మనసు గతి ఇంతే
స్వరూపం
ఈ పాట ఆచార్య ఆత్రేయ రచన:
సాకీ:
తాగితే మరచిపోగలను - తాగనివ్వదు
మరచిపోతే తాగగలను - మరువనివ్వదు
ఉహ్.హ్.హ్.హ్.
పల్లవి:
మనసు గతి ఇంతే - మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే
చరణం:
ఒకరికిస్తే మరలిరాదు - ఓడిపోతే మరచిపోదు (మళ్ళీ)
గాయమైతే మాసిపోదు - పగిలిపోతే అతుకు పడదు
మనసు గతి ఇంతే - మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే
చరణం:
అంతా మట్టేనని తెలుసు - అదీ ఒక మాయేనని తెలుసు (మళ్ళీ)
తెలిసీ వలచీ విలపించుటలో.. హ..హ్హ..హ్హ...(నవ్వు)
తీయదనం ఎవరికి తెలుసు..
మనసు గతి ఇంతే - మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే
చరణం:
మరుజన్మ ఉన్నదోలేదో - ఈ మమతలప్పుడేమౌతాయో (మళ్ళీ)
మనిషికి మనసే తీరని శిక్షా.. హ.హ్హ..హ్హ..హ్హ (నవ్వు)
దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా..
మనసు గతి ఇంతే - మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే..(దగ్గు)