తిరుమల తిరుపతి యాత్ర/అధ్యాయము 4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అ ధ్యా య ము IV.

ప్రసాదములు.

ఇది దేవస్థానపు స్వంతము, ధర్మము, ఆర్జితమని మూఁ డువిధములు. ప్రతిరోజు మొదటిఘంట రెండవఘంటలకు ఈ మూఁడు విధంబుల నివేదన లుండవచ్చును గాని రాత్రిమాత్రము దేవస్థానపు స్వంతములో ఖర్చుపడిన నివేదనమాత్ర ముండును. మొదటిఘంటకు నివేదనయిన త్రివిధ ప్రసాదములలో దేవస్థానపు స్వంతమనునవి కయింకర్యపరులు మొదలగువారికి హోదాకు తగినట్టు మర్యాదలు చేయుటకును దేశాంతర బ్రాహ్మణాది వినియోగమునకును ఖర్చు పడును. ధర్మము అనఁగా ప్రతిదినము గాని కొన్ని రోజులలోఁగాని కొందఱు సామానులు ఇచ్చి ప్రసాదములు చేయించి ఆరగింపు చేయించెదరు. ఇది దేశాంతరులకు వినియోగము చేయవలసినది. హైదరాబాదు వరవర నరశింహరావుగారు, బెంగుళూరు శామన్న అనే శ్రీని వాసాచార్లుగారు, మైసూరు మహారాజుగారు, పుదుక్కోట రాజుగారు, సర్ తామస్ మన్రోదొరగారు మొదలగువార్ల ధర్మములు గలవు. సర్ తామాస్ మన్రోగారిధర్మము శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతాపమును దెలియఁ జేయక మానదు గదా! ఆర్జితమనఁగా యాత్రికులు సొమ్ము దేవస్థానము పారు పత్యదార్ కచ్చేరిలో చెల్లించి రసీదు తీసుకొని నివేదన చేయించిన ప్రసాదములు. ఇవి ఆరగింపు అయిన తఱువాఁత స్థలాచార ప్రకారము కొంచెము ప్రసాద మెత్తుకొని తక్కినది యాత్రికులకు నియ్యఁబడును. మధ్యాహ్నము రెండవఘంట నివేదనకు దేవస్థానపు స్వంత ప్రసాదములున్నవి. మొదటిఘంటకు నివేదన కాని ఆర్జిత పదార్థము లున్నంతట ఇప్పు డారగింపవును. రెండపఘంట నివేదనయిన ఒక గంగాళం చక్కెర పొంగలి దేశాంతర బ్రాహ్మణ వినియోగము చేయఁబడును.

రాత్రిఘంటకు నివేదన దేవస్థానపు స్వంతప్రసాదమయినందునఁ గొంత మర్యాదలక్రిందను, కొంత దేశాంతర వినియోగమునకును ఖర్చు పెట్టఁబడును. రాత్రి ఇది తప్ప దేశాంతర బ్రాహ్మణులకుఁ బెట్టు అన్న సత్రములు లేవు. రాత్రి తీర్మా నమయిన వెంటనే యొక చిన్న గంగాళము చక్కెరపొంగలి దేశాంతరులకు వినియోగము చేయింపఁబడును.

గురువారము పూలంగి యయిన తఱువాత వడపప్పు, పానకమును శుక్రవారము రెండవఘంటకు పోళీలు, వడపప్పు, పానకమును కూడ ఆరగింపవును.

ఆర్జితధర్మముల పణ్యారములు --- చ స 34. గము వలెత్రికాలని వేదనలలో ఎప్పుడైనను సను ' ' ' యాత్రికులు

పరఖామణి.

యాత్రికులు ముడుపులు దేవస్థానము పారుపత్యదార్ కచ్చేరిలో చెల్లించెదరు. లేదా డబ్బి, జోలి, గోలక్. కొప్పెర అని వేర్వేరు నామములచే వ్యవహరింపఁబడు హుండి పారు పత్యదార్ కచ్చేరికి ఎదురుగను త్తర భాగమున పహారాబందో బస్తులోనుండు రాగిగంగాళము పొరలుగల దళముగుడ్డ బుర్కాలోనుంచబడి గోల్సులతో నిలువెత్తునఁగట్టబడి నాలు
గుశీళ్లుగల దానిలో వేయవలయును. కచ్చేరీలోఁ జెల్లించిన దానిక రసీదు ఇచ్చెదరు. కొప్పెరలో వేసిన దానికి రసీదు లేదు. గాని రెండువిధములుగ చెల్లించినసొమ్ము దేవునకు చేరును. ఇది గాక యాత్రీకులొక వేళ సన్నిధిలోనికి దర్శనమునకు వెళ్లినపుడు, ఏమైనను సైకము వేయుదురను నుద్దేశముతో కుల శేఖరపడి అను కడపవద్ద ఒక చిన్నపెట్టె బీగములు శీళ్లుపైని రూపాయి పెట్టుటకు గంధ౸ము గలిగి సహరబః దోబస్తుతో ఉంచబడి యుండును. యాత్రికులు ఏముయిన వేసినంతట ఆడబ్బిలో వేయ వలయును గాని ఇతరత్ర ఇయ్యగూడదు. ఇట్లు హుండిలోను, చిన్న పెట్టెలోను వేయబడిన ముడుపులు పారుపత్యదార్ బావాజి, అసిస్టాంటు ట్రెజరరు, జియ్యంగారు, గుమస్తా ఎదుర నుండి హుండిని విప్పించి నాణ్యంవారిగ షరాబులు నెగై రా లచేఁ బారుపత్యదార్ ఏర్పాటు చేయించును. ఈనాణ్యములు ఏర్పరచి లెఖవ్రాయుట కే ప"ఖామణి యనిపేరు. ఇదివరలో దర్శనము అను హెడ్డింగులో సందర్భానుసారముగఁ జెప్పీన ప్రకారము ఈపరఖామణి ప్రతిదినమునాధారణముగా మధ్యాహ్నము ! ఘంటపై నుండి సాయంకాలము వరకు జరుగును. ఇది మఱుదిన ముదయమువరకు పారుపత్యదార్ కచ్చేరిలో నియ్యఁబడిన హారతి, అర్చన, వాహనము మొదలగు టిక్కెట్ల కు సొమ్ముముల్లెల (Bundles.) తోకూడ భద్రము చేయ బడి తిరుపతిలోనుండు దేవస్థానపు ట్రెజరీకి రవానా చేయఁబడి బంగారు వగైరాలు దేవస్థానపు విచారణకర్తలవారివలన యాలములో విక్రయింపఁబడును.

పక్షదిట్టము.



ప్రతి ఏ కాదశికి మూలవరులకుఁ గాక ఇతర మూర్తులకు తిరుమంజనముజరుగును. ద్వాదసులందును బహుళఏకా దసులందును విశేషనివేదనైన దధ్యోదనము జరుగును.

శ్రవణ నక్షత్రదిట్టము.

శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణనక్షత్రము రోజున శ్రీఉత్సవరులకు తాయారులసయితము తిరుమంజనమయి శ్రీవారి రెండవఘుంట అయినవెంటనే విశేషవస్త్రా౸భరణంబుల నలంకారంబులు గావించి బంగారు తిరిచితో నుత్సవము శోభాయమానముగ నాలుగువీధుల జరిపించి దేవస్థానములో బంగారువాకిలి కెదురుగ రంగమంటపములో మేచేయింపు చేసిన పిదప చక్కెరపొంగల్ , శుండల్, (శనగలు) దోశలు, ఆరగింపయి గోష్టి వినియోగమవును. అనంతరము వివేషాలు కారము తీసి శ్రీవారు సన్నిధిలోనికి విజయము చేసిన తరువాత తోమాల సేవ, అర్చనఘంట మొదలగునవి మామూలు ప్రకారము జరుగును.

రోహిణి

శ్రీకృష్ణ స్వామివారి జన్మనక్షత్రమయిన రోహిణీ నక్షత్రమందు రెండవఘంట యయిన పిదప శ్రీరుక్మిణీసమేత శ్రీకృష్ణస్వామివారికి నాలుగువీధు లుత్సవమవును.అనంతరము శ్రీవారికి రంగమంటపములో పొంగలి, శనగపప్పు ఆరగింపయి ఆస్టానములో వినియోగమవును. తఱువాత శ్రీవార్లు సన్నిధిలోనికి  విజయంచేసిన తఱువాత రాత్రి తోమాల సేవ మొదలగునవి జరుగును.

ఆర్ద౸.

శ్రీ భాష్య కారులవారి తిరునక్షత్రమయిన అర్ధా౸నక్షత్రమున రెండవఘంట అయిన తెఱువాత శ్రీ వేంకటేశ్వరస్వామివారు,అమ్మవార్ల సహావెండితిర్చిలో విజయము చేసి శ్రీభాష్యకార్లను అభిముఖముగ నొకతిర్చిలో నుండి నాలుగువీధుల ఉత్సవమయి దేవస్థానములో శ్రీభాష్యకార్లగుడికి ముందుముటపములో శ్రీవార్లు విజయము చేసిన పదంపడి పొంగలి, శుం డలు. (శనగపప్పు) ఆరగింపవును. ఆస్థానములో గోష్ట వినియో గమయినపిదప శ్రీవారు తాయర్ల సయితము సన్నిధిలో నికి విజయము చేయఁగ రాత్రి తోమాల సేవ మొదలగునవి జరుగును.

ధర్మము.

పునర్వసు నక్షత్రము.

శ్రీరాములవారి జన్మనక్షత్రమైన ప్రతి పునర్వసు నక్షత్రమందు శీతాలక్షణ హనుమత్సహిత శ్రీరాముల వారికి నుత్సవము జరుగును. ఇది శ్రీహత్తీరాంజిమఠం అధికారి శ్రీరామ లఖన్ దాస్ జిగారు దేవస్థానములో సొమ్ము కట్టినందున శాశ్వ తముగ నుత్సవము జరుగును. శ్రీ రాములవారు పడమటవీధి లోని ధర్మకర్తగారు కట్టించిన మంటపములోనికి విజయము చేసి దోశ ఆరగింపు వినియోగాదులయిన తుఱువాత మహాప్ర దక్షణముగ గుడిలోనికి విజయంచేయఁగ రాత్రి తోమాల సేవ మొదలగునవి జరుగును. శ్రీరాములవారు ఈ ఉత్సవము లో విశేషవస్త్రా౸భరణాలంకారభూషితులుగ నుందురు.

చిత్తానక్షత్రము.

ఇది శ్రీమైసూరు మహారాజుగారి జన్మనక్షత్రము. ప్రతి నెలకు చిత్తానక్షత్రమందు శ్రీవారికి మైసూరు మహారాజుగారి చె సమర్పింపఁబడిన దంతపు పనిచేసిన పాలకియం దుత్సవము జరిగి శ్రీవారి గంగమంటపములో పుళిహోర ఆరగింపయి ఆస్థానమందు వినియోగము జరుకొను. ఇది యుభయనాంచార్లస మేతమైన ఉత్సవము. అనంతరము రాత్రి తోమాల సేవ మొదలగునవి మామూలు ప్రకారము జరుగును.

ద్వాదశిఉత్సవము.

శ్రీమలయప్ప స్వామివారు (శ్రీ వెంక టేశ వుత్సవరులు) పగలు రెండవఘంట అయిన తఱువాత కొయ్యతిరిచిలో మహా ప్రదక్షణముగను త్తరపు వీధిలోనున్న శ్రీగద్వాల్ రాజు గారి ద్వాదశీమంటపమునకు విజయము చేసి యచ్చట శ్రీరాజుగారి ఏజంటు. వేసిన పుళిహోర, శనగపప్పు నివేదింపఁబడి ఆస్థా నమందు వినియోగమవును. అనంతఱము శ్రీవారు దేవస్థాన ములోనికి విజయము చేయ రాత్రి తోమాల సేవ మొదలగునవి పద్ధతి ప్రకారముజరుగును. ఇది శ్రీగద్వాలరాజు ధర్మము.

వసంతోత్సవము.

ఇది ప్రతిసంవత్సరము చైత్ర శుద్ధ త్రయోదశి మొదలు పూర్ణిమనరకు మూఁడుదినములు జరుగును. మొదటి రెండు రోజులు వుదయము 8 ఘంటలకు శ్రీవారికి రెండవ నినేదన అయి బంగారుతిరిచిలో పునర్వసు ఉత్సనమునకుఁ జెప్పినమంట పమునకు విజయము చేసి యచ్చట ఉరుమంజనము, అలంకా రము, నివేదన, ఆస్థానవినియోగములు, ఉత్సవమయిన తఱువాత శ్రీవారు కొంతరాత్రి అయినపిదప దేవస్థానములోనికి విజయము చేసి నిత్యోత్సవాస్థానములయి శ్రీవారు సన్నిధి లోనికి దయచేసి తోమాలసేవ మొదలగునవి జరిగి తీర్మానమవును . మూడవరోజుగూడ ఇదేగతిగ జరుగును. సీతాలక్షణ హనుమత్స మేతముగ రాములవారు కూడా విజయము చేసెదరు. ఉత్సవము కన్నులపండుగగనుండును . ఈ మూడురోజులు రాత్రిపగలు రెండుపూటలు బ్రాహ్మణారాధన జరుగును. ఈయుత్సవము ఆధికారి శ్రీరామలఖన్ దాస్ జివారి ధర్మము.