పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాని పైకీర్తన వ్రాసిన భక్తుడు మాత్రం ఈ మామూలు కోరిక లేవీ కోరుకోలేదు. అతడు జీవితమంతా ప్రభుమందిరంలో గడపాలనుకొన్నాడు. ఎందుకు? ప్రభువుని సేవించి అతని మంచితనాన్ని అనుభవపూర్వకంగా తెలిసికోవాలనుకొన్నాడు. ప్రభువు సలహాపొంది అతని జీవిత సమస్యలను ప్రభువును ప్రియపడేలా తీర్చిదిద్దుకోవా లనుకొన్నాడు. ఈ భక్తునికి కావలసింది ఐహిక సంపదలూ కాదు, భగవంతుని వరాలూ కాదు, మరి ఆ భగవంతుడే. భక్తుడంటే ఈలాంటివాడు కదా!

25. దేవుడు మీ శక్తికి మించినట్లుగా మిమ్ము శోధింపడు- 1 కొ 10,13.

జీవితంలో అందరికీ శోధనలు వస్తుంటాయి, కాని ఈ శోధనలు మన శక్తికి మించి వుండవు. వాటిని జయించే శక్తిని దేవుడు తప్పకుండా ఇస్తుంటాడు. లేకపోతే అతడు మోయలేని బరువును మన తలమీద మోపినట్లు కదా! శోధనలను మనంతట మనమే జయించలేంగాని, దేవుని శక్తితో జయించగలం. అందుచేత ఆ ప్రభువు వరప్రసాదాన్నిఅడుగుకొంటూండాలి. బలహీనప తీగ బలమైన చెట్టుమీదికి అల్లకొంటుంది. అ చెట్టబలంలో తానూ పాలు పొందుతుంది. ఆలాగే మనంకూడ స్వయంగా దుర్భలులమైనాకూడా క్రీస్తు బలంపొంది బలవంతుల మౌతాం. ఓమారు పౌలు తన బాధ నొకదాన్ని తొలగించమని ప్రభువుని మనవి చేసాడు. ప్రభువు పౌలుతో నీ బాధను తొలగించనుగాని, దాన్ని భరించే వరప్రసాదం మాత్రం ఇస్తాను పొమ్మన్నాడు – 2 కొ 12,10. మన శోధనల విషయంకూడ ఇంతే.

26. నీ వెక్కడికి వెళ్ళినా నేను నిన్ను కాపాడుతూనే వుంటాను.

- అది 28,15.

యాకోబు తన అన్నయైన యేసావువద్ద నుండి పారిపోతూ రాత్రిలో బేతేలు వద్ద నిద్రిస్తుండగా కలలో ప్రభువు పల్మిన వాక్యమిది. ప్రభువు అతన్ని ఏసావు బారినుండి రక్షించాడు. తరువాత అతడు తన మేనమామ కొమార్తె లిద్దరినీ పెండ్లిచేసికొన్నాడు. సిరసంపదలతో తులదూగుతూ జన్మదేశానికి తిరిగివచ్చాడు. ఈ విధంగా అడుగడుగునా ప్రభువు అతన్ని కాపాడాడు, ఆదరించాడు. ప్రభువు తన భక్తులకు తోడై యుంటాడు. అందుకే కీర్తనకారుడు కూడ " నీ వెక్కడికి వెళ్లినా నిన్ను కాపాడుతూండమని ప్రభువు తన దూతలను ఆజ్ఞాపించాడు" అంటాడు — 91, 11 ఈలా భగవంతుని ఆదరణకు పాత్రుడయ్యే నరుడు ధన్యుడుగదా!