శ్రీ గీతామృత తరంగిణి/క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
| ←భక్తి యోగము | శ్రీ గీతామృత తరంగిణి రచించినవారు క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము |
గుణత్రయవిభాగ యోగము→ |
| శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) | శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952) |
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979) |
|---|---|---|
|
అనుష్టుప్ . |
అర్జునుడు చెప్పెను .
ఓ కృష్ణా ! ప్రకృతిని , పురుషుని క్షేత్రమును , క్షేత్రజ్ఞుని , జ్ఞానమును , జ్ఞేయమును వీనినన్నిటినిగూర్చి నేను తెలిసికొనగోరుచున్నాను . |
|
|
శ్రీభగవానువాచ| |
కందము. |
శ్రీ భగవానుడు చెప్పెను .
కుంతీపుత్రుడవగు ఓ అర్జునా ! ఈ శరీరమే క్షేత్రమనబడుచున్నది . దానిని తెలిసికొనువాడు క్షేత్రజ్ఞుడని క్షేత్ర క్షేత్రజ్ఞుల నెఱిగినవారు చెప్పుదురు . |
|
అ. |
కందము. |
అర్జునా ! సమస్త క్షేత్రములందును ( శరీరములందును ) నన్ను క్షేత్రజ్ఞునిగగూడ నెఱుఁగుము . క్షేత్ర క్షేత్రజ్ఞులనిగూర్చిన జ్ఞానమేదికలదో , అదియే వాస్తవమగు జ్ఞానమని నా అభిప్రాయము . |
|
అ. |
కందము. |
ఆ క్షేత్రమేదియో , ఎటువంటిదో , ఎట్టి వికారములు కలదో , దేనినుండి యేరీతిగ నుత్పన్నమైనదో , ఆ క్షేత్రజ్ఞుడును ఎవడో , ఎట్టి ప్రభావము కలవాడో ఆ విషయములన్నింటిని సంక్షేపముగ నావలన వినుము . |
|
అ. |
కందము. |
( ఆ క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానము ) ఋషులచే అనేక ప్రకారములుగా నానా విధములైన వేదములద్వారా వేఱు వేఱుగా ప్రతిపాదించబడినది మఱియు హేతువులతో ( యుక్తులతో ) గూడి బాగుగా నిశ్చయింపబడినట్టి బ్రహ్మసూత్రవాక్యములచేత గూడ నయ్యది చెప్పబడియున్నది . |
|
అ. |
తేటగీతి. |
పంచమహా భూతములు , అహంకారము , బుద్ధి , మూలప్రకృతి , పదునొకండు ఇంద్రియములు ( దశేంద్రియములు +మనస్సు ) , ఐదు ఇంద్రియ. విషయములు ( శబ్ద స్పర్శాదులు ) , కోరిక , ద్వేషము , సుఖము , దుఃఖము , దేహేంద్రియాదుల సముదాయము , తెలివి ( వృత్తి జ్ఞానము ) , ధైర్యము , అను వీని సముదాయమై , వికార సహితమైనట్టి క్షేత్రము సంక్షేపముగా చెప్పబడినది . |
|
అ. |
తేటగీతి. |
తన్ను తాను పొగడుకొనకుండుట , డంబము లేకుండుట , మనోవాక్కాయములచే పరప్రాణులను బాధింపకుండుట , ఓర్పుగలిగియుండుట , ఋజుత్వము ( శుద్ధి ) గలిగియుండుట ( సన్మార్గమున , మోక్షమార్గమున ) స్థిరముగా నిలబడుట , మనస్సును బాగుగ నిగ్రహించుట , ఇంద్రియవిషయములను శబ్దస్పర్శాదులందు విరక్తి గలిగి యుండుట , అహంకారము లేకుండుట , పుట్టుక , చావు , ముసలితనము , రోగము - అను వానివలన కలుగు దుఃఖమును , దోషమును , మాటిమాటికి స్మరించుట , కొడుకులు ( సంతానము ) , భార్య , యిల్లు మున్నగువానియందు ఆశక్తి లేకుండుట మఱియు వానియందు తగులము లేకుండుట ( వారికి కలుగు సుఖదుఃఖములు తనకే కలిగినట్లు అభిమానింపకుండుట ) , ఇష్టానిష్టములు ( శుభాశుభములు ) సంప్రాప్తించినపుడెల్లపుడును సమబుద్ధి గలిగియుండుట ,నాయందు ( భగవంతునియందు ) అనన్యమైన ( నిశ్చల ) భక్తి గలిగియుండుట , ఏకాంతప్రదేశమును ( ప్రతిబంధమును లేనిచోటును ) ఆశ్రయించుట , జనసమూహమునందు ప్రీతిలేకుండుట , అధ్యాత్మజ్ఞానము ( ఆత్మనిష్ఠ ) నిరంతరము గలిగియుండుట , తత్వజ్ఞానముయొక్క గొప్పప్రయోజనమును తెలిసికొనుట అను నిదియంతయు జ్ఞానమని చెప్పబడును . దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానము ( అని తెలియునది ) . |
|
అ. |
కందము. |
ఏది తెలియదగిన బ్రహ్మస్వరూపమో , దేనిని తెలిసికొని మనుజుడు అమృతస్వరూపమగు మోక్షమును పొందుచున్నాడో అద్దానిని బాగుగ చెప్పబోవుచున్నాను . అదిలేనట్టి పరబ్రహ్మమనబడు అయ్యది సత్తనిగాని ( ఉన్నదని గాని ) అసత్తని గాని ( లేదని గాని ) చెప్పబడదు . |
|
అ. |
కందము. |
అది ( ఆ బ్రహ్మము , ఆత్మ ) అంతటను చేతులు , కాళ్ళు గలదియు , అంతటను కన్నులు , తలలు , ముఖములు గలదియు , అంతటను చెవులు గలదియు నయి ప్రపంచమునందు సమస్తమును ఆవరించి ( వ్యాపించుకొని ) యున్నది . |
|
అ. |
ఆట వెలది . |
( జ్ఞేయస్వరూపమగు ) ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియములయొక్క గుణములను ప్రకాశింపజేయునదియు , సమస్తేంద్రియములు లేనిదియు , దేనిని అంటనిదియు , సమస్తమును భరించునదియు , ( సత్త్వరజస్తమో ) గుణరహితమైనదియు , గుణముల ననుభవించునదియు , ప్రాణులయొక్క వెలుపలను , లోపలను ఉండునదియు , కదలనిదియు , కదలునదియు , అతిసూక్ష్మమై యుండుటవలన ( అజ్ఞానులకు ) తెలియఁబడనిదియు , దూరముగనుండునదియు , దగ్గరగా కూడ నుండునదియు , విభజింపబడనిదియైనను , ప్రాణులందు విభజింపబడినదానివలె నున్నదియు , ప్రాణులను సృష్టించునదియు , పోషించునదియు , లయింప జేయునదియు అని తెలిసికొనదగినది . మఱియు నది ప్రకాశించెడు సూర్యచంద్రాగ్న్యాది పదార్థములకు గూడ ప్రకాశము నిచ్చునదియు , తమస్సు ( అజ్ఞానము ) కంటె వేఱైనదియు ( లేక అతీతమైనదియు ) జ్ఞానస్వరూపమైనదియు ( చిన్మయ రూపమును ) , తెలియదగినదియు , ( అమానిత్వాది ) జ్ఞానగుణములచే బొందదగినదియు , సమస్త ప్రాణులయొక్క హృదయమునందు విశేషించి యున్నదియు నని చెప్పబడుచున్నది . |
|
అ. |
తేటగీతి. |
ఈ ప్రకారము క్షేత్రము , అట్లే జ్ఞానము , జ్ఞేయముకూడ సంక్షేపముగ చెప్పబడినవి . నా భక్తుడు ( నా యందు భక్తిగలవాడు ) వీనినెఱింగి నాస్వరూపమును ( మోక్షమును భగవద్వైక్యమును ) బొందుట కర్హుడగుచున్నాడు . |
|
అ. |
తేటగీతి. |
( ఓ అర్జునా ! ) ప్రకృతిని , పురుషుని ఉభయులను ఆదిలేనివారినిగ నెఱుఁగుము . ( మనోబుద్ధీంద్రియాదుల ) వికారములను , ( సత్త్వరజోస్తమో ) గుణములను ప్రకృతివలన గలిగినవిగా నెఱుఁగుము . |
|
అ. |
తేటగీతి. |
కార్యకారణములను గలుగజేయుటయందు ప్రకృతి హేతువనియు , సుఖదుఃఖముల ననుభవించుటయందు పురుషుడే హేతువనియు చెప్పబడుచున్నది . |
|
అ. |
కందము. |
ప్రకృతియందున్నవాడై పురుషుడు ( జీవుడు ) ప్రకృతివలన బుట్టిన ( సుఖదుఃఖాది ) గుణములను అనుభవించుచున్నాడు . ఆయా గుణములతోడి కూడికయే ఈ జీవునకు ఉత్తమ నికృష్టజన్మము లెత్తుటయందు హేతువై యున్నది . |
|
అ. |
కందము. |
పురుషుడు ( ఆత్మ ) ఈ శరీరమందున్నప్పటికి శరీరముకంటె వేఱైనవాడును , సాక్షిభూతుడును , అనుమతించువాడును , భరించువాడును , అనుభవించువాడును , పరమేశ్వరుడును ( గొప్ప ప్రభువు , నియామకుడును ) , పరమాత్మయు అని చెప్పబడుచున్నాడు . |
|
అ. |
తేటగీతి. |
ఎవడీ ప్రకారముగ పురుషుని ( ఆత్మను ) , గుణములతో గూడిన ప్రకృతిని తెలిసికొనుచున్నాడో , అతఁ డేవిధముగ నున్నప్పటికిని మఱల జన్మింపడు . |
|
అ. |
తేటగీతి. |
ఆత్మను ( ప్రత్యగాత్మను లేక పరమాత్మను ) కొందఱు శుద్ధమగు మనస్సుచే ధ్యానయోగముద్వారా తనయందు గాంచుచున్నారు ( సాక్షాత్కరించుకొనుచున్నారు ) . అట్లే మఱికొందఱు సాంఖ్యయోగము చేతను , ఇంక కొందఱు కర్మయోగము చేతను చూచుచున్నారు ( అనుభూతమొనర్చుకొనుచున్నారు ) . |
|
అ. |
కందము. |
మఱికొందఱైతే ఈ ప్రకారముగ ( ధ్యానసాంఖ్యకర్మయోగము వలన ) తెలిసికొనజాలని వారై ఇతరులవలన ( ఆ పరమాత్మను గూర్చి ) విని ఉపాసించుచున్నారు ( అనుష్ఠించుచున్నారు ) . శ్రవణతత్పరులగు వారున్ను మృత్యువును ( మృత్యురూపమగు ఈ సంసారమును ) తప్పక దాటుదురు . |
|
అ. |
తేటగీతి. |
భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఈ ప్రపంచమున స్థావరజంగమాత్మకమగు పదార్థమేది ఉన్నదో , అదియంతయు క్షేత్ర క్షేత్రజ్ఞుల కూడికవలననే కలుగుచున్నదని యెఱుఁగుము . |
|
అ. |
తేటగీతి. |
సమస్త ప్రాణులందును సమముగ నున్నట్టి పరమాత్మను , ఆయా ప్రాణుల దేహాదులు నశించినను నశించినవానినిగ ఎవడు చూచుచున్నాడో , ( తెలిసికొనుచున్నాడో ) ఆతడే నిజముగ చూచువాడగును ( విజ్ఞుడని భావము ) . |
|
అ. |
చంపకమాల . |
ఏలయనగా - సమస్తప్రాణులందును లెస్సగ వెలయుచున్నట్టి పరమాత్మను సమముగ వ్యాపించియున్నట్లు జూచుచు మనుజుడు తన ఆత్మను తాను హింసించికొనడు . కావున సర్వోత్తమగతిని ( మోక్షమును ) బొందుచున్నాడు . |
|
అ. |
చంపకమాల. |
ఎవడు కర్మములను ప్రకృతిచేతనే సర్వవిధముల చేయబడుచున్నట్లుగను , అట్లే కర్తకానివానిగను చూచుచున్నాడో ( తెలిసికొనుచున్నాడో ) ఆతడే నిజముగ చూచుచున్నవాడగును . |
|
అ. |
చంపకమాల . |
ఎప్పుడు వేఱ్వేఱుగనున్న ఈ భూతప్రపంచమంతను ఒక్కదానియందు ( పరమాత్మయందు ) ఉన్నదానిగను , మఱియు దానినుండియే విస్తరించుచున్నదానినిగను వీక్షించునో , అపుడు ( మనుజుడు ) ూ్రహ్మమును పొందుచున్నాడు . ( లేక బ్రహ్మముగనే అగుచున్నాడు ) . |
|
అ. |
తేటగీతి . |
ఓ అర్జునా ! ఆదిలేనివాడు ( కారణరహితుడు ) అగుటచేతను ( త్రి ) గుణరహితుడగుట వలనను , ఈ పరమాత్మ శరీరమందున్నప్పటికిని ఏమియు చెయకయు , దేనిచేతను అంటబడకయు నున్నాడు . |
|
అ. |
కందము . |
సర్వత్ర వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుటవలన ఏప్రకారముగ ( ధూళిమున్నగువానిచే ) అంటబడదో , ఆప్రకారమే శరీరమందంతటను ( లేక ; సకలశరీరములందును ) వెలయుచున్న పరమాత్మ ( శరీర గుణదోషములచే ) అంటబడక యున్నాడు . |
|
అ. |
కందము . |
ఓ అర్జునా ! సూర్యు డొక్కడే ఈ సమస్త లోకమును ఎట్లు ప్రకాశింప జేయుచున్నాడో , అట్లే పరమాత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింప జేయుచున్నాడు . |
|
అ. |
తేటగీతి . |
ఎవరు జ్ఞానదృష్టిచేత ఈ ప్రకారముగ క్షేత్ర క్షేత్రజ్ఞులయొక్క భేదమును , భూతములకు సంబంధించియుండు ( లేక , కారణమైన ) ప్రకృతి ( అవిద్య ) నుండి విముక్తిని కలుగజేయు ఉపాయమును తెలిసికొందురో వారు పరమాత్మపదమును ( మోక్షమును ) బొందుదురు . |
|
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు |
ఓం తత్ సత్ |
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు ,
యోగశాస్త్రమును , శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమను పదుమూడవ అధ్యాయము సంపూర్ణము. |
| శ్రీ గీతామృత తరంగిణి | |
|---|---|
| అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము | |