తిరుమల తిరుపతి యాత్ర/అధ్యాయము 6

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అ ధ్యా య ము VI.

ఆర్జితము.

శ్రీవారికి యాత్రికులు సొమ్ము తిరుపతి శ్రీవిచారణకర్తలవారి ఆఫీసులోఁగాని తిరుమల దేవస్థానము పారుపత్యదార్ ఖచేరిలోఁగాని చెల్లించి శ్రీవారికి ఉత్సవములు, నివేదనలు, శేవలు చేయించవచ్చును. ఇట్లు చెల్లించుసొమ్మునకు రసీదులు ఇయ్యఁబడును.

(a) ఉత్సవములు

శ్రీవారికి రెండవఘంట అయిన తఱువాత యాత్రికుల యొక్క ఆర్జితోత్సవములు జరుగును.

ఉత్సవములకు చెల్లించు సొమ్మువివరము.

1_వ తరగతి బ్రహ్మోత్సవము 1205

2_వ " 925

3_వ " 805

4_వ " 705

5_వ " 625

6 వసంతోత్సవము 1005

7 వజ్రకవచము లేనివాహనము 41

8 వజ్రకవచము సహావాహనము 61

9 కళ్యాణోత్సవము 305

10 ఇతర వాహనము 21

 (అనఁగా గరుడవాహనము మొదలగునవి)

బ్రహ్మో త్సవము.

ఇందుకు 8 దివసములలో 16 వాహనములు జరుగును. గాని దేవస్థానము సౌకర్యమును, ఇతయాత్రికులకు ఇబ్బంది లేమియు యోచించబడును. బ్రహ్మోత్సవము దత్తమైనది మొదలు బ్రహ్మోత్సవగృహస్థుల తాలూకు మనుజులను బ్రహ్మోత్సవము తరగతివారిని బట్టితో మాలసేవ, అర్చన, ఏకాంత సేవకు వదలెదరు. మొదట శ్రీవారికి రెండవఘంట అయినతఱువాత వెండితిరిచిలో శ్రీవారికి వజ్రకవచము సమర్పణయి బ్రహ్మోత్సవముద దత్తమవును. వాహనములు ఆఖగున తేరుకు ప్రత్యా మ్నాయముగ సర్వభూపాల వాహనమునకు అరటిచెట్లు మామిడియాకు తోరణములు గట్టి జరిపించెదరు. దీనితో బ్రహ్మోత్సవము పూర్తి అయినట్టు ఎంచవలెను. (బ్రహ్మోత్సవము దత్తమునకు ముందును, తేరునకుఁ దరువాతను గృహ స్తులను పైనఁజెప్పిన సేవకు వదలరు. ఈలోపు కాలములో విశేషదర్శనములు, మధ్యాహ్నము పొంగిలి ప్రసాదముగల చిన్న గంగాళము, రాత్రి దోసెలు ఇయ్యఁబడును. దత్తసమయముందు ఒరరూపాయియు, వాహనము జరిగినపు డొక్కొక్కహారతికి ఒక్కొక్క రూపాయియునియ్యవలెను. ఇవి దేవస్థానమునకు చేరును. బ్రహ్మోత్సవాంత్యమున వస్త్రమును తీర్థ ప్రసాదములను గృహస్థునకు బహుమతిచేసి వాద్యములతో వారి బసకుఁ బం'పెదరు.

వసంతోత్సవము

ఇది పదిరోజులు జరుగును. రెండవఘంట అయిన తఱువాత శ్రీవారికి ఉభయఅమ్మవార్లు సయితము ధ్వజస్థంభమునకు దక్షణముగనుండు తిరుమలరాయమంటపములో తిరుమంజసము, అలంకారము అయి వడపప్పు పానకము నివేదన చేయబడును. సంపంగి ప్రదక్షణముగ శ్రీవారు ఉగ్రాణము ముందు మంటపమునకు దయచేసి అచ్చట ప్రసాదములు నివేదనయి శ్రీవార్లకు కుంకుమపువ్వుకలిపిన చందనము సమర్పణయి శేష చందనమును, తాంబూలము సహా వినియోగమవును. అనంతరము నాలుగు వీధులు ఉత్సవము జరుగును. ఇట్లు పది దివసములు జరిగిన తరువాత బ్రహ్మత్సవములోవలెనె గృహస్థుకు బహుమానము జరుగును.

కళ్యాణోత్సవము.

ఈ యుత్సన మొక్క ఝాము జరుగును. శ్రీవారికి రెండవఘంట అయినతఱువాత ఉత్సవర్లును శ్రీతాయారులు సయి తము కళ్యాణ మంటపమునకు విజయంచేసి అచ్చట గృహస్థుచే సంకల్పము చేయించి మంత్రహోమయుక్తముగా వాద్యములతో కళ్యాణము శ్రీవార్లకు జరిపించి లడ్డు, వడ, దోశ, అప్పము నాలుగు గంగాళముల ప్రసాదములు ఆరగింపయి నాలుగువీధు లుత్సవమువును, ఆరగింపయి ప్రసాదములలో 30 లడ్లు, 30 వడలు, 30 అప్పములు, 60 దోశలు, 3 గంగాళముల ప్రసాదములు గృహస్థులకు ఇయ్యఁబడును. ఉత్సవమునకు అర్చ కులు మొదలగు కైంకర్యపరులకు వస్త్ర బహుమానము లియ్య బడును. కైంకర్యపరులకును దక్షణగూడా నియ్యఁబడును. గృహ స్థుఖ చేరిలో చెల్లించిన రూపాయిలు తిప్ప దత్తమున కొకరూపాయియు, హారతిరూపాయియుగాక ఇతర ఖర్చు లేమియు చేయసవసరము లేదు.

ఇతరవాహనములు.

తక్కిన ఉత్సవములు అనఁగా వాహనములు శ్రీవారికి రెండవఘంట అయిన తఱువాత జరుగును. హారతికి మాత్రము వేరే రూపాయి ఖచేరిలో చెల్లించి రసీదు తీసుకొనవలెను. ఎందరు ఒకేతరహావాహనమునకు సొమ్ము చెల్లించినను అందఱకు ఒకసారి వాహనము నాలుగువీధుల ఉత్సవము జరుగును గాని వేర్వేరుగా జరుగదు. వర్షము మొదలగు కారణములవలన వీధి ఉత్సవము జరుగ లేనంతట గుడిలోపలనే వాహనము వేసి శ్రీవారిని విజయం చేయించి గృహస్థు తెచ్చిన హారతిఅయి తానె మూడుసారులు ప్రదక్షణముచేసి నమస్కారము చేసి నంతట ఉత్సవము పూర్తి ఆవును.

ఉత్ససములు మొదలగువానికి సొమ్ము చెల్లించి రసీదు తీసుకొనువారు ఆరసీదు ఆకాలమందు దేవస్థానం అధికారస్తులకు చూపించినగాని ఉత్సవాదులు జరుగనేరవు. గనుక భద్రముగా నుంచుకొనవలెను.

(b) సేవలు.

శ్రీవారికి సేవలు చేయించువారు ఈదిగువ వివరప్రకారము సొమ్ము చెల్లింపవలెను.

తోమాలసేన 13

అర్చన 7

ఏకాంతసేవ 13

ఆమంత్రణోత్సవము 100

పూలంగిసేవ 60

పూలంగిదర్శనము 1

పూరాపుళికాపుసేవ 450

పుళీకాపుదర్శనం 1

గఁబూరాగిన్నె 250

పునుగుచట్టంగిన్నె 85

కస్తూరిగిన్నె 50

జాఫరాగిన్నె 65

సహస్రకలశాభిషేకం 1005

పూరాతిరుప్పావడ 1005 ఆరతిరుప్పావడ 505

కోవిలాళ్వార్ తిరుమంజనం 505

ఐనామహల్ సేవ 61

ఇదివరలో తోమాలసేవ, అర్చన, ఏకాంత సేవలను గురించి చెప్పఁబడినవిగదా. ఇనామహల్ శేవ ప్రస్తుతంలేదు.

ఆమంత్రణోత్సవము.

“ఒక దినమున శ్రీవారిపూజ, నివేదన చేయించినట్లు” భావముతో ఈ సేవ చేయఁబడును. ఆమంత్రణోత్సవము 1_కి పదిమంది జనమువంతున తోమాలసేవ, అర్చన, ఏకాంతసేవ. లకు వదలుటయేగాక మధ్యాహ్నము చిన్నగంగాళము పొంగలియు, రాత్రి 30 దోశలును నియ్య బడును. తోమాలసేవ కాలములోదత్తమునకు రూపాయి గృహస్టు ఇయ్యవలయును. ఇదిగాక హారతులకు వేఱేహారతి చీట్లు ఖచేరిలో సొమ్ము చెల్లించి పుచ్చుకొనవలయును. ఇది చేయించిన వారికొక మనోహారము బహుమానమియ్యఁ బడును.

పూలంగిసేవ.

గురువారము సాయంకాలము పూలంగి దర్శనమునకు మనిషికొక రూపాయి వంతున నియ్యవలె నని ఇది వరలో చెప్పఁబడెను గదా! శ్రీవారికి విశేషాలంకారముగా నుండు ఒక నిలువుటంగీ తొడిగి పుప్పాలంకార భూషితులుగఁ జేయుటయే పూలంగిసేవ యనఁబడును. ఇది చేయించినవారికి పూలంగిదర్శనము టిక్కెట్ లేకనె కొందఱిని దర్శనమునకు వద లెదరు. తీర్థప్రసాదములు బహుమానముగా నిచ్చెదరు.

పుళికాపుసేవ.

పుళికాపుసేవ యనఁగ నభిషేకపుసేవయని యర్థము, ఇది పూరాపుళికాపు, గంబూరా, జఫరా, కస్తూరి, పునుగు చట్టు గిన్నెలని అయిదు విధములు. పూరా పుళికాపు అనఁగా గంబురా మొదలగు నాలుగున్ను కలసి యుండును. పూరాపుళికాపుకుసొమ్ము చెల్లించిన గృహస్థునకు అభిషేకమునకు వాద్యములతోఁబరిమెళము దిన్సులు తీసుకొని వెళ్లునప్పుడు గంబూరా అనఁగా వచ్చకర్పూరం, జాఫరా అనఁగా కుంకుమ పువ్వు, కస్తూరి, పునుగు తైలము వేర్వేఱుయుగోనుంచి ఒక వెండి గిన్నె గృహస్థు చేతి కియ్యబడును. గంబూరా మొదలగు నవి కట్టినవారికి ఆయానన్తువు మాత్రమెకలిగినగిన్నె ఇయ్యఁబడును.

శ్రీవారి అభిషేకమునకు పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, పునుగుచట్టు, కస్తూరి పరిమెళం అఱలోనూరి శిద్దము చేసి ఇదివరలో చెప్పిట్టుగా వాద్యములతో శ్రీవారిసన్నిధిలోనికి తీసుకొని వెళ్లఁబడును. పూరాపుళికాపు మొదలగునవి కట్టిన గృహస్థులకు పుళికాపుదర్శనము టిక్కెట్ అవసరము లేకుండగ కొంతమందిని లేఖాచార ప్రకారము వదలెదరు. అనంతరము గృహస్థులకు తీర్థప్రసాదములు ఇయ్యఁబడును.

పూరాతిరుప్పావడ.

కొన్ని బస్తాల బియ్యంవంటచేసి బంగారువాకిలిముందు రంగపటములో వేసి నివేదనయిన తర్వాత అచ్చట గృహస్థు వలన సంకల్పముతో దత్తముచేయించెదరు.

అర తిరుప్పావడ.

పూరాతిరుపావడవలెనె జరుగును గాని కుంభమునకు మాత్రము సగము సామానులుపడును.

కోవిలాళ్వార్ తిరుమంజనము

తెల్లవారుసరికి మొదటిఘంటయి లోపల అఖండము లుంచు శమ్మలు మొ|| బయటకుఁదీసి శుద్ధిచేసి గోడలు, పై కప్పు మొదలగువానికి కుంకుమ, కర్పూరము చందనము మొదలగునవి కలపి పూయుదురు. తెఱువాత రెండవఘంట నాలుగు ఘంటలకయి గృహస్థుకు వస్త్ర బహుమానముయి వాద్యములతో వెళ్లినపిదప ధర్మదర్శన మారంభమగును.

సహస్రలాశాభిషేకము.

శ్రీవారి మొదటిఘంట ఉయము 8-ఘంటలకు అయిన తఱువాత వెయ్యిన్ని యెనిమిది వెండి చెంబులతో మంత్రవత్ హోమయుక్తముగా అభిషేకము జరుగును. శ్రీవారి రంగ మంటపములో శ్రీభోగశ్రీనివాసమార్తివారు, శ్రీఉత్సవరులు శ్రీసేనాధిపతి వారికి అభిషేకము జరుగును. శ్రీభోగ శ్రీనిహాస మూర్తివారికి, శ్రీమూలవరులకుపట్టసూత్రముచేత సంబంధము గలిగియుండును. శ్రీభోగశ్రీనివాసమూర్తి వారు ఈసహస్ర కలశాభిషేకమునకు మాత్రము బంగారువాకిలిదాటివచ్చెదరు.