చెప్పనటుల నాబ్రహ్మణుఁడు పుత్రుని తీసుకొనివచ్చి శ్రీస్వామిపుష్కరిణి స్నానము గావించి శ్రీవరాహస్వామివారి దర్శనము చేయించి శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానమునకు తీసుకొని వెళ్లి విమాన ప్రదకుణంచేయించి తీర్థము పానంబుగావింప నాదుష్కర్మవిముక్తి గల్లెను.
95
తిరుమల తిరుపతియాత్ర.

6.కుమారధారతీర్ధము.

స్వామీ ఫ్రషరిణికి నుత్తరభాగమున మూడుమైళ్ల దూరమున పాపనాశనమును .ఈ తీర్ధమునకు వాయవ్యమూలను మూడుమైళ్ళ దూరమున కుమారధార తీర్థము గలదు. కుంభ రాశియందు రవియుండగా మఖనక్షత్రముతో కలిసిన మాఘశుద్ధపౌర్ణమి నాటిమధ్యాహ్నము ఈ తీర్ధములో స్నానము చేసినంతటి గంగాది సర్వతీర్ధస్నానముగావించిన ఫలము ప్రాప్తించి 12 సంవత్సరములుండును ఈ తీర్థమందేవరు దక్షణయుక్తముగా నన్న దానముగాని చందనటంబుల దానముగాని చేస్తారో వారి స్నానఫలము బొందెరు. ఈతీర్ధమువద్ద ఒక్క ఇనుపనిచ్చెనయాత్ర అంతము సౌఖర్యార్ధము వేయబడినది.

శ్లో.

   ... ... ... ....
తస్మి౯ తీర్ధ సర్ణ దానమణు మేరుసమంభ వేతం॥


శ్లో.

వస్త్రం దానంచ గోదానం భూదానం చ తతోథిమ్।
యో నాదదాతి మత్ప్రీత్యా తస్య లక్ష్మీర్గృహెస్థితా.॥

మార్కండేయపురాణము.

పూర్వకాలమున నొకానొక వృద్ధ బ్రాహ్మడుండెను. అతఁడు మిగుల దారిద్ర్యపీడుతుడై కుటుంబసంరక్షణ చేసుకోనలేక నుండెను. దరిద్ర దోషమువలన నిహపర సాధనములే మిగుల దుఃఖితుడుగా నుండెను. ఈకష్టము భరింపమి ఒకనాడు
96
తిరుమల తిరుపతియాత్ర.

స్వర్ణముఖరీ సమీపమునబోయి చెంతనున్న శేషగిరిశిఖరమున కెక్కి. “బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలారా నవగ్రహాశ్వస్యాదులారా సర్వభూతములారా! నేనతీత దరిద్రపీడితుడై కుటుంబరక్షణ చేయ లేక నిహాలోక సుఖము లేక ధరాచరణన శక్తిచే పరలోక సుఖంబుగానక యున్నాను, వృద్దుడునై దరిద్రదోషహతుడగుట జన్మ వ్యయర్థంబు. పర్వతశిఖరంబుననుండి పత\బు చే ప్రాణత్యాగంబు దోషంబు లేదని పెద్దలు వచించిచెదరు. నేను పడుచున్నాను పడుచున్నాను పడుచున్నాను అనిపడ బోవుచుండ శ్రీవేంక 'కేశ్వరస్వామివారు మృగయార్ధమే తెంచిన నొక రాజపుత్రునిన లే దర్శనమిచ్చి పర్వతము క్రిందనుండీ “వలదు వలదు బ్రాహ్మణునకు భృగుపతనంబు దోషము పర్వతశిఖరంబు దిగిరమ్మ"నుచుజెప్ప నావీ ప్రుండు “ఓరాజు! నన్ను నాభార్యా బిడ్డలను గాపాడినంతట నేను దిగెదను” అని ప్రత్యుత్తరమియ్య “సర్వందదామి” అని రాజపుత్రుడె నతియ్య నా బ్రాహ్మణుడుదిగేను. ఆ ప్రభువృద్ధ బ్రాహణునికరము కర ముచే బూనితీసుకొని వెళ్లి "పాపనాశనమునకు కుత్తరముననున్న ఈతీర్థమున స్నానముచేయుము దుఃఖశాన్తియై కౌమారము వచ్చును” అని చెప్పెను.

శ్లో.

స్నానం కురు తతః ఖేద శాన్తిస్తత్ర భవిష్యతి।
ఇత్యుక్తె తత్ర తత్తీర్థే స్నాత్వోత్థాయ యువ భవత్॥


శ్లో.

మనః ప్రసన్న తాం యాతంకుమారశ్చత దాభవత్॥
తరంతు సర్వతః పశ్యంస్తమ దృష్ట్వా స్వ తప్యత॥

మార్కండేయపురాణము.