తిరుమల తిరుపతి యాత్ర/అధ్యాయము 7

వికీసోర్స్ నుండి

అధ్యాయము VII.

1. ఆర్టీతనివేదన.

ఇది చెరువులు, పళ్లు అని ద్వివిధంబులు i. చెరుపులు.__________

దధ్యోదనము. 30 రూపాయలు.

పుళిహోర. 35 "

పొంగలి. 40 "

చెక్కర పొంగలి. 45 "

శాకరభాత్. 65 "

కేసరిభాత్. 65 "

పాయసం. 45 "

శీరా 85 "

ఈ మొత్తముఁ జెల్లించి రసీదు తీసుకొనవలెను. సాధారణముగా ఉదయము 8 లేక 9 ఘంటలలోగా చెల్లించక ఆల స్వమయినంతట ఆరోజున నివేదనకు తయారుకావు. దినుసుల వెలలబట్టి నివేదనలకు చెల్లించుసొమ్ము అప్పుడప్పుడు మారవచ్చును.

ii. పళ్లు:_______

లడ్డు లేక జిలేబి 1.కి         ర్స .65

వడ, మనోహరం, ర్స .40

పోళి, దోశ, అప్పం, ర్స .40

తేనె తొళ, శుఖి, ర్స .40

అతిరసం 1_కి ర్స .40

ఈ నివేదలకు ఇంతకు హెచ్చు ఏమియు చెల్లించనవసరములేదు. నివేదన అయినతరువాత 30 పణ్యారములు ఇయ్యం బడును.

ఈ కాయ పచ్చడికీ రు 5-0-0 లు ఇయ్యవలెను. కాయలు గృహస్థు ఇయ్యవలెను. ఒక గూనపచ్చడి ఆరగింపు చేయించి ఇచ్చెదరు.

పైనఁ జెప్పిన ప్రసాదములను నీవేద న చేయించుటకు 'శ క్తి లేని యాత్రికులు కలకండ, కొబ్బెర, ముంతమామిడి పప్పు, బాదంపప్పు మొదలగునవి కొని ఆదినుసులఖరీదు మొత్త మునకు సరిగ దేవస్థానం పారుపత్యదారికి ఖచేరిలో చెల్లించి రసీదుతీసుకొని బంగారువాకిలి వద్దనున్న బ్రాహ్మణునీ వశములో నిచ్చినంతట నివేదన చేయించి ప్రసాదమిచ్చును. ఎంత ఎక్కువవిలువ అయినను రు 0-4-0 తక్కువ సుంకము వసూలు చేయరు. శ్రీవారి అఖండములో నెయ్యి వేయుటకున్ను, నగలు వస్తములు మొదలగునవి సమర్పణ చేయుటకున్ను ఇదేపద్దతి గమనించవ లెను..

యాత్రికులు తమ బసలయందు శుభకార్యములు చేయునపుడు వాద్యము కావలసినంతట రు 1_8_0 పారుపత్య దార్ ఖచేరిలో చెల్లించినంతట మేళమునకు టిక్కెట్ ఇచ్చెదరు. అది మేళగాండ్రకు చూపించి బసయున్ను, మేళముకావ లసిన కాలమున్ను చెప్పినంతట వాండ్లువచ్చి మేళమువాయించి టిక్కెట్ వాపసుపుచ్చుకొనెదరు, ఒకేదివసమున అనేక యాత్రి కులు మేళమునకు సొమ్ము చెల్లించినంతట నందఱుకు ముహూర్త సమయమునకు మేళమువచ్చుట అసాధ్యముగనుక కొంచెము హెచ్చుతగ్గు కాలములో వచ్చి వాయిం చెదరు. మేళమునకు సొమ్ముచెల్లించిన వారిలోఁ గొందఱు తమకు ఘంటలకొలఁది. మేళము పోయించమని కో రెదరు. అట్లు చేసినయెడల మేళ మునకు సొమ్ము చెల్లించిన నితర యాత్రికునకును, శ్రీవారి పనులకును అభ్యంతరము గలుగును. కనుక వీలుపడదు. మేళము సకాలమునకు రాలేదని యాత్రికులు ఫిర్యాదు చేయఁగూడదు.

2. నిత్యహారతి.

శ్రీవారికి నిత్యము హారతి జరుగుటకు దేవస్థానము ఖచే రిలో నిత్యకర్పూర మంగళహారతికి రు 30 లున్ను, నిత్యనవనీత హారతికి రు 50_లున్ను చెల్లించిసంవత్సరము 1_కి ఇవిజరిపించుట కు గాను యాత్రికులు తను ఏజంటుకు సంవత్సరము 1–కి ఖచేరిలో చెల్లించినంత మొత్తనమిచ్చినంతట హారతి జరిపించును. లేనంతట శ్రీవిచారణకర్తలవారికి ఆర్జివ్రాసుకొని దేవస్థానము ద్వారా జరి పించుటకు ఏర్పాటు చేసుకొని నంతట వేఱే ఏజంటు లేకనే దేవ స్థానమునకు ఆసొమ్ము చెల్లింపవచ్చును.కొందఱు తమయిండ్ల ముందఱకు దేవుని ఉత్సవము వచ్చినప్పుడు హారతిచేయ నిత్య హారతికే సొమ్ము చెల్లించెదరు. అంతమాత్రముచేత దేవుడు అక్కడ ఆగవలెనను నుద్దేశ్యముగాదు. దేవుని ఉత్సవమవు చుండగా హారతిఇవ్వవలెను ఏర్పాటుగా నెఱుంగునది.

3.నిత్యఅర్చన.

నిత్యఅర్చనకు రు 42_లు దేవస్థానపు పారుపత్యదార్ ఖచేరిలో చెల్లించవలెను. తఱువాత తులసి మొదలగు ఖర్చులకు సంవత్సరము 1_కి రు 42–లుచో||ఏజంటు మూలకముగ గానిపై చెప్పిన ప్రకారము దేవస్థానమూలకముగ గాని జరిపింపన లెను.

నిత్యహరతి లేక నిత్య అర్చన జరిగించు యాత్రికుఁడు తమ ఏజెంట్లు ప్రతిదినము జరుపక సంవత్సరమునకు వేయవలసిన 365 హారతులు, లేక, అర్చనల సామానులు రెండు మూఁడు దఫాలు దెచ్చి పూర్తిచేసెదరు. అట్లు చేయకుండ నేర్పాటు చేసుకొన వలయును.

4. శ్రీపాదచందనము.

శ్రీవారికి ప్రతినిత్యము రాత్రిమంచపు శేషకాలములో సమర్పణయి తెల్లవారి మ్విరూపదర్శన కాలములో కొంత కర్చుపడి మిగతలో స్వల్సము అర్చకులకు చేరును. తక్కినది దేవస్థానము పారాపత్యదార్ వద్దనుండును. నిచక్షణగ వారివలన భక్తులకు ఖర్చునెట్టబడును. అర్చకులవద్ద నెలకుదొరకును.

5. శ్రీపాదరేణువు.

శ్రీవారికి సమర్పణ అయిన పచ్చకర్పూరము పునుగు తైలము మిశ్రమమునకు శ్రీపాదరేణువు అనిపేరు. దేవస్థానమువారు సాధ్యమైనంతవరకు స్వల్పముగా భక్తులకుచితార్ధమిచ్చెదరు. వెలకు అర్చకులు మొదలగుకొందఱు కైంకర్య పరుల వద్దదొరకును. అభయ స్తములు అనఁగా శ్రీవారిహస్తముకు నొత్తబడి రేకలుగల్గిన చందనపు బిళ్లలు.

మాణిక్యములు, అనఁగా శ్రీవారి హస్తకవచముననున్న రత్నములకు నొత్తబడిన చందనపుబిళ్లలు. పుళికాపుతీర్థము అసఁగా శ్రీవారికి శుక్రవారమున జరిగిన అభిషేకతీర్థము. దీనిని యాత్రస్థులు తమ ప్రదేశములకు తీసుకొని నెళ్లెదరు. వారము దివసములు నిల్వయుండును. యాత్రస్థులు ప్రసాదములు కానున్నప్పుడు అవిసరిఅయిన ప్రసాదములని నిర్ధారణ చేసుకొనన లెను.

6. షరాబు.

భుజమున సంచివేసుకొని యాత్రికులుండు తావునకు వచ్చి రూపాయలకు చిల్లరయున్ను, సవరములకు రూపాయలున్ను నిచ్చెదమని కొందఱు షరాబులు వచ్చెదరు ఇంకను కొందిఱు తిరుమల బజారువీధిమధ్యగ అంగళ్లు పెట్టుకొని చిల్లర, రాగి, రూకలు, వెండి గుండ్లు కండ్లు, కాళ్లు మొదలగు నవి హుండీలో వేయుటకు యాత్రీకులకు విక్రయించెదరు. వీరితో బేరముచేయునప్పుడు యాత్రీకులు జాగరూకతతో సర్తింపవలెను. ప్రార్ధన లేనిది రాగిరూకలు మొదలగునవి కొని హుండీలో వేయనవసరము లేదు. అట్లు వేయవలెనను నిర్భం ధము దేనిస్థానములో లేదు.

7. ముడుపులు.

శ్రీవారి ముడుపులు శ్రీవారికే జేర్చవలెను. ఇందుకుడలా లీలు తరగర్లు కమీష ్ ఏజంట్లు చెప్పుసంగతులు గుఱించి జాగ్రతగ నుండవలెను. డలాలీల దుర్భోధనను వినినయెడల యాత్రికులప్రార్ధనలు సఫలము కానేరవు. అని శ్రీవిచారణకర్తలవారు నోటీసులు ప్రచురపరచినారు. యాత్రీకులు ఇతరు లనునమ్మక స్వయముగ వారే స్వామివారి కొప్పెరలో వేనేను కొనవలెను.

8. చంద్రగిరిరస్తా.

తిరుమలెకు తిరుపతిమార్గమేగాక చంద్రగిరి మార్గమున గూడరావచ్చును. అయితె తిరుపతిరస్తావలె రాజభాటగాదు. డోలీలు బండ్లు ముందు ఏర్పాటు చేసుకోనంతట దొరకవు. ఈ మార్గమున గూడ దేవస్థానపుభటులు గలరు. చలిపందిరిన్ని గలదు.

9. తిరుమల అంగడివాండ్రు.

వీరిలోన నేకుల స్వాధీనములో బాడుగ ఇండ్లు గలవు. వీరు యాత్రికులకు నిండ్లు బాడుగ కిచ్చెదరు. శ్రీవారికి కర్పూరము ఖరీదుచేసి కొప్పెరలో వేయమనెడి దుర్భోధనలు వినక యాత్రికులు తమా ప్రార్థనల ప్రకారము నడుచు కొనవలెను.

10 కోతులు.

తిరుమలలోను తిరుపతిలోను కోతులుగలవు. తిరుమల మీదమెండు. కోతులు అరటిపండ్లు టెంకాయముక్కలు మొదలగుతినుబండారవస్తువులు చూచునప్పుడు మనుష్యులకు అడ్డ మువచ్చును వాటినిచ్చి వేయన లెను. లేనంతట కనబడకుండా నుంచుకొనవలెను. నిర్ణేతువుగా కోతులు ఎవరికిన్నిహానిచేయ కసంచరించుచుండును.

11. శాసనములు.

దేవస్థానపు ప్రాకారములమీదననేక శాసనములుగలవు. ఇదిగాక తాళపాకము వారికృతులు రాగి శాసనములుగనున్నవి.

12. భావులు తులసి పుష్పం.

విరజానది అనునొక చిన్న భావి ఆకారముగలదిసం వగ ప్రాకారములోగలదు. శ్రీవారిపాదములక్రింద ప్రవహించు ఒక్కనది అగు విరజయొక్క తీర్థము ఈచిన్నభావి గుండ నరులకు ప్రాప్త మనిన్ని చెప్పెదరు.

శ్రీవారికి సమర్పణ అయినపుష్పము తులసి ఎవరున్ను ధరించు కొనగూడదు. ఈతులసిపుష్పము తిరుచానూరు పంచ మి తీర్థముక్కోటి దివసమున శ్రీతాయార్లు వారి సమర్పణకు తిరుమలనుండి పంపబడిసమర్పణయిన తర్వాత ఒక సంవత్సర మున కొకదివసము మానవులకు ప్రాప్తము. ఇతర కాలములలో శ్రీవారిప్రదక్షణములోని పూలభావిలో వేయబడును.

బంగారు భావిఅనునది శ్రీవారికి విమానస్రాకారములలోనున్నది. ఈతర్థము శ్రీ వారిసన్నిధిలోను, వంటశాలలోను నుపయోగము.

13. ఉగ్రాణము.

శ్రీవారివంటశాల సామానులు బియ్యము మొదలగు నవి యుంచు శాలకు ఉగ్రాణమని పేరు. ఇది విరజానది వద్ద నున్నది.

14. జ్వరగాలి.

ఇచ్చట వేసవి కాలమందు గాలీ హెచ్చుగవీచును. దీనిని జ్వరగాలి అనెదరు - శ్రావణ మాసములో తిరుమల గ్రామమునకు కనబడుచుండు నారాయణగిరి మీద శ్రీ వారి పాదములకు సంవత్సరమున కొక సారిపూజ జరుగును. అప్పుడు జ్వర గాలి తగ్గును.

15. నీటివసతి.

తిరుమల వీథులలో కొళాయిలు గలవు. తిరుమల గ్రామమునకు వెలుపల నెత్తైన ప్రదేశములో ఆళ్వార్ చెరువు అనెడి కోనేరుగలదు. అందలి తీర్థము కొళాయికి వచ్చును. ఇదిగాక భావులు గలవు, ఈ కోనేటిని హిందూస్థాన్ దేశస్థులు "సూర్యకుండు” అని వాడెదరు.

16. బంగళ.

ఆళ్వార్ చెర్వు సమీషమున దేవస్థానమునకు సంబంధించినతోటలో బంగళా గలదు. దేవస్థానపు విచారణ కర్తల వారి ఉత్తరవు మీద యూరోపియన్లు వచ్చిలనచేయనచ్చును. బంగళాకు ప్రక్కనుండి చంద్రగిరికిపోవుమార్గము. ఈ బంగళా వెనుకనుండిచూచినంతట కొండలు లోయలు మొదలగు ప్రకృతి చిత్రములు ఆహ్లాదకరముగనుండును.

17. తరిగొండవెంగమ్మ.

తరిగొండ వారు శ్రీవారి దేవస్థానపు మిరాశిదార్లలో నొకరు. అందులో తరిగొండ వెంగమ్మ అనునామె చాలాభక్తురాలు. ఈమెకుఆంధ్రమునమంచి ప్రవీణతగలదు. ఈ మెసమాధి గ్రామమునకు నుత్తరపునే పునగలదు. అచ్చటకు స్థానికులు వెళ్లి చూచెదరు.

18. శానిటేషన్.

తిరుమల గ్రామముయొక్క శానిటేషన్ దేవస్థానము వారే చూచెదరు. అందుకు శానిటరి యిన్ స్పెక్టర్ మొదలగు వారు గలరు. దేవస్థానముడిస్ పెన్సరి ఒక్కటిగలదు. గోగర్భమునకు వెళ్లుత్రోవలోకలరాప్లేగుషెడ్లుగలవు.

19 శ్రీగోవిందరాజస్వామి వారి దేవస్థానం.

ఈ దేవస్థానము తిరుపతిలోగలదు. శ్రీగోవిందరాజస్వామి వారు శయనమూర్తి తిరుమల నుండి వచ్చుయాత్రికు లీ దేవస్థానములో శ్రీగోవిందరాజస్వామివారి దర్శనము చేసుకొనెదరు.

20. శ్రీరామస్వామి వారి దేవస్థానం.

ఈ దేవస్థానము తిరుపతిలో నున్నది. ఈ దేవస్థానము జాంబవంతుని ప్రతిష్ఠ అని చెప్పెదరు. యాత్రికు లిచ్చటకు దర్శనమునకు వెళ్లెదరు.

21. శ్రీపద్మావతి అమ్మవారి దేవస్థానం.

శ్రీశుకులు తపస్సు చేసుకొనుట చేత శుక పురి అని . పేరుగలినది. దానిని అరవముతో శుకనూరు అని వాడెదరు. దానికి వైష్ణవసిద్ధాంతపదమగు తిరుశబ్దము జేర్చి తిరు శుకునూరు అనివాడిరి. అదిక్రమేణ తిరుచానూరు అని వవాడబడు చున్నది. ఇది తిరుపతికి రెండుమూడుమైళ్ల దూరమున నున్నది. ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానము గలదు. శ్రీపద్మావతి అమ్మవారిని శ్రీఅలివేలు మంగమ్మ అనియు తిరుచానూరిని అలి వేలుమంగాపురమనిన్ని కొందఱు వాడెదరు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిదర్శనమునకు వచ్చు యాత్రికులు శ్రీస్వామివారి పత్నియగు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనమునకు తప్పక వెళ్లె దరు. సంవత్సరమున కొకసారి యేప్రిల్ నెలలో తెప్పోత్సవము జరుగును. అరవ కార్తి కినెలలో బహోత్సవము జరుగును. ఈ దేవస్థానములన్నియు శ్రీవెంక టేశ్వర స్వామివారి దేవస్థాన ముసకులోబడి తత్సంబంధమైన రాబడి మీద ప్రబలుచుండును.

22. తిరుమల అడవి.

తిరుమలమీద కొంతఅడవి శ్రీవారికి చెందుచున్నది. ఇదిగాక ప్రస్తుతపు శ్రీవిచారణకర్తలవారివలన రెండు తాలూకాలు ఖరీదు చేయబడినవి.

23 వాహనములు.

శ్రీవారికి బంగారు వెండి వాహనములు గలవు.సర్వభూపాలవాహనమను బంగారు వాహనము ఒక్క లక్ష రూపాయలు వెలగల్గిన వాహనము.

24.శివలింగం.

శ్రీనివాసమూర్తివారి విమానముక్రిందుగా కొంతతూర్పుగా శ్రీమాక్కండేయముని కౌగలించు కొనియుండు శివలింగము దర్శనమవును.


25. దేవతలు.

శ్రీవారి దేవస్థానము గర్భాలయములో శ్రీమూలవరుల వక్షస్థల లక్ష్మీ సహితముగనున్ను శ్రీ దేవి భూదేవి అమ్మవార్లు సహా శ్రీమలయప్పస్వామి వారు అను ఉత్సవర్లున్ను, శ్యసి య చేయు శ్రీబోగ శ్రీనివాసమూర్తివారున్ను కొల్వు అనగా దర్బార్ చేయు కొల్వునిత్యము గోరా చేయులు శ్రీనివాసమూ ర్తి వారసు సంవత్సరమున కొక దినము రాత్రియందు మెర వణి అయ్యె ఉగ్ర శ్రీనివాసమూర్తివారు తాయార్లుతో నున్న సీతాలక్ష్మణసమేత శ్రీరాములువారున్నూ, రుక్మిణీసమేత శ్రీకృష్ణ స్వామివారున్ను ద్రకత్తాళ్వారను సుదర్శనమున్ను విజయం చేసి యున్నారు. గర్భాలయ మునకు ముందుపై నియేర్పబడినమూ ర్తలకు కొన్ని గజముల దూ రముననింకొక ప్రదేశమున నొపార్శ్వంబున సుగ్రీవ ఆంగదా హనుమాన్లున్ను, రెండవపార్వమున అనంత గరుడ విష్వ క్సేను లున్ను గలరు. వారికి ముందు కొన్ని గజముల దూరమున బం గారువాకిలి ముందు ఇరుప్రకల జయవిజయులను ద్వార పాల కులున్ను , వార్లకు వెండి కటాంజనముతో గుడివ లె కట్టబడియు నది. గర్భాలయము అనఁగా బంగారువాకిలిదాటి వినూనప్రదక్షణములో దేవతలగు శ్రీయోగనృసింహస్వామి శ్రీవరదరాజ స్వామి దేస్థానములున్ను భక్తులగు శ్రీభాష్యకారులు, శ్రీ సేనాధిపతి, శ్రీగరుడాళ్వార్ల దేవస్థానములు గలవు. వంటశాలలో శ్రీవకుళమాలికా దేవిగడిగలదు. ధ్వజ స్తంభము వద్ద క్షేత్రపాలకశిలగలదు. ఇచ్చటనే అర్చకులు ఇంటికి వెళ్లునపుడున్ను దేవస్థానమునకు వచ్చునపుడున్ను బీగముచెవులు తాకించి వెళ్లవలెను. క్షేత్రపాలకులుపూర్ణకళతో గోగర్భమువద్దనున్నారు. వీరి ప్రభావము గుణించి అనేక కథలుగలవు.

26. ముద్రమండపం.

ఎవరయినను శ్రీవారిదేవస్థానములో తప్తాంకితముచేను కొనవలెనన నఫరు 1–కి ర్పు 0-12–4 పంతున పారుపత్యదార్ ఖచేరిలో చెల్లించినయెడల ఒక్క శ్రీవైష్ణవ బ్రాహణునిచే వారికి చక్రాంకితము కావింపబడును.

***