Jump to content

సమాజమా? అదెక్కడవుంది?

వికీసోర్స్ నుండి

సమాజమా? అదెక్కడవుంది?

రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి


అది ఒక సంధ్యా సమయం జంటలుగా విహారానికి వచ్చే పార్కులో

ఒక చోట పచ్చగడ్డిపైన నిమీళితనేత్రాలతో వెల్లకితలా పడుకున్న కవి

స్వామీ ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? కళ్ళుతెరిచిన కవి చిరునవ్వు నవ్వాడు

కమ్మ తెమ్మర స్పర్సతో కల్గుచుండె మధురభావాలు హేలగా మనసునందు

వచన కవితలో జొప్పించి వ్రాయ నెంచి వూహలందును విహరించ బోయినాను

ఆహా ప్రకృతి ఎంత సుందరంగా వుంది గ్రీష్మ భాను తాపనివారణకా అన్నట్టు

నీలి గగనాన గుంపులు కూడిన మేఘాలు ఆ మేఘాల చాటున భువిని

ముద్దాడబోతున్న తుషార బిందువులు వాటికాహ్వానం పలికే నెమళ్ళ

నర్తనలు మలయమారుత స్పర్సతో పులకించి టప టప రాలే వానచినుకులలో

తపతపమని గంతులువేసే పిల్లలు పచ్చని చెట్ల ఆకులచివర్లనుంచి జాలువారుతున్న

వాన చినుకులను గవాక్ష వీక్షణలతో మురిసే ముగ్ధ కన్నియలు ఆ చల్లని

వాతావరణంలో నాప్రియురాలి పరిష్వంగసుఖానుభూతిని వర్ణిస్తా నేను భావుకుణ్ణి.

సొందర్యోపాసకుణ్ణి ఈ ప్రకృతిలోని అణువణువూ పులకింతలిచ్చే మనోహర దృశ్యాలని నా కవితలొ జొప్పిస్తా!!


అయితే స్వామీ! సమాజం గురించి ఏమీ వ్రాయారా?

సమాజామా? అదెక్కడ వుంది ??