తిరుమల తిరుపతి యాత్ర/అధ్యాయము 3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయము. III.

శ్రీవారిదర్శనము.

దేవస్థానము యొక్క పడి కావలి యనెడి సింహ ద్వారపు తలుపులు ప్రాతఃకాలమున హరి కొలువను మంగళవాద్యమైన పిదప తెరబడి అర్చకులు వచ్చు వరకు యాత్రికులను లోనికి వెళ్లనివ్వరు. (అనగా లోపల తుడుచుట లేక ఊడ్చుట, శుద్ది చేయుట వగైరా పనులు అయ్యే వరకు అని అర్థము) ఉదయము 6, 7 ఘంటలకు దేవస్థానపు గర్భాలయము యొక్క బంగారు వాకిలి అనే మొదటి ద్వారపు తలుపులు తీయిబడును. అర్చకులు వచ్చునపుడందరికి తెలియునట్లు ఒక ఘంట వాయింపబడును. దేవస్థానము పారుపత్య దారు ఉత్తరువు ప్రకారము బంగారు వాకిలి తలుపులు తీసిన వెంటనే గొల్ల, అర్చకులు, జియ్యంగార్లు లోపలికెళ్లి తలుపులు మూసుకొని శయనమునకు విజయం చేసిన శ్రీవారిని యధాస్థానాసీనులుగ జేసి హత్తీరాంజీమఠము వారు తెచ్చిన ధారోష్టము పాలు ఆరగింపు చేసి తలుపులు తిరిగి తీసెదరు.అంతవరకు లోపల అర్చకులును జియ్యంగార్లును, బయట ఇతర కైంకర్యములును, సుప్రభాతమనెడు మంగళశ్లోకములను చెప్పు చుందురు. తరువాత తలుపులు తెరువ లోపలకు వెళ్లి సుప్ర భాతము జెప్పుచుండగ స్థలాచార ప్రకారము కైంకర్యపరులు తీర్థ ప్రసాదములను స్వీకరించెదరు. మంచము పరుపు మొదలగు సామానులు వెలుపలకు దేబడును. కొప్పెరయుగట్టబడును. ఈ లోపున కైకంర్య పరులు ఇతర బ్రాహ్మణులను సహా వదులుట దుర్లభము. స్త్రీలు మొదలగు వారి మాట చెప్పనవసరము లేదు. అనంతరము విశ్వరూప దర్శనమననే ధర్మ దర్శన ప్రారంభమయి శ్రీవారికి చెల్లించిన వారు మొదలగు కొందరిని ముందుగ గేట్ ద్వారా వదలి దర్శన మయిన తరువాత తడవకు కొంత మంది వంతున ప్రతి సారియు దర్శనమునకు నితరులను ఘంటల గేట్ ద్వారా వదలెదరు. గేట్ గుండా దేవస్థానపు వుద్యోగస్థుల ఉత్తరవు లేనిది అచ్చట నుండు పహరాజవాన్ లోపలకు వదలడు. ఈ సంగతి గమనించక గొందరు అచ్చట నుండు జవాన్ తో కొట్లాడెదరు. ఈ ప్రకారము ప్రతితడవ దర్శనమునకు కాచుకొని యున్న యాత్రికులకు శ్రీవారి దర్శనమవును. యాత్రికులలో గొందరు శిపర్శుజాబులు పారు పత్యదార్ మొదలగు తిరుమల వాసులకు దెచ్చెదరు. పారుపత్య దార్ కు గాక ఇతరులకు వచ్చు జాబులకును నతడె సౌకర్యము చేయవలసి యున్నది. వీరిలో కొందరు పత్రిక దెచ్చిన కారణ మాత్రము చేతనే తమకు బత్రిక గైకొను వారు భృత్యలని దలచి వేడినీళ్లు, కాపీ, భోజనము ఆవేళలందు దర్శనము పరుండుటకు పరుపులు, దిండ్లు ధర్మార్థము బసనిచ్చు ఖాళీ ఇండ్లు లేనప్పుడు గూడబడుగ లేకనే ఇండ్లు మొదలగు వానిని గోరి నిర్భందము జేయక ప్రవర్తించుట ఉత్తమము. జాబులు లేని వారికి సహితము తగినంత సౌకర్యము పారు పత్య దార్ చేయును. ఇది ధర్మ దర్శనమయినందున ఎంత మాత్రము సొమ్ము దర్శనమునకు ఖర్చు పెట్టనవసరము లేదు. ఒక్క వేళ దుర్భోధన చేయు వారుండిన యెడల దేవస్థానము పారు పత్య దార్ వద్దకు తీసుకొని వచ్చిన పక్షమున తగిన చర్య జరిపింప బడును. శ్రీవారికి హారతి చేయించగోరు వారు హారతి 1-కి 1-0-0 వంతున దేవస్థానం పారు పత్య దార్ కచ్చేరిలో షరాయి (shroff) వద్ద చెల్లించి హారతి చీటి పుచ్చుకొని సన్నిధికి వెళ్లినప్పుడు అచ్చట తండు అనగా గుంపులోపలకు బోకుండగ వేసిన కర్రలవద్ద నిల్చుండిన సన్నిధి హర్కారా అనే బ్రాహ్మణూని వద్ద నిచ్చిన హారతి చేయించును గాని టిక్కెట్టు కొనినంత మాత్రము చేత నాధిక్యత లేదు. ఈ విశ్వరూప దర్శన కాలము లో నిచ్చిన తీర్థము రాత్రి శ్రీవారికి బ్రహ్మారాధన చేసినది చాల విశేషముగ నెంచబడును. యాత్రస్థుల సంఖ్యను బట్టి ఘంట, లేక రెండు ఘంటలు విశ్వరూప దర్శన కాలమునకు నొసంగబడును. బంగారు వాకిలి లోగా [గర్భాలయమునకు మొదటి బయట వాకిలి] షరాయి ధరించిన వారిని వెళ్ళనియ్యరు. ఆయుధములు, చేతి కట్టెలు తోలు మొదలగు వాని ధరియించి యుండిన యెడల పడి కావలి లోనె వదలవలెను. అట్లు చేయని యెడల బంగారు వాకిలి లోగా వదలరు. ఘోషా స్త్రీలకు తోమాల సేవ అభిషేకము అర్చన ఏకాంత సేవ దర్శనములు దప్ప నితర దర్శన కాలములలో ముఖ్యులను మాత్రముంచి యితరులు లేకుండగ దర్శనము చేయిటకు విచారణ కర్తల వారు లేక పారుపత్య దార్ ఏర్పాటు చేయించుదురు. ఘోషా స్త్రీల మేనా లేక సవారి పడి కావలిలోపలనున్న రాయలు మంటపములో శ్రీకృష్ణదేవరాయ లు వారి భార్యలు తమ్ముడుయొక్క ప్రతిమలుగల మంటపము లోదింపనలెను. ఇందుకు విచారణకర్తలవారి వుత్తరవు గావలెను. అచ్చటనుండి ఘటాటోపము లేక ఖణితి పరదా అనెడి ముసుకులో బంగారు వాకిలివరకు వచ్చి యచ్చటనుండి లోపలకు ముసుకు లేకుండఁగ వెళ్లవలెను.

దర్శన కాలములో యాత్రికులు లోపల నొకవేళ సొమ్ము వేయదలఁచి నంతట తండువద్ద గల కులశేఖరపడి అనే వెండిగడపమీఁద మొహరులతో బీగముగలిగి పై మూత మీద రూపాయపట్టుటకు రంధ్రముగలిగి యుండు చిన్న పెట్టెలో వేయవలెను. ఇచ్చట పహరాగలదు. ఎవరి చేతికిని సొమ్ము నియ్యకూడదు. లోపల ధర్మార్థ మెవరికి సేదియు నియ్యగూడదు. ధర్మ దర్శనకాలములో నొక్కొక్కతడవకు కొంత మంది దర్శనమునకు వదలునపుడు మగవాండ్రను వేఱుగను నాఁడువాండ్రను వేఱుగను వదల వలసినదని కొందరు చెప్పెదరుగాని తాముమాత్రము తమ ఆఁడవాండ్రను వదలి ప్రత్యేకముగ దర్శనము చేయుటకు సమ్మతింపరు. ఇదేమాదిరి ఇతరులును అభిప్రాయపడి ఆఁడవాండ్రను వదలి వెళ్లరనే సంగతి గ్రాహ్యము. ఇందుకు నొక దృష్టాంతము చెప్పెదను. రయలులో నాడవాండ్రకు ప్రత్యేక మొక బండియున్న ను నచ్చటం గూర్చుండఁ బెట్టక ననేకులు తమ యాఁడవాండ్రను తమతో గూర్చుండఁ బెట్టుకొనుటఁ జూడ లేదా! కావున నిది జరుపుట యాత్రస్థులను కష్ట బెట్టుటని యెఱుఁగవలయును. అయినను కొన్ని వేళల నిది జరుపబడుచున్నది.

శుద్ధి.

పై దర్శనమయిన పిదప శుద్ధి చేయఁబడును. శుద్ధియనగా శుభ్రపరచుట. దీనికి నఱఘంట పట్టును. ఈసమయమున పాత్రలు, (Flooring), నట్టిల్లు బాగుగ శుద్ధిచేసి ముందు జరుగబోవు సేవకు పాత్రలలో నాకాశగంగ తీర్థము నింపి యుంచెదరు. ఈ సమయమునందు లోపలఁ బనిజేయు సేవకులు దప్ప నితరులు పోగూడదు.

తోమాలసేవ.

ఇది శుద్ధి అయిన వెంటనే ఆరంభమవును. ఇది శ్రీవారి కారాధనయై పుష్పమాలలు సమర్పించెడి సేవ, ఈ సేవఁ జేయించువారు దేవస్థానము పారుపత్యదార్ ఖచ్చేరిలో షరాబువద్ద ర్పు 13-0-0 లు చెల్లించి యొక టిక్కెటు తీసుకోనులయును. టిక్కెటు 1-కి అయిదుమంది వంతున వదలెదరు. హెచ్చువదలరు. శ్రీవారి బ్రహ్మోత్సవము, నవరాత్రోత్సవములలో మాత్రము నలుగురు వంతున వడలఁబడుదురు. అంతేగాక నమంత్రణోత్సవము, బ్రహ్మోత్సవము జరిపించుటకు రూపాయలు చెల్లించిన వారిని సాధారణ దివసములలో 10 మంది మొదలు తరగతివారి బ్రహ్మోత్సవమును బట్టి వదలెదరు. ఇట్లు సొమ్ము చెల్లించిన వారందఱు సేవారంభము మొద లంత్యమువరకునుండవలసినందున నొకప్పు డించుక జస స్తోమ మర్చన, ఏకాంతసేవలలోవలెఁ గల్గును గాన నట్టిస్తోమము లేకుండ దర్శనము గోరువారి మనోరధము సిద్ధించుట దుర్లభము. ఈ సేవలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారి కభిషేకమగును. శ్రీమూలవరుల నిజపాదదర్శన ప్రాప్తి గల్గును. శ్రీవారి కారాధనయయి తోమాలలచే నలంకరించెదరు. ఈ సేవలో వేదపారాయణము, ద్రవిడ ప్రబంధపారాయణము జరుగును. ఈకాలములో గద్వాల్ రాజుగారి నేతిదివిటీలు వెల్గును. హత్తీరాంజీమఠము యొక్కయు, మైసూర్ సంస్థానము యొక్కయు మనుష్యులు చామర కైంకర్యముఁ జేయుదురు. సేవాంత్యమున దేవస్థానపు హారతి ఒకటి అయిన తఱువాత గృహస్థుల హారతి టిక్కెట్లకు హారతి చేయఁబడును. వెంటనే యత్రికులు వెలుపలకు రావలెను.

కొలువు.

ఈపదమున కిచట దర్బార్ అనియర్ధము. శ్రీవారికులశేఖర పడివద్దనుండి వెండి ఖుర్చీలో శ్రీకొలువు శ్రీనివాసమూ ర్తివారు దేవస్థానముయొక్కయు, గద్వాల్ రాజుగారి యొక్కయు వెండి నెయ్యిదివిటీలు మండుచు ముందురాగా రంగమంటపము అనఁగా బంగారువాకిలి ముందుండు మంటపము లోనికి శఠారి సయితముగా విజయంచేయుదురు. శ్రీమైసూర్ మహారాజుగారిచే సమర్పింపబడిన బంగారుగొడుగు వారివల్ల నియమించబడిన బ్రాహ్మణునిచేఁ బట్టబడును. అప్పుడు లఘువు గానారాధన చేసి ర్పు 0-2-0లు రొఖము, 16 శేరుల బియ్యము నూనెయు నర్చకులకు దేవస్థానమునుండి దానమిచ్చెదరు. దేవస్థానమునుండి ఖర్చుపడు నువ్వులు, శొంఠి వేయించి పొడి చేసి బెల్లముతో కలిపి నివేదన చేయఁబడును. పంచాంగ శ్రవణ మయి గతదినపు చిఠా శ్రీవారికి (శ్రుతపరుపఁబ డును. దేవస్థానపు స్వంత నవనీతహారతి, శ కారియయి ప్రసా డము స్థలపద్ధతి ప్రకారమువినియోగమవును. శ్రీశారు సన్నిధి లోనికి దయచేసెదరు. ఈకొలువు శ్రీవారి బ్రహ్మో త్సవపు ధ్వ ఆరోహణదీవసమున నిల్పఁబడి దీపావళి 'కారంభ మవును. ఈకొలువు కాలములో హజ్రీరాంజీ మఠపు సాధువు శ్రీవారికి చానురము వేయును,

అర్చన.

కొలువు అయిన పదినిమిషములకు తులసి సహసనా మార్చన ఆరంభమునకు ముండర్చన చేయించువారిని (అనగా పారుపత్యదార్ ఖచ్చేరిలో ర్పు 1-0-0 లు చెల్లించి అర్చన టిక్కెట్ తీసుకొనిన "పోరిని) టిక్కెట్ 1_కి మందీవంతున శ్రీవారి బ్రహ్మో త్సవము, నవ రాలోత్సవములలో క్రిమంది వంతునపద లెదరు.బ్రహాళ్మోత్సవముతిమంత్రణోత్సవము గృహ స్థులను వద లెదరు. అర్చన గృహస్థులారంభము మొదలంత్యము. వరకు లోనుందుగుగాన నొకప్పుడు జనస్తోమముండును. "తో మాల సేవ, ఏకాంత సేనలలో వలె గృహస్థులాతుర పడక సామ ధాన మనస్కులై ఒకరికొకర సౌకర్యముగలుగకుండ మనిషి నునీషి కేడము విడచివరుసలుగా నిల్చుండిన నంజుకు చక్కగా -దర్శనమవును. ఎన్ని అర్చగ టిక్కెట్లున్నను లేకున్న నొక సారి మాత్రను సహస్రనామార్చన లేక నట్టే త్తర నామార్చన తోమాల కేవ, ఏకాంత సేవలవలె జరిగి అర్చనగృహస్థులకు గోత్రనామములతో సౌశీర్వాదము సేయుదురు. తోమాల సేవ యందు, ఏకాంత సేవయందును ధర దర్శన కాలములలోవలె నిప్పుడును యాత్రీకు లెవరికి సొమ్ము లోపలనియ్యఁగూడదు. -ఈ సేవలు, ఉత్సనములు మొదలగువానికి టిక్కెట్ కును కచ్చేరిలో నిచ్చిన సొమ్ముతప్ప వేరేనియ్య నవసరము లేదు. ఇతర సేవలలోనటి హారతి టిక్కెట్ యాత్రికులు కచ్చేరిలో కొనుకోని సన్నిధిలో నిచ్చినంతట హారతి జరుగును. అనంత రము యాత్రికులు వెలుపలకురావలయును.

అర్చన, ఏకాంత సేవ, తోమాల సేవలకు సొమ్ము చెల్లిం చిన గృహస్థులను (బ్రహ్మోత్సవము నవరాత్సవము మొ దలగు విశేప దివసములుదప్ప) దేవస్థానమునుండి మనిషివచ్చి సేవకురమ్మని పిల్చును. ఆలస్యము చేసినంతట నిరీక్షింపరు. సేవ లకు టికెట్లు సేయువారు దిగిన జాగా గుర్తు బాగుగ జెప్పవ లెను. దేవస్థానపు మనిషి తనజాగాకు వచ్చినపుడు గృహ స్థులు లేనంతట "సేవలు వారికిగాను నిల్పఁబడవు.

తరువాత లఘుశుద్ధి ఆయి నీవేదనకుపోటు అనెడి వంటశాలనుండి పక్వపదార్థములుగల గంగాళము తెచ్చెదరు. ని వేదన కాలములో ఖచ్చేరి ప్రక్క–ననుండు రెండు పెద్దఘంటలు మోగించెదరు. ఇది సాధారణముగా మధ్యాహ్నము 12 ఘంటలప్పుడవను నివేదిసలనుగుఱించి “ ప్రసాదముల” నే హెడ్డింగ్ లో వ్రాయబడినది. ఈఘంటనిల్చిన తేఱువాత చుట్టు దేవత, లనఁగా పరీవార దేవతల కారగింపయి జియ్యంగార్లు మొదలగు కైంకర్యపరులు శాత్తు మొరకు లోపలకు వెళ్లి ద్రవిడ ప్రబం ధముఁ బూర్తిఁ జేసి తీర్జప్రసాదములగ దీసుకొని వచ్చిన తఱువాత ధర్మదర్శనమవును.

ధర్మదర్శనము.

దీనిని ఘంటదర్శనమనియు, మధ్యాహ్న దర్శనమనియు ననెదరు. ఉదయము విశ్వరూపదర్శనమువలె నిఉయు ధర్మదర్శనము. యాత్రికు లాతురపడక నిదానముగ దర్శనము చేసుకొనవలయును. దర్శన మందఱకయ్యే వరకు సమయముండును. కావున కొందరు దలాలీల (అనగా యాత్రికుల నాదరించువారివలె సంచరించువారు) దుర్భోధనలు విని సొమ్ము వృధాగా ఖర్చుపెట్టఁగూడదు. గుంపులో పో-శక్తులు పోరు పత్యదారుతో జెప్పుకొనినంతట సాధ్యమైనంత సౌకర్యము జేయించును.

ధర్మదర్శనకాలములో శ్రీవారి దర్శనమునకు లోపలికి వెళ్లినవారు తీర్థము శటారి మొదలగునవి అయిన తఱువాత వెంటనే బైటికి రావలెను. ఎవరికి వారు కొంచెము కాలములోపల నిలువబడి బయటికి రావడములో నాలస్యము జేసినంతట నహోరాత్రములు పనిజేసె నవుఖరులకును తమవలె దర్శనమునకు కాచియుండే యాత్రికులకును శ్రీవారి ముందు కార్యములకు నిబ్బంది గలుగును. గనుక నీ సంగతి ప్రతివారును గమనించవలెను. సాధారణముగా నీ ధర్మ దర్శనకాలములో హుండి విప్పి పరఖామణికి ప్రారంభము చేయుదురు.

ధర్మదర్శనమైన తఱువాత వచ్చు విశేష సేవలకు సొమ్ము జెల్లించి రసీదు తీసుకొనినవారు దర్మార్థముగా విశేష సేవలు జేయింపుమని పారుపత్యదారు హింసించు టుత్తమము గాదు.

అర్చన.

పైన నివరించిన ప్రకారము ఘంట దర్శనమైన తఱువాత శుద్ధిఅయి అష్టోత్తర నామార్చన అవును. ర్పు. 7-0–0లు చెల్లించి అర్చన రసీదు తీసుకొనిన గృహస్థులను సహస్త్ర నామార్చనలో చెప్పిన రీతిగ వదలి అర్చన జరుపఁబడును.

నివేదన.

తఱువాత శుద్ది, రెండవఘంట నివేదనఅయి పరివార దేవతల పైకి శ్రీభాష్య కార్యులవారికి మాత్రము శ్రీవారి ప్రసాదము ఆరగింపయి బంగారువాకిలి తలుపులు వేయఁగ నర్చకుడు మొదలగు లోని కైంకర్యపరులు బస కేగెదరు.

ఆర్జితోత్సవము లనఁగా గృహస్థులు సొముఖచేరీలో జెల్లించి చేయించెడి యుత్సవము లిపుడు జరుగవలసినది గనుక నుత్సవరులు వాహన మంటపమునకు మేళతాళముతో విజయము చేసెదరు. ఉత్సవములగుఱించి ప్రత్యేకముగఁ చెప్పంబడును. ఎండ చల్లబడినప్పుడున్ను, వర్షము లేనప్పుడున్ను జరుగును.

రాత్రిదర్శనము.

తిరుగ నర్చకులు, స్నానముచేసుకొని సంధ్యవేళలోను నార్జితోత్సవములు కాఁగా వచ్చి పారుపత్యదార్ ఉత్తరవుఁ బొంది బంగారువాకిలి తీసి శుద్ధి, తోమాలసేవ, అర్చన, నివే దనఘంట జరుపుదురు. తోమాలసేవ, అర్చనరహస్యముగ జరుగును. ఎవరిని వదలరు. నివేదనఘంట తఱువాత మధ్యాహ్నమువలె ధర్మదర్శనముండును. వెంటనెకొప్పెరవిప్పి యందలి సొత్తులను సంచిలోవేసి సీళ్లుచేసి భద్రముచేసి మఱుదినము దయమునఁగట్టి మధ్యాహ్నము విప్పగా నేర్పడిన కొప్పెర లోని ముడుపులతోఁ జేర్చి పారుపత్యదారి ఖచేరిలో పరఖామణి చేయఁబడును.

ఏకాంతశేవ.

రాత్రికొప్పెర విప్పినపరువాత శుద్ధి అయి మంచము వెండిగొలుసులతో జోడించి శ్రీపాదచందనము, పాలు, పండ్లు మొదలగునవి సన్నిధిలోనికి తీసుకొనిపోయిన వెంటనే తీర్మాన మనఁగా ఏకాంతసేవకు నుత్తరవీయఁబడును. అప్పుడు సన్నిధిలో శ్రీరాములవారి సన్నిధియనఁబడు రెండువహాలు తలుపులుమూసీ అర్చకులు మాత్రముండి శ్రీభోగశ్రీనివాసమూర్తి వారిని జోడించిన వెండిమంచము వెల్‌వెట్ పఱుపుమీద శయనాసీనులఁగఁ జేసి పాలు పండ్లు మొదలగునవి యారగింపు జేసి తలుపులు తీసిన వెంటనే ఏకాంతసేవకుగాను రు. 13-0-0లు పారుపత్యదార్ కచేరిలో చెల్లించి టిక్కెట్టుతీసుకొనినవారిని, ఆమంత్రణోత్సవము, బ్రహ్మోత్సవము, గృహస్థులను లెఖ ప్రకారము లోపలకు వదలెదరు. ఏకాంతసేవ టిక్కెటు 1-కి బ్రహ్మోత్సవములోను, నవరాత్రోత్సవములోను నలుగురను తక్కిన దినములలో 5 మందిజనమును వదలెదరు. వీరందఱు బంగారువాకిలిదాటి స్థపనమంటపమను మొదటి హాలులో నిలచియుండవలెను. అప్పుడు సామానులు దేవస్థానమునుండి ఈయబడిన తరిగొండ వారిచే దేఁబడు ముత్యాలహారతి జరుగును. ఇతరహారతులను జేయరు. ఈహారతితట్టలో (అనగా పళ్లెరములో) రూపాయవేసినంతట దానిని జరిపించినట్టు భావము. ఆరూపాయ వెంటనే పారుపత్యదార్ వద్దకుఁ దేఁబడి దేవుని ఖజానాకుఁ జేరుటకు డబ్బీలో వేయఁబడును. హారతి అయిన తఱువాత పాలు, పండ్లు మొదలగునవి వినియోగము జేసి అందరిని బయటకు పంపి అర్చకులు, జియ్యంగారులు లేక నేకాంగులు సన్నిధిలో దివిటీపట్టు గొల్లలోపలనుండి తలుపులు వేసుకొని శోధనచేసుకొని బయటికేగెదరు, సన్నిధిలో కైంకర్వ పరులు బంగారు వాకిల బయటకు వచ్చినప్పుడు నిబంధన ప్రకాగము ఇప్పుడును బంగారువాకిలి హర్కారాశోధన చేసివదలును. అనంతరము బంగారు వాకిటికి బీగమువేసి మొహర్లు చేసి పారుపత్యదార్ బావాజి సహితముగా మొహరులు, బీగములు చూచుకొని ప్రాకారములలో నితరులు లేకుండగ జేసి పహరావాండ్రకు స్వాధీనపరచి పడికావలి తలుపులువేసి బయటికి వచ్చును.

ఈఏకాంతశేవలో శ్రీవారికి సమర్పణయిన చందనము మరుదినము దర్శనములో యాత్రికుల కిచ్చుటకు కొంతకల్పి పూసుకొనుటకు ఇయ్యబడును. కొంచె మర్చకులకుఁ జేరును. కొంతభాగము దేవస్థానము పొరుపత్యదార్ వద్దకు వెంబడి ధర్మార్ధము ఖర్చుపెట్టఁబడును. .

ఈప్రకారము ప్రతిదినము బీదసాదలయుపయోగార్థము ధర్మదర్శనములు, విశేషదర్శనములు త్రికాలములందును గలవు గాని గురువారము రాత్రిమొదలు శుక్రవారపు సాయంకాలమువరకు ధర్మదర్శనము లేదు.

గురువారము.

గురువారపు మధ్యాహ్నము మొదటిఘంటకు ధర్మదర్శనమయిన తఱువాత తిరువాభరణము మొదలగునవి తీసి ఒకధోవతి ఉత్తరీయముమాత్రము శ్రీవారి మేనియందుంచి నేత్రాచ్చాదనముగనున్న పచ్చకర్పూరపు తిరుమణికాపు సన్నగింపఁబడును. తఱువాత మామూలు ప్రకారముగ రెండవ ఘంటకాఁగానే తలుపులు వేయఁబడును. తిరుగ సాయంకాలము తలుపులు తీసి శుద్ధిజేసిన పదంపడి యమునోత్తరయనఁబడుఁ బూలయఱనుండి తోమాలలు మేళతాళములతో తెచ్చి పూలంగియనే రాత్రీయలంకారమునకు వస్త్రాభరణంబుల నలంకరించి యుండ తోమాలశేవ, అర్చనఘంటయు నను నివి యవును. దీనికే పూలంగిసేవయని పేరు. పారుపత్యదార్ ఖచేరిలోషరాబువద్ద టిక్కెట్ 1-కి ఒక రూపాయి చొప్పున చెల్లించి పూలంగిదర్శనము టిక్కెట్లుకొని టిక్కెట్టు 1-కి ఒక మనిషి వంతునలోపలికి వెళ్లవచ్చును. వెళ్లునపుడు బంగారువాకిలి వద్ద తనిఖీ చేయుచున్న పారుపత్యదార్ వద్ద టిక్కెట్ ఇచ్చి శ్రీవారి దర్శనమునకు వెళ్లవలెను. పూలంగిదర్శనము ధర్మదర్శనము గాదు, ఈదర్శనమయిన తఱువాత శుద్ధి, తీర్మానము అవును. పూలంగిశేవ చేయించినవారికి పూలంగిదర్శనమునకు టిక్కెట్ కొననవసరము లేకుండగ కొంతమందిని లెఖ్క ప్రకారము వదలెదరు.

శుక్ర వారము.

శుక్ర వారమురోజున ఉదయము తలుపులుతీసిన వెంటనే ధర్మ దర్శనము లేక ఫూలంగి విశ్వరూపదర్శనమనే రాత్రి పులంగిదర్సనమే యవును. 'రాత్రి వలేనే ఇప్పుడును ధర్మ దర్సనము గాదు. ఈదర్శనమయిన తఱువాత నీయలంకారము తీయ బడి తిరుగ మధ్యాహ్నపు ఘంట ఆయి అభిషేక సు ఆరంభ మగువరకు ఎవరికిని దర్శనము లేదు. మధ్యాహ్నపు ఘంట, శా త్తు మొర ఆయి సన్నిధిలోనబి పేకమునకు సిద్ధము చేసు కొని పొలుతీసుకొని వెళ్లిన తఱువాతఁ బరిమెళసఱలోనుండి పచ్చకర్పూరము, కుంఖుమపువ్వు, కస్తూరి, పునుఁగుదై లను శ్రీ జియ్యంగార్ల వారును, శ్రీవిచారణకర్తలవారును లోపలకు "మేళ తాళములతో విమాన ప్రదక్షణగ దీసుకొని వెళ్లి ఆభిషేకమునకు ఆరంభము చేయుచుండఁగ రూసాయి 1కి టీకెట్ వంతున పారుపత్యదార్ ఖచేరిలో షరాబువద్ధకొని టిక్కెట్ 1_కి ఒక మనిషి" చొప్పున యాత్రికులు శ్రీవారీ అభిషేకదర్శనమునకు వెళ్లివ లెను. ఈదర్శనమునకుఁ నడవకుఁ గొంతమంది వంతున వదులుటకు వీలు లేదు. టికెట్ కొనినవారభి షేకము ఆది మొడలు అంత్యమువరకు నుందురు. గనుక జనస్తోమతముగ నుండవచ్చును. యాత్రికులు ఆతురతవలన జనస్తోమను అంతగ లేక పోయినను ముందుకు వెళ్లి దర్సనముఁ జే సుకోనవలె ననెడి యభిలాషచేత సరిగా నిలువకపోవుటవలనఁ కొంత యిబ్బంది కలుగును. అట్లు కలుగకుండ ప్రవర్తించుట యాత్రికులకు సౌకర్యమే గాక దేవస్థానపు అధికారస్థులకును సుఖము అనేసంగతి తెలుసుకొనవలయును. ఈదర్శనమునకు మొదట అనఁగా నార్జిత సేవలలో వివరింపఁబోవు పుళికాపుసే సలకు సొమ్ము చెల్లించువారిని లెఖ్కప్రకారము టిక్కెట్లు వేరే కొన నవసరము లేకుండఁగ వదలేదరు.అభిషేకముచే యించు గృహస్థులకు ఒకగిన్నెలో నభిషేకాపరిళముంచి ఇచ్చి మేళ తాళముతో పరిమెళమును సన్నిధిలోనికి తీసుకొని వెళ్లునపుడు వీరిని తీసుకొనికూడ నెళ్లెదరు. దీనిని గురించి యార్జిత సేవలలో వివరముగఁ జెప్పఁబడినది.

అభిషేక కాలములలో యాత్రికుల సౌకర్యమునకు గాను వృద్దులు, పిల్లలు లోపలకు ఈ దర్శనమునకు పోవుట మంచిది గాదని దేవస్థానము విచారణకర్తలవారు నోటీసు ప్రచురించియు న్నారు. దానిని యాత్రికులు బాగుగగమనించవలెను.

శ్రీవారికిముందు పాలతోను, దఱువాతఁదీర్ధముతోను అభిషేకమయి నూరిన కేసరి సమర్పణయయినవెనుక తిరుగఁ దీర్థముతో నభిషేకమవును. పసపుతో వక్షస్థల లక్ష్మియగు అమ్మవారికి అభిషేకమవును. వెంటనే నీరుతిరుమణి సమర్పించి పచ్చ కర్పూరము హారతి అయి నవనీతము, తాంబూలము ఆరగింపు కాగా యాత్రికులు బయటికి రావలెను.హారతి చీట్లుగల యాత్రికులు హారతి చేయించి బయటికివచ్చెదరు. మఱికొందఱు శ్రీవారి అభిషేక మైన తఱువాత నలంకారమునకు హారతులవ లన నాటంకము సేయుట యపచార మని హారతు లప్పుడు చే యించక అలంకార మయినతఱువాత దర్శన కాలమున జే యించెదరు. పిమ్మటసన్నిధిలో శ్రీపాదరేణువ కలుపఁబడి కొంత భాగము వచ్చే శుక్రవారమువరకు వినియోగమునకు దేవ స్థానపు పారుపత్యదార్ వద్దకు వచ్చును. కొంత భాగము జియ్యంగార్లకుఁజేరును. స్వల్పముగ ఇతరకైంకర్యపరులలో కొందఱికి ఇయ్యఁబడును. పారుపత్యదార్ వద్దనున్నది. వచ్చేశుక్రవారము వరకు ఖర్చుపోను మిగిలినంతట గౌరవార్థము కొందఱు ఉద్యోగస్థులు మొదలగువారికి నియ్యఁబడును. శ్రీవారికి కేసరి సమర్పణమయిన వెంటనే యభిషేకతీర్థము క్రిందఁబడ కుండఁగఁ బట్టఁబడును. ఈఅభిషేకదీర్థము యాత్రికులు ఇంటికి తీసుకొనిపోవుటకు కోరినంతట పారుపత్యదార్ ఉచితముగనిప్పించును.

అభిషేకానంతరము పూర్తిగ నలంకారమయిన తఱువాత శ్రీవారి స్వర్ణ తాయార్ల వారికి నభి షేకమవును. ఇదిరహస్యము, ఇతరులు పోఁగూడదు. ఆఁడవాండ్రమాటఁజెప్ప నక్కఱలేదు. ఇదియయిన తఱువాత నిత్యము సొమ్ముఁచెల్లించి యాత్రికులు దర్శించుతోమాలసేవ, అర్చనయయి రెండవ ఘంట కాఁగా ధర్మదర్శన మవును. అనంతరము శుద్ధిరాత్రి తోమాల సేవ అర్చన ఘంట అయితీర్మానము మామూలు ప్రకారమవును.

N. B. విశేష వుత్సవాదులున్నంతట విశ్వరూపదర్శనమునకు గాని, రాత్రి ధర్మదర్శనమునకుగాని కొన్ని వేళల నవ కాళ ముండదు.