ఉభయసభలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు ప్రసంగము 2019-06-14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఉభయసభలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు ప్రసంగము 2019-06-14.pdf

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి

ప్రసంగం


శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్


జ్యేష్ఠ శుక్ల 12, 1941

14 జూన్, 2019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నరు గారి ప్రసంగం


మాన్యశ్రీ శాసనమండలి అధ్యక్షులు, మాన్యశ్రీ శాసన సభాపతి,

గౌరన శాసనమండలి సభ్యులు, గౌరవ శాసవసభ సభ్యులు,

అందరికీ నా శుభాభివందనములు.

ముందుగా, రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మీ అందరికీ నా శుభాకాంక్షలు. 2019 సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి నా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం.

సుస్థిరత, పారదర్శకత, అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో తమ ఓటు హక్కు వినియోగించి, ప్రజలందరికి సేవ చేసే అవకాశం మనకు కల్పించారు.

నూతన ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమయింది. వాటిలో కొన్ని రాష్ట్ర విభజన పర్యవసానంగా ఏర్పడినవి. మిగిలినవి విభజనానంతరం తలెత్తిన సవాళ్ళ అసంగతమైన నిర్వహణకు పర్యవసానాలుగా ఉన్నాయి. మానవ మరియు భౌతిక వనరుల రెండింటిని దుర్వినియోగపర్చడం రాష్ట్రం యొక్క దుస్థితిని మరింత తీవ్రతరం చేసింది. నా ప్రభుత్వానికి దాదాపు ఖాళీ ఖజానా సంక్రమించినందున ప్రజా ధనాన్ని మరియు అన్ని సహాయక వనరులను పూర్తి జవాబుదారీగా, సమర్ధవంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ, సమస్యలను అధిగమించి, రాష్ట్ర ప్రజానీకానికి సంతృప్తికరమైన ప్రజా సేవలు అందించేటట్లు చూడగలమని నా ప్రభుత్వం విశ్వసిస్తున్నది. ఆదాయ ఆర్జన, ఉపాధి అవకాశాలు కోల్పోవడం, ప్రధాన ఆరోగ్య మరియు విద్యా సంస్థలను మరియు సామాజిక మౌలిక సదుపాయాలను కోల్పోవడం కారణంగా జరిగిన నష్టాన్ని పూర్తిగా పూరించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ప్రజలకు చేసిన అన్ని వాగ్దానాలను నెరవేర్చడానికి నా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఆ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించడం ప్రోత్సాహకరంగా ఉంది. మార్పు కోసం - మెరుగైన మార్పు కోసం నిరాశ, నిస్పృహలతో ఎదురుచూస్తున్న ప్రజలలో ఆనందం మరియు సంతోష భావాన్ని కలిగించడం సముచితంగా ఉంటుంది.

నా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడానికి మరియు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి స్పష్టమైన దృక్పథాన్ని మరియు చర్య తీసుకోదగిన ప్రణాళికలను కలిగి ఉంది. ఈ ప్రభుత్వం వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించి దేశానికి ఆదర్శంగా నిలిచేందుకు కృషిచేస్తుంది. నా ప్రభుత్వం ఈ ప్రక్రియలో ద్విముఖ విధానాన్ని అనుసరిస్తుంది. అవినీతిని నిర్మూలించి సేవల బట్వాడా యంత్రాంగాన్ని ప్రజల ముంగిటకు తెచ్చేందుకు ప్రభావవంతమైన, సమర్థవంతమైన చర్యలు చేపడుతుంది. రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రక్రియలో వినూత్న చర్యలు చేరివున్నాయి. ఇవి ఇతర రాష్ట్రాలు అనుసరించేందుకు ఆదర్శప్రాయంగా ఉంటాయి.

మొదట, మునుపటి పాలనా నియమాలకు విరుద్ధంగా, నా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అగ్రస్థానంపై ఉంచుతుంది. ఈ దిశలో ప్రధాన చర్యగా నా ప్రభుత్వం ప్రప్రథమంగా రాష్ట్రంలో దర్యాప్తులను నిర్వహించేందుకు సిబిఐకి గత ప్రభుత్వం ఉపసంహరించిన సాధారణ సమ్మతిని పునరుద్ధరించింది.

రెండవది, నా ప్రభుత్వం పూర్తి పారదర్శకతను విశ్వసిస్తుంది. దీనిని కట్టుదిట్టం చేయడానికి, ఇప్పటివరకు వినని చర్యగా టెండర్లను ఇవ్వడానికి ముందే ప్రతి భారీ టెండరును పరిశీలించేందుకు జ్యుడిషియల్ కమీషన్ సహాయాన్ని నా ప్రభుత్వం నా ప్రభుత్వం సహించదు. ఏదైనా సమస్యను వారు ఎదుర్కొన్నట్లయితే, ఈ సేవకులపై ప్రజలు కాల్ సెంటరులో ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. నూటికి నూరు శాతం పారదర్శకత మరియు సంతృప్తి ఉండేలా చూడటానికి ఈ ప్రక్రియను సిఎంఓ నేరుగా పర్యవేక్షిస్తుంది. గ్రామ సచివాలయం ప్రజలకు పాలనను అందుబాటులోకి తీసుకొస్తుంది. పౌరుడి అభ్యర్ధనను 72 గంటలలో పరిష్కరిస్తుంది. ఇది 10 మంది విద్యావంతులైన యువతకు ఉపాధిని కల్పిస్తుంది.

ఎన్నికల ప్రణాళికను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా మరియు దానిని ఒక పవిత్ర పత్రంగా పరిగణించి, నా ప్రభుత్వం తనకు తాను బాధ్యత వహిస్తుంది. ఎటువంటి మార్పు లేకుండా దాని అమలుకు కట్టుబడి ఉంటుంది. ప్రతి ప్రభుత్వ శాఖ అన్ని వాగ్ధానాలను నెరవేర్చామని నిర్ధారించుకోవడానికి ఒక ప్రతిని ఉంచుకుంటుంది.

పేదలు, నిరుపేదలు, అభాగ్యులకు సహాయపడే మార్గాలను అన్వేషిస్తూ తప్పనిసరిగా కేంద్రీకృత పరిపాలన అంతటా దృష్టిసారించాలనేది మునుపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి భావజాలం ప్రస్తుత సందర్భంలో ప్రతి ఒక్కరు గ్రహిస్తారు. ఇది బహుశా ఏ సమయంలో ఉన్నదానికంటే ఇప్పుడు సంగతంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిది ఇతివృత్తాలతో కూడివున్న “నవరత్నాలు' అనే ఒక ఏకీకృత సంక్షేమ అజెండాను రూపొందిస్తున్నది. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంటు, వైఎస్ఆర్ పింఛన్లు, పేదలందరికీ గృహాలు, యువతకు ఉపాధి మరియు ఉద్యోగ కల్పన, వైఎస్ఆర్ ఆసరా - వైఎస్ఆర్ చేయూత దశల వారీగా మద్యనిషేధం, జలయజ్ఞం వంటివి ఇతివృత్తాలుగా ఉన్నాయి. ఇతివృత్తాలను శ్రేణీకరించి పటిష్టవంతమైన పురోగతితో కూడిన సమర్ధవంతమైన అమలు రాబోయే సంవత్సరాల్లో నా ప్రభుత్వానికి ప్రధాన అజెండాగా ఉంటుంది. తొమ్మిది సంక్షేమ ఇతివృత్తాలను కలిగివున్న ఈ పథకం జనాభాలోని భిన్న వర్గాలకు సమయానికి ప్రతి రైతు కుటుంబానికి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా సాలుకు రూ.12,500/-లను నా ప్రభుత్వం అందిస్తుంది. ఇది రైతులకు నేరుగా రూ.10000 కోట్లకు పైబడి నిధుల మొత్తం అందడానికి వీలుకల్పిస్తుంది. ఈ మొత్తంలో దాదాపు 5వ వంతు ఆర్ధిక సహాయం, ఓదార్పు కోసం చూస్తున్న భూయజమానులతోపాటు కౌలు రైతులకు అందుతుంది. సాగుదారులు మరియు భూయజమానుల ప్రయోజనాలు మరియు హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతుల ప్రయోజనాలను కాపాడాలని నా ప్రభుత్వం నిశ్చయించింది.

నా ప్రభుత్వం రైతులకు వడ్డీ రహిత రుణాలను మరియు ఉచిత బోరు బావులను కూడా సమకూర్చాలని ప్రతిపాదిస్తున్నది. రైతులు బోరు బావులను ఉచితంగా సమకూర్చుకోవడానికి వీలుగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క శాసనసభ నియోజకవర్గంలో ఒక రిగ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికను రూపొందించడమయింది. ప్రత్యేకంగా శ్రద్ద ఉంచాలని ప్రతిపాదించిన కొన్ని ఇతర రైతు - హిత పూర్వక కార్యక్రమాలలో పగలు 9 గంటల ఉచిత విద్యుత్తును అందించడం, ఆక్వా రైతులకు మద్దతు, రూ.3000 కోట్ల కార్పస్‌తో ధరల స్థిరీకరణ నిధిని, రూ.2000 కోట్ల కార్పస్‌తో ప్రకృతి విపత్తు సహాయ నిధిని నెలకొల్పడం మరియు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఆహార ప్రాసెసింగ్ యూనిటును ఏర్పాటు చేయడం వంటివి చేరివున్నాయి. సహకార డైరీలకు పాలు సరఫరా చేసే రైతులకు లీటరుకు రూ.4/-ల ప్రోత్సాహకాన్ని ఇవ్వడం ద్వారా సహకార రంగాన్ని, ప్రత్యేకించి పాడి పరిశ్రమ రంగాన్ని పునరుద్దరించడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దురవస్థలో ఉన్న రైతు కుటుంబానికి అండగా నిలబడేందుకు ఏదేని కారణంచేత రైతు మరణించిన సందర్భంలో వైఎస్ఆర్ బీమా పథకం క్రింద రూ.7.00 లక్షల మొత్తాన్ని సమకూర్చడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ఉపరితల మరియు భూగర్భ జలాల సమన్వయ వినియోగం, శాస్త్రీయ నీటి పరిరక్షణ ద్వారా నీటి వనరుల అభివృద్ధి, బిందు మరియు తుంపర సాగునీరు వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులను అనుసరించడం, నదుల అనుసంధానం మరియు నిర్ణీత రూపొందిస్తుంది. ఈ ప్రయత్నాలన్నీ పేదలకు వారి స్వంత ఖర్చులను తగ్గించడమే కాకుండా, శిశు మరణాల రేటు, మాతృసంబంధ మరణాల దామాషా, మహిళలలో రక్తహీనత, పోషకాహార లోపం వంటి వివిధ ఆరోగ్య ప్రమాణాలలో గణనీయమైన మార్పులను తీసుకువస్తాయి. రాష్ట్రంలోని శిశువులు, విద్యార్ధులు, గర్భిణీలు మరియు పాలిచ్చే మహిళల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు మధ్యాహ్న భోజనాలు వంటి పోషకాహార సంబంధిత పథకాలను సరైన స్పూర్తితో అమలుపరచడమవుతుంది. గ్రామ ఆరోగ్య కార్యకర్తలను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని దాదాపు 45,000 మంది ఆశా వర్కర్లకు నెలవారీ గౌరవ వేతనాన్ని రూ.3000/-ల నుండి రూ.10,000/- లకు పెంచడమయింది.

మద్యపాన వినియోగం అనేది దురవస్థకు దారితీసి, భారీస్థాయిలో కుటుంబాలను విచ్చిన్నం చేస్తుంది. ఈ బెడద యొక్క ప్రతికూల ప్రభావాన్ని గుర్తిస్తూ, దశలవారీగా మద్యాన్ని నిషేధించడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మొదటి చర్యగా, గొలుసు దుకాణాల మూసివేతకు నా ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల ఇది అనేకమంది హృదయాలలో సంతోషాన్ని తీసుకువస్తుందని ఆశించడమయింది.

నా ప్రభుత్వం, పాఠశాలకు వెళ్లే పిల్లలందరికీ విద్యను అందించేలా చూడటానికి కట్టుబడి ఉంది. తద్వారా, తన పిల్లల చదువు గురించి ఏ తల్లీ చింతించదు. గుర్తింపు మరియు ప్రోత్సాహక మొత్తంగా అమ్మ ఒడి పథకం క్రింద తన పిల్లలను పాఠశాలకు పంపుతున్నందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15000/- లను ఇచ్చేందుకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ చర్య పూర్తిగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే కాకుండా సార్వత్రిక విద్య ద్వారా విజ్ఞాన ఆర్థిక వ్యవస్థకు అవసరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు సెకండరీ స్థాయిలలో స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్) లో మెరుగుదలను తీసుకురావడానికి మరియు ఈ స్థాయిలన్నింటిలో డ్రాపౌట్ రేట్లను గణనీయంగా తగ్గించడానికి కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత స్థితి పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా ప్రోత్సహించడానికి నియామకాలన్నింటిలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని నా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, మత్స్యకారులు, నేతకారులకు ఆర్ధిక మద్దతును అందించడమవుతుంది.

కాపు వర్గం సంక్షేమానికి నా ప్రభుత్వం అంతే సమానంగా కట్టుబడి ఉంది. కాపుల కోసం ఐదు సంవత్సరాల కాలంలో రూ.10,000 కోట్లను ప్రత్యేకించడానికి ప్రణాళికలను కలిగివున్నాం. ఆర్యవైశ్యులు, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు మరియు అగ్ర వర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పట్ల తగినంత శ్రద్ధను చూపడమవుతుంది. జర్నలిస్టులు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూడా నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అధికారుల అవినీతి లేదా ఉదాసీనతను సహించకుండా ఉంటూ, యోగ్యమైన పరిశీలనలు మరియు గుర్తింపుపొందిన సూచనలను స్వీకరించడానికి నా ప్రభుత్వం సిద్దంగా ఉంది.

పదవీ స్వీకారం తరువాత, సామాజిక సంక్షేమ పింఛనును దశలవారీగా రూ.3000/- లకు పెంచుతామనే వాగ్దానాన్ని నెరవేరుస్తూ, నా ప్రభుత్వం మొదటి చర్యగా, వృద్దులకు వైఎస్ఆర్ భరోసా పింఛనును రూ.2250/-లకు పెంచింది మరియు సంవత్సరానికి రూ.250/-ల పెరుగుదలతో రానున్న 4 సంవత్సరాలలో మొత్తం పింఛను రూ.3000/-లకు చేరుకుంటుంది. పింఛను కోసం అరమయ్యే వ్యక్తి వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించాం. ఇది సుమారుగా మరో 5 లక్షల మందికి లబ్దిని చేకూరుస్తుంది.

కులం, జాతి, మతం మరియు రాజకీయ గుర్తింపులకు అతీతంగా రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఒక గృహాన్ని సమకూర్చడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రానున్న 5 సంవత్సరాలలో 25 లక్షల గృహాలను నిర్మించడానికి మేము నిబద్దత కలిగి ఉన్నాం . కోసం సంపదను సృష్టించాల్సిన ఆవశ్యకత ఉంది. సరైన దిశలో శిక్షణ పొందిన యువత మంచి ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఈ దీర్ఘకాలిక ప్రణాళికతో యువత సామర్థ్యాలను మరింత ఉత్పాదక విధానంలో వినియోగించాలని నా ప్రభుత్వం యోచిస్తున్నది. విద్యా విధానంలో ప్రమాణాలను మెరుగుపరచి, ఐటిఐలు మరియు పాలిటెక్నిక్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించేందుకు రాష్ట్రం కట్టుబడి ఉంది. సాంకేతిక విద్యా సంబంధ సంస్థలతో పరిశ్రమ అనుసంధానాన్ని నిర్ధారిస్తూ యువతను పరిశ్రమకు సంసిద్ధంగా ఉంచడమవుతుంది. దీనితో, తయారీ రంగంలో యువత కోసం ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు ప్రారంభిస్తుంది.

సరైన స్పూర్తితో నవరత్నాలను అమలు పరచడమే కాకుండా, నా ప్రభుత్వం పరిశ్రమ మరియు సేవా రంగాలను అభివృద్ధిపరచడంపై కూడా దృష్టిసారిస్తుంది. సముచిత ప్రమేయాలలో ప్రత్యేకంగా మహిళల భద్రత మరియు రక్షణ కోసం సాంకేతికతను అవలంబించడమవుతుంది. గ్రామీణ మరియు పట్టణ మౌలిక సదుపాయాలు సంపూర్ణంగా అందే విధంగా ప్రణాళికాబద్ధ విధానంలో చేపట్టడమవుతుంది. పట్టణ ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం ప్రత్యామ్నాయ ట్రాఫిక్ నమూనాలను అధ్యయనం చేయడమవుతుంది. సంప్రదాయేతర ఇంధనాన్ని ప్రోత్సహిస్తూ, సంప్రదాయ విద్యుత్తు విధానంలో టిడిడి నష్టాలను తగ్గించేందుకు ప్రాధాన్యత ఇవ్వడమవుతుంది.

ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా, గత పది రోజులలో నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం యొక్క నిజాయితీ, నిబద్ధతకు ప్రతీక అని తెలియజేయుటకు నేను సంతోషిస్తున్నాను. ఈ దిశగా ప్రత్యేకించి ఈ క్రింది నిర్ణయాలను పేర్కొనవలసిన అవసరమున్నది. • పింఛను మొత్తాన్ని రూ. 2250/- లకు పెంచడం. • ఆశా వర్కర్ల జీతాలను రూ.3000/- నుండి రూ. 10,000/-లకు పెంచడం. సుస్పష్టమైన ప్రజా తీర్పును దృష్టిలో ఉంచుకుని అయిదు కోట్ల ప్రజల ఆశయాలు, ఆకాంక్షల మేరకు, వారి కలలు సాకారం చేయడానికి నా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుంది.

ॐ सर्वे भवन्तु सुखिनः।
सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्रणि पश्यन्तु
मा कश्चिदुःखभाग्भवेत् ॥

అర్థం :

అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి. ఎవరూ బాధతో ఉండకూడదు. ఓం శాంతి, శాంతి, శాంతి,

*** జై హింద్ ***








ముద్రణ కమీషనర్ గారిచే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ముద్రణాలయం, అమరావతి నందు ముద్రించబడినది