శ్రీ గీతామృత తరంగిణి/కర్మసన్యాస యోగము
| ←జ్ఞాన యోగము | శ్రీ గీతామృత తరంగిణి రచించినవారు కర్మసన్యాస యోగము |
ఆత్మసంయమ యోగము→ |
| శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) | శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952) |
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979) |
|---|---|---|
|
అర్జున ఉవాచ| |
అర్జును వాక్యము. |
అర్జునుడు పలికెను
ఓ కృష్ణమూర్తీ ! నీవొకప్పుడు కర్మలయొక్క త్యాగమును ( కర్మ త్యాగ పూర్వకమగు జ్ఞానమును ) , మఱియొకప్పుడు కర్మయోగమును ప్రశంసించుచున్నావు . కావున ఈ రెండిటిలో నేది శ్రేష్ఠమైనదో బాగుగ నిశ్చయించి ఆ ఒక్కదానిని నాకు చెప్పుము . |
|
శ్రీభగవానువాచ| |
శ్రీ భగవానుల వాక్యము. |
కర్మత్యాగము ( కర్మత్యాగ పూర్వకమగు జ్ఞానయోగము ) , కర్మయోగము అను రెండును మోక్షమును గలుగజేయును . అయితే , ఆ రెండిటిలోను ( ప్రారంభమున ) కర్మత్యాగమున కంటె కర్మయోగమే శ్రేష్ఠమైనది . |
|
అ. |
తేటగీతి. |
గొప్ప బాహువులు కల ఓ అర్జునా ! ఎవడు ( ఏ కర్మయోగి ) దేనినిగూడ ద్వేషింపడో , దేనినిగూడ కోరడో అట్టివాడు ఎల్లప్పుడును సన్న్యాసి ( త్యాగి ) యేయని తెలియదగినది. ఏలయనగా ( రాగద్వేషాది ) ద్వంద్వములు లేనివాడు సులభముగ సంసారబంధమునుండి విముక్తుడు కాగలడు. |
|
అ. |
ఆటవెలది. |
( కర్మసన్న్యాసపూర్వకమగు ) జ్ఞానయోగము , కర్మయోగము వేఱు వేఱని ( వేఱు వేఱు ఫలములు కలవని ) అవివేకులు పలుకుదురే కాని వివేకవంతులు కాదు. ఆ రెండిటిలో ఏ ఒక్కదానినైనను బాగుగ అనుష్ఠించినచో రెండిటి యొక్క ఫలమును ( మోక్షమును ) మనుజుడు పొందుచున్నాడు. |
|
అ. |
తేటగీతి. |
జ్ఞానయోగులచే ఏ స్థానము ( మోక్షము ) పొందబడుచున్నదో, అది కర్మయోగులచేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును, కర్మయోగమును ఒక్కటిగ ( ఒకే ఫలము గలుగజేయునదిగ ) చూచువాడే నిజముగ చూచువాడగును.( తెలిసిన వాడగును ). |
|
అ. |
తేటగీతి. |
గొప్పబాహువులుకల ఓ అర్జునా ! ( కర్మ సన్న్యాస రూపమగు ) జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండ పొందుటకు కష్టతరమైనది . కర్మయోగముతో గూడిన ( దైవ ) మననశీలుడు శీఘ్రముగ ( లక్ష్యమగు ) బ్రహ్మమును పొందుచున్నాడు. |
|
అ. |
కందము. |
( నిష్కామ ) కర్మయోగము నాచరించువాడును, పరిశుద్ధమైన హృదయము గలవాడును, లెస్సగ జయింపబడిన మనస్సు గలవాడును, ఇంద్రియములను జయించినవాడును, సమస్త ప్రాణులయందుండు ఆత్మయు, తన ఆత్మయు నొకటేయని తెలిసికొనినవాడు నగు మనుజుడు కర్మలను జేసినను వానిచే నంటబడడు. |
|
అ. |
ఉత్పలమాల. |
పరమార్థతత్త్వము నెఱిఁగిన యోగయుక్తుడు ( ఆత్మయందు నెలకొనిన చిత్తముగలవాడు ) చూచుచున్నను, తాకుచున్నను, వాసన జూచుచున్నను, తినుచున్నను, నడచుచున్నను, నిదురించుచున్నను, ఊపిరివిడుచుచున్నను, మాట్లాడుచున్నను, విడుచుచున్నను, గ్రహించుచున్నను, కండ్లను తెఱచుచున్నను, మూయుచున్నను, ఇంద్రియములు ( వాని వాని ) విషయములందు ప్రవర్తించుచున్నవని నిశ్చయించినవాడై నే నొకింతయైన ఏమియు చేయుటలేదు - అనియే తలంచును ( ఆ యా కార్యములందు కర్తృత్వబుద్ధి లేకుండును ). |
|
అ. |
కందము. |
ఎవడు తాను జేయు కర్మలను పరమాత్మ కర్పించి సంగమును ( ఆసక్తిని ) విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచే అంటబడనట్లు, పాపముచే నంటబడకుండును. |
|
అ. |
కందము. |
( నిష్కామ కర్మ ) యోగులు చిత్తశుద్ధికొఱకై ఫలాసక్తిని విడిచి శరీరము చేతను, మనస్సు చేతను, బుద్ధి చేతను, అభిమానములేని వట్టి ఇంద్రియముల చేతను కర్మలను జేయుచున్నారు. |
|
అ. |
చంపకమాల. |
యోగయుక్తుడు ( నిష్కామ కర్మయోగి ) కర్మలయొక్క ఫలమును విడిచిపెట్టి ( చిత్తశుద్ధి వలన ) ఆత్మనిష్ఠాసంబంధమైన శాశ్వతమగు శాంతిని బొందుచున్నాడు. యోగయుక్తుడు కానివాడు ( ఫలాపేక్షతో కర్మలను జేయువాడు ) ఆశచే ప్రేరితుడై కర్మఫలమందాసక్తిగల్గి బద్ధుడగుచున్నాడు |
|
అ. |
తేటగీతి. |
ఇంద్రియనిగ్రహముగల దేహధారి మనస్సుచే సమస్త కర్మలను ( కర్మ ఫలములను ) పరిత్యజించి, ఏమియు చేయనివాడై, చేయింపనివాడై, తొమ్మిది ద్వారములుగల పట్టణమగు శరీరమందు హాయిగా నుండుచున్నాడు. |
|
అ. |
తేటగీతి. |
భగవంతుడు ( ఆత్మ ) జీవులకు కర్తృత్వమునుగాని, కర్మములనుగాని, కర్మఫలములతోటి సంబంధముగాని కలుగజేయుటలేదు . మఱేమనిన, ప్రకృతియే ( ప్రకృతిసంబంధమువలన గలిగిన జన్మాంతర సంస్కారమే ) ఆయా కర్తృత్వాదులను గలుగ జేయుచున్నది . |
|
అ. |
ఉత్పలమాల. |
పరమాత్మ యెవనియొక్కయు పాపమునుగాని, పుణ్యమునుగాని స్వీకరింపడు . అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడియున్నది. అందుచేత జీవులు భ్రమనొందుచున్నారు. ఆత్మజ్ఞానముచే యెవరియొక్క అజ్ఞానము నశింపజేయబడినదో , అట్టివారి జ్ఞానము సూర్యునివలె ఆ పరబ్రహ్మస్వరూపమును ప్రకాశింపజేయుచున్నది (స్వస్వరూపానుభవమును గలుగ జేయుచున్నది ) . |
|
అ. |
కందము. |
ఆ పరమాత్మయందే బుద్ధిగలవారును, ఆపరమాత్మయందే మనస్సును నెలకొల్పినవారును, ఆ పరమాత్మయందే నిష్ఠగలవారును , ఆ పరమాత్మనే పరమగతిగ నెంచువారును జ్ఞానముచే నెగురగొట్టబడిన పాపముగలవారై పునరావృత్తిరహితమగు (పునర్జన్మవర్జితమగు ) శాశ్వత మోక్షపదవిని బొందుచున్నారు . |
|
అ. |
ఉత్పలమాల. |
విద్య, వినయము కలిగియున్న బ్రాహ్మణునియందును , గోవునందును , ఏనుగునందును , కుక్కయందును , కుక్కమాంసము వండుకొని తిను చండాలునియందును సమదృష్టిగలవారే ( వారిని సమముగ జూచువారే ) జ్ఞానులు ( ఆత్మానుభవముగలవారు ) అని చెప్పబడుదురు . |
|
అ. |
కందము. |
ఎవరియొక్క మనస్సు సమభావమందు ( నిశ్చల సమస్థితియందు, లేక సర్మప్రాణులందును ఆత్మను సమముగ జూచుటలో ) స్థిరముగనున్నదో, అట్టివారీజన్మమునందే జననమరణరూప సంసారమును జయించినవారగుదురు . ఏలయనిన, బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కావున ( సమత్వమందు స్థితిగల ) వారు బ్రహ్మమునందున్నవారే యగుదురు . |
|
అ. |
చంపకమాల. |
స్థిరమగుబుద్ధిగలవాడును, మోహరహితుడును, బ్రహ్మమందు నిలుకడ కలవాడునగు బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినపుడు సంతోషమునుగాని, అనిష్టమైనదానిని పొందినపుడు దుఃఖమునుగాని పొందకుండును . |
|
అ. |
తేటగీతి. |
బాహ్యమునగల శబ్దాది విషయములం దాసక్తి లేనివాడు ఆత్మయందెట్టి ( నిరతిశయ ) సుఖము కలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు . అతడు బ్రహ్మనిష్ఠయను సమాధితో గూడుకొనినవాడై ( బ్రహ్మానుసంధానపరుడై ) అక్షయమగు సుఖమును బడయుచున్నాడు . |
|
అ. |
కందము. |
అర్జునా ! ( ఇంద్రియ ) విషయసంయోగమువలన కలుగు భోగములు దుఃఖహేతువులును, అల్పకాలముండునవియు, నయియున్నవి. కావున విజ్ఞుడగువాడు వానియందు క్రీడింపడు ( ఆసక్తి గొనడు ). |
|
అ. |
కందము. |
ఎవ డీశరీరమును విడుచుటకు పూర్వమే యిచ్చోటనే ( ఈజన్మయందే ) కామక్రోధముల వేగమును అరికట్టగలుగుచున్నాడో, అతడే యోగియు ( చిత్తోపరతి కలవాడును ) , సుఖవంతుడు నగును . |
|
అ. |
ఆటవెలది. |
ఎవడు లోన ఆత్మయందే సుఖించుచు, ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశము గలవాడై యుండునో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మసాక్షాత్కారమును ( మోక్షమును ) బొందును |
|
అ. |
కందము. |
పాప రహితులును, సంశయవర్జితులును, ఇంద్రియమనంబులను స్వాధీనపఱచుకొనినవారును, సమస్త ప్రాణులయొక్క క్షేమమందాసక్తిగలవారునగు ఋషులు ( అతీంద్రియ జ్ఞానులు ) బ్రహ్మసాక్షాత్కారమును (మోక్షమును ) బొందుచున్నారు . |
|
అ. |
తేటగీతి. |
కామక్రోధాదులు లేనివారును, మనోనిగ్రహము గలవారును, ఆత్మతత్త్వము నెఱిగినవారునగు యత్నశీలురకు బ్రహ్మసాయుజ్యము ( మోక్షము, బ్రహ్మానందము ) అంతటను ( శరీరమున్నప్పుడును, లేనపుడును సర్వత్ర ) వెలయుచునే యున్నది . ఎవడు వెలుపలనున్న శబ్దస్పర్శాది విషయములను వెలుపలికే నెట్టివైచి ( లోన ప్రవేశింపనీయక ), చూపును భ్రూమధ్యమందు నిలిపి, నాసికాపుటములందు సంచరించు ప్రాణాపానవాయువులను సమముగ జేసి, ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛా భయ క్రోధములు లేనివాడై, మోక్షాసక్తుడై ( ఆత్మ ) మననశీలుడై యుండునో అట్టివా డెల్లప్పుడును ముక్తుడే యగును . |
|
అ. |
ఉత్పలమాల. |
యజ్ఞములయొక్కయు, తపస్సులయొక్కయు భోక్త ( ఫలములనుభవించువాడు ) గను , సమస్తలోకములయొక్క ఈశ్వరుడు ( ప్రభువు, శాసకుడు )గను, సమస్తప్రాణులయొక్క హితకారిగను, నన్నెఱిఁగి మనుజుడు శాంతిని బొందుచున్నాడు . |
|
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు |
ఓం తత్ సత్. |
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును, బ్రహ్మవిద్యయు,
యోగశాస్త్రమును, శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు కర్మసన్న్యాసయోగమను ఐదవ అధ్యాయము. ఓమ్ తత్ సత్. |