Jump to content

పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/శ్రీహరి నిత్యవిభూతి

వికీసోర్స్ నుండి


తెభా-2-268-సీ.
ట్టి విరాడ్విగ్రహాంత రాకాశంబు-
లన నోజస్సహోలము లయ్యెఁ
బ్రాణంబు సూక్ష్మరూక్రియాశక్తిచే-
నియించి ముఖ్యాసు నఁగఁ బరఁగె
వెలువడి చను జీవి వెనుకొని ప్రాణముల్-
నుచుండు నిజనాథు నుసరించు
టుల చందంబునఁ బాటిల్లు క్షుత్తును-
భూరి తృష్ణయు మఱి ముఖమువలనఁ

తెభా-2-268.1-తే.
దాలు జిహ్వాదికంబు లుద్భవము నొందె
నందు నుదయించె నానావిధైక రసము
లెనయ నవి యెల్ల జిహ్వచే నెఱుఁగఁబడును
మొనసి పలుక నపేక్షించు ముఖమువలన.

టీక:- అట్టి = అటువంటి; విరాఠ్ = విరాఠ్; విగ్రహ = విగ్రహము యొక్క; అంతర = లోపలి; ఆకాశంబున్ = ఆకాశము; వలన = వలన; ఓజస్ = ఓజస్సు, గ్రహణ శక్తి; సహస్ = సహస్సు, ధారణా శక్తి; బలము = బలము, భౌతిక శక్తి; అయ్యెఁన్ = కలలిగినవి; ప్రాణంబున్ = ప్రాణము; సూక్ష్మ = సూక్షమమైన; రూప = రూపము; క్రియ = క్రియా; శక్తి = శక్తి; చేన్ = చేత; జనియించెన్ = పుట్టినది; ముఖ్య = ముఖ్యమైన; అసువు = ప్రాణము; అనఁగన్ = అని; పరఁగెన్ = ప్రసిద్ధి కెక్కెను; వెలువడి = బయల్పడి; చను = వర్తించు; జీవిన్ = ప్రాణిని; వెనుకొని = వెంటపడి; ప్రాణముల్ = ప్రాణములు; చనుచుండున్ = వెళ్ళుచుండును; నిజ = తన; నాథున్ = యజమానిని; అనుసరించు = అనుసరించే; భటులన్ = సేవకులు; చందంబునన్ = వలె; పాటిల్లున్ = కలుగును; క్షుత్తునున్ = ఆకలి; భూరి = గొప్ప; తృష్ణయున్ = దప్పులు; మఱి = మళ్ళీ; ముఖము = ముఖము; వలనఁన్ = వలన; తాలు = అంగిలి;
జిహ్వ = నాలుక; ఆదికము = మొదలైనవి; ఉద్భవము = పుట్టుకను; ఒందెన్ = పొందినవి; అందున్ = అందు; ఉదయించెన్ = కలిగెను; నానా = అనేక; విధైక = రకములైన; రసములు = రుచులు; ఎనయన్ = తెలుసుకొనిన; అవి = అని; ఎల్లన్ = సమస్తమును; జిహ్వ = నాలుక; చేన్ = చేత; ఎఱుఁగఁబడునున్ = తెలియబడును; మొనసి = పూనుకొని; పలుకన్ = పలుకవలెనని; అపేక్షించున్ = కోరే; ముఖము = ముఖము; వలనన్ = వలన.
భావము:- ఇలాంటి విరాట్పురుషుని శరీరం లోపలి ఆకాశం నుండి ప్రవృత్తి సామర్థ్యరూపమైన ఓజస్సు. వేగసామర్థ్యం, బలం అనే ధర్మాలు కలిగాయి. సూక్ష్మరూపమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. అది సమస్త ప్రాణులకు ముఖ్యమైనది. యజమాని ననుసరించు సేవకులలాగ ప్రాణాలు జీవి ననుసరించి వెడలిపోతుంటాయి. విరాట్పురుషునకు జఠరాగ్ని దీపించగానే ఆకలిదప్పులు ఏర్పడ్డాయి. ముఖం నుండి దవుడలు, నాలుక మొదలైననవి పుట్టాయి. అందుండే ఆరు విధాలైన రసాలు జనించాయి. ఆ రసభేదా లన్నీ నాలుకతోనే గ్రహింపబడుతున్నాయి. ముఖం సంభాషించాలని భావించింది.

తెభా-2-269-వ.
మఱియు వాగింద్రియంబు వుట్టె; దానికి దేవత యగ్ని, యారెంటి వలన భాషణంబు వొడమె; నా యగ్నికి మహాజల వ్యాప్తం బగు జగంబున నిరోధంబుగలుగటం జేసి యా జలంబె ప్రతిబంధకం బయ్యె; దోదూయమానంబైన మహావాయువువలన ఘ్రాణంబు పుట్టెం; గావున వాయుదేవతాకంబైన ఘ్రాణేంద్రియంబు గంధగ్రహణ సమర్థం బయ్యె; నిరాలోకం బగు నాత్మ నాత్మయందుఁ జూడం గోరి తేజంబువలన నాదిత్యదేవతాకంబై రూపగ్రాహకంబైన యక్షియుగళంబు వుట్టె; ఋషిగణంబులచేత బోధితుం డగుచు భగవంతుండు దిగ్దేవతాకంబును శబ్దగ్రాహకంబును నైన శ్రోత్రేంద్రియంబు వుట్టించె; సర్జనంబు సేయు పురుషునివలన మృదుత్వ కాఠిన్యంబులును లఘుత్వ గురుత్వంబులును నుష్ణత్వ శీతలత్వంబులునుం జేసెడు త్వగింద్రియాధిష్టానం బగు చర్మంబు వుట్టె; దానివలన రోమంబు లుదయించె వానికి మహీరుహంబు లధిదేవత లయ్యె; నందు నధిగత స్పర్శగుణుండును నంతర్భహిః ప్రదేశంబుల నావృతుండును నగు వాయువువలన బలవంతంబులును, నింద్రదేవతాకంబులును, నాదాన సమర్థంబులును, నానా కర్మకరణదక్షంబులును నగు హస్తంబు లుదయించె; స్వేచ్ఛావిషయగతి సమర్థుండగు నీశ్వరుని వలన విష్ణుదేవతాకంబు లగు పాదంబు లుదయించెఁ; బ్రజానందామృతార్థి యగు భగవంతునివలన ప్రజాపతిదేవతాకంబై, స్త్రీ సంభోగాది కామ్యసుఖంబులు గార్యంబులుగాఁ గల శిశ్నోపస్థంబు లుదయించె మిత్రుం డధిదైవతంబుగాఁ గలిగి భుక్తాన్నాద్యసారాంశ త్యాగోపయోగం బగు పాయు వనెడి గుదం బుద్భవించె; దాని కృత్యం బుభయ మలమోచనంబు; దేహంబుననుండి దేహాంతరంబుఁ జేరంగోరి పూర్వకాయంబు విడుచుటకు సాధనంబగు నాభిద్వారంబు సంభవించె; నట్టి నాభియే ప్రాణాపాన బంధస్థానం బనంబడుఁ; దద్బంధ విశ్లేషంబె మృత్యు వగు; నదియ యూర్థ్వాధోదేహభేదకం బనియునుం జెప్పంబడు; నన్నపానాది ధారణార్థంబుగ నాంత్రకుక్షి నాడీ నిచయంబులు గల్పింపంబడియె; వానికి నదులును సముద్రంబులును నధిదేవత లయ్యె; వానివలనఁ దుష్టిపుష్టులును నుదర భరణరస పరిణామంబులు గలిగియుండు; నాత్మీయ మాయా చింతనంబొనర్చు నపుడు కామసంకల్పాది స్థానం బగు హృదయంబు; గలిగె దాని వలన మనంబును జంద్రుండునుఁ గాముండును సంకల్పంబును నుదయించె; నంతమీఁద జగత్సర్జనంబు సేయు విరాడ్విగ్రహంబున సప్తధాతువులునుఁ, బృథివ్యప్తేజోమయంబు లయిన సప్తప్రాణంబులును, వ్యోమాంబువాయువులచే నుత్పన్నంబులై గుణాత్మకంబు లైన యింద్రియంబులును, నహంకార ప్రభవంబు లైన గుణంబులును, సర్వవికారస్వరూపం బగు మనస్సును, విజ్ఞానరూపిణి యగు బుద్ధియును బుట్టు; వివిధంబగు నిదియంతయు సర్వేశ్వరుని స్థూలవిగ్రహంబు; మఱియును.
టీక:- మఱియు = మరి; వాగింద్రింయంబున్ = వాగింద్రియము; పుట్టెన్ = పుట్టినది; దానికిన్ = దానికి; దేవత = అధిదేవత; అగ్ని = అగ్ని; ఆ = ఆ; రెంటిన్ = రెండింటి; వలనన్ = వలన; భాషణంబున్ = మాటలు; ఒడమెన్ = కలిగెను; ఆ = ఆ; అగ్ని = అగ్ని; కిన్ = కి; మహా = మిక్కిలి; జల = నీటితో; వ్యాప్యంబున్ = వ్యాపింపబడినది; అగు = అయిన; జగంబున్ = లోకములలో; నిరోధంబున్ = అడ్డము; కలుగుటన్ = కలుగుట; చేసిన్ = వలన; ఆ = ఆ; జలంబె = నీరే; ప్రతిబంధకంబున్ = అడ్డు; అయ్యెన్ = అయినది; దోదూయమానంబు = మిక్కిలి చలించేది; ఐనన్ = అయిన; మహా = గొప్పదైన; వాయువున్ = వాయువు, గాలి; వలనన్ = వలన; ఘ్రాణంబున్ = వాసన; పుట్టెన్ = పుట్టినది; కావున్ = కనుక; వాయు = వాయువు; దేవతాకంబున్ = అధిదేవతగ కలది; ఐన = అయిన; ఘ్రాణేంద్రియంబున్ = ముక్కు, వాసన చూసేది; గంధ = వాసనను; గ్రహణ = గ్రహించగల; సమర్థంబున్ = శక్తి కలది; అయ్యెన్ = అయినది; నిరాలోకంబున్ = ఆలోకింపరానిది, కనిపించనిది; అగు = అయిన; ఆత్మన్ = ఆత్మ; ఆత్మన్ = తన; అందున్ = అందు; చూడన్ = చూడవలెనని; కోరి = కోరుకొని; తేజంబున్ = వెలుగు; వలనన్ = వలన; ఆదిత్య = ఆదిత్యుడు; దేవరాకంబున్ = అధిదేవత; ఐ = అయి; రూప = రూపమును; గ్రాహకంబున్ = గ్రహించునది; ఐన = అయిన; అక్షిన్ = కళ్ళ; యుగళంబున్ = జంట; పుట్టెన్ = పుట్టినవి; ఋషి = ఋషుల; గణంబులన్ = సమూహము; చేతన్ = చేత; బోధితుండున్ = తెలియబడుతున్నవాడు; అగుచున్ = అగుచు; భగవంతుఁడు = భగవంతుడు {భగవంతుడు - సమస్త మహిమలు (ప్రభావ శక్తులు) కలవాడు, సమీప సుదూర ప్రభావములు కలిగింప కలవాడు}; దిక్ = దిక్కులు; దేవతాకంబునున్ = అధిదేవతగను; శబ్ద = శబ్దమును; గ్రాహకంబునునన్ = గ్రహించునదియును; ఐనన్ = అయిన; శ్రోత్రేంద్రియంబున్ = వినేసాధనాలు, చెవులు; పుట్టించెన్ = పుట్టించెను; సర్జనంబున్ = సృష్టిని; చేయు = చేసే; పురుషుని = వాని; వలనన్ = వలన; మృదుత్వ = మెత్తదనము; కాఠిన్యంబులునున్ = గట్టితనములును; లఘుత్వ = తేలిక; గురుత్వంబులునున్ = బరువులును; ఉష్ణత్వ = వేడి; శీతలత్వంబులునున్ = చల్లదనములును; చేసెడున్ = కలిగించే; త్వగింద్రియ = స్పర్శా సాధనమునకు; అధిష్టానంబున్ = ఆధారము; అగున్ = అగు; చర్మంబున్ = చర్మము; పుట్టెన్ = పుట్టెను; దానిన్ = దాని; వలనన్ = వలన; రోమంబులున్ = వెంట్రుకలు; ఉదయించెన్ = పుట్టినవి; వానిన్ = వాని; కిన్ = కి; మహీరుహంబులున్ = చెట్లు; అధిదైవతలున్ = అధిదైవతలు; అయ్యెన్ = అయ్యెను; అందున్ = అందు; అధిగత = పొందబడిన; స్పర్శ = స్పర్శించ గల; గుణుండునున్ = గుణములు కలవాడును; అంతర్ = లోపలి; బహిర్ = వెలుపలి; ప్రదేశంబులన్ = ప్రదేశములలో; ఆవృతుండున్ = ఆవరించి ఉండువాడు; అగు = అయిన; వాయువు = వాయువు, గాలి; వలనన్ = వలన; బలవంతంబులునున్ = బలము కలవియును; ఇంద్ర = ఇంద్రుడు; దేవతాకంబునున్ = అధిదేవతగ కలవియును; ఆదాన = స్వీకరించుటకు; సమర్థంబులునున్ = శక్తి కలవియును; నానా = అనేకమైన; కర్మ = పనులు; కరణ = చేయుటకు; దక్షంబులునున్ = శక్తి కలవియును; అగు = అయిన; హస్తంబులున్ = చేతులు; ఉదయించెన్ = పుట్టినవి; స్వేచ్ఛా = ఇష్టమైన; విషయ = స్థానమునకు; గతిన్ = వెళ్ళుటకు; సమర్థంబులునున్ = శక్తి కలవాడు; అగు = అగు; ఈశ్వరుని = ఈశ్వరుని {ఈశ్వరుడు - ప్రసరించువాడు, సర్వవ్యాపి, భగవంతుడు}; వలనన్ = వలన; విష్ణు = విష్ణువు {విష్ణువు - విశిష్టముగ వ్యాపించిన వాడు}; దేవతాకంబునున్ = అధిదేవతగా కలవి; అగున్ = అయిన; పాదంబులునున్ = కాళ్ళు; ఉదయించెన్ = పుట్టినవి; ప్రజ = సంతతి; ఆనంద = ఆనందములు అను; అమృత = అమృత తుల్యములను; అర్థిన్ = కోరువాడు; అగున్ = అయిన; భగవంతునిన్ = భగవంతుని {భగవంతుడు - వీర్యవంతుడు}; వలనన్ = వలన; ప్రజాపతిన్ = ప్రజాపతి; దేవతాకంబున్ = అధిదేవతగ కలవి; ఐ = అయి; స్త్రీన్ = స్త్రీలను; సంభోగ = సంభోగించుట; ఆది = మొదలైన; కామ్య = కామ సంబంధ; సుఖంబులునున్ = సుఖములును; కార్యంబులుగాఁన్ = చేయు పనులుగా; కల = ఉన్నవి; శిశ్న = పురుషాంగము; ఉపస్థంబున్ = స్త్రీయంగములును; ఉదయించెన్ = పుట్టినవి; మిత్రుండు = మిత్రుడు, సూర్యుడు; అధిదైవతంబుగాఁన్ = అధిదేవతగ; కలిగి = కలిగి; భుక్త = తినిన; అన్న = అన్నము; ఆది = మొదలైన వానిలోని; ఆసార = సారము లేని; అంశ = భాగములను (మలము); త్యాగన్ = విడుచుటకు; ఉపయోగన్ = అవసరమైనది; అగు = అయిన; పాయువు = పాయువు; అనెడి = అనే; గుదము = గుదము; ఉద్భవించెన్ = పుట్టెను; దానిన్ = దాని; కృత్యంబున్ = చేయుపని; ఉభయ = రెండు విధములైన {ఉభయమలములు - స్థూలమలము (నిరుపయోగ ఆహార భాగములు) సూక్ష్మమలము (యోగసాధనలోవిడిచే మలము)}; మల = మలములను; మోచనంబున్ = విడచుట; దేహంబునన్ = (ఒక) శరీరము; నుండిన్ = నుండి; దేహాంతరంబున్ = మరియొక శరీరమునకు; చేరన్ = వెళ్ళుట; కోరి = కోసము; పూర్వ = మునుపటి; కాయంబున్ = శరీరమును; విడుచుట = విడుచుట; కున్ = కును; సాధనంబున్ = సాధనము; అగున్ = అయిన; నాభిన్ = బొడ్డు అను; ద్వారంబున్ = ద్వారము; సంభవించెన్ = పుట్టెను; అట్టి = అటువంటి; నాభియే = బొడ్డే; ప్రాణ = ప్రాణము; అపాన = అపానములను; బంధ = బంధించు; స్థానంబులున్ = తావు; అనంబడుఁన్ = చెప్పబడును; తత్ = ఆ; బంధ = బంధము యొక్క; విశ్లేషంబె = విడిపోవుటయే; మృత్యువు = మరణము; అగున్ = అగును; అదియ = అదే; ఊర్థ్వ = పై; అధో = క్రింది; దేహ = శరీరములను; భేదకంబున్ = విడదీయునది; అనియును = అని కూడ; చెప్పంబడున్ = చెప్పబడును; అన్న = అన్నము; పాన = పానీయము; ఆది = మొదలైనవాని; ధారణ = ఉంచుకొను; అర్థంబుగఁన్ = అవసరమునకై; ఆంత్రన్ = పేగులు; కుక్షిన్ = పొట్ట; నాడీ = నాడుల; నిచయంబులున్ = సమూహములు; కల్పింపంబడియెన్ = ఏర్పరచ బడినవి; వాని = వాటి; కిన్ = కి; నదులునున్ = నదులును; సముద్రంబులునున్ = సముద్రములును; అధిదేవతలున్ = అధిదేవతలు; అయ్యెన్ = అయ్యెను; వాని = వాటి; వలనన్ = వలన; తుష్టి = సంతోషము; పుష్టులునున్ = పోషణలును; ఉదర = పొట్ట; భరణ = నిండుట (అను); రసాన్ = రుచుల, అనుభూతుల; పరిణామంబులున్ = మార్పులు; కలిగిన్ = కలిగి; ఉండున్ = ఉండును; ఆత్మీయ = స్వంత, తన యొక్క; మాయా = మాయ యొక్క; చింతనంబున్ = చింతించుటలు; ఒనర్చున్ = చేయుచున్న; అప్పుడున్ = అప్పుడు; కామ = కోరికలు; సంకల్ప = సంకల్పములు; ఆది = మొదలైనవానికి; స్థానంబున్ = తావు; అగు = అయిన; హృదయంబున్ = హృదయము; కలిగెన్ = పుట్టినది; దానిన్ = దాని; వలనన్ = వలన; మనంబునున్ = మనసును; చంద్రుండునున్ = చంద్రుడును; కాముండునున్ = మన్మథుడును; సంకల్పంబునున్ = సంకల్పమును; ఉదయించెన్ = కలిగినవి; అంతమీద = ఆపైన; జగత్ = లోకములను; సర్జనంబున్ = సృష్టి; చేయు = చేసే; విరాడ్విగ్రహంబునన్ = విరాట్స్వరూపములో; సప్త = ఏడు; ధాతువులునున్ = ధాతువులునున్ {సప్తధాతువులు - వసాదులు (వస, అసృక్కు, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లములు) - రోమాది (రోమ, త్వక్, మాంస, అస్థి, స్నాయువు, మజ్జ, ప్రాణములు)}; పృథివి = భూమి, ఘన; అప్ = నీరు, ద్రవ; తేజస్ = అగ్ని, త్రయీ; మయంబున్ = అనువానితో చేయబడినవి; అయిన = అయిన; సప్త = ఏడు; ప్రాణంబులున్ = ప్రాణములును; వ్యోమ = ఆకాశము; అంబు = జలము; వాయువులన్ = వాయువులు; చేన్ = చేత; ఉత్పన్నంబున్ = పుట్టినవి; ఐ = అయి; గుణాత్మకంబులు = గుణములే స్వరూపములు; ఐనన్ = అయిన; ఇంద్రియంబులునున్ = ఇంద్రియములును; అహంకార = అహంకారముల; ప్రభవంబులు = పుట్టినవి; ఐన = అయిన; గుణంబులునున్ = గుణములును; సర్వ = సమస్త; వికార = వికారముల; స్వరూపంబున్ = స్వరూపము; అగు = అయిన; మనస్సునున్ = మనస్సును; విజ్ఞాన = విజ్ఞనము యొక్క; రూపిణి = రూపము కలది; అగున్ = అయిన; బుద్ధియునున్ = బుద్ధియును; పుట్టున్ = పుట్టును; వివిధంబున్ = అనేక విధములైనది; అగున్ = అయిన; ఇది = ఇది; అంతయున్ = అంతా; సర్వేశ్వరునిన్ = సర్వేశ్వరుని యొక్క; స్థూల = స్థూల; విగ్రహంబున్ = స్వరూపము; మఱియునున్ = ఇంకను.
భావము:- ముఖం నుండి వాక్కు అనే ఇంద్రియం పుట్టింది. దానికి అగ్ని అధిష్ఠానదేవత. వాగింద్రియం నుండి, అగ్నినుండి సంభాషణం పుట్టింది. జగత్తంతా జలవ్యాప్తం కావటం వల్ల అగ్నికి జలం వల్ల నిరోధం కల్గింది. అందువల్ల అగ్నికి జలమే ప్రతిబంధక మయింది. మిక్కిలిగా చలించే మహా వాయువు నుండి ఘ్రాణం పుట్టింది. దానికి వాయువు అధిదేవత. ఆ ఘ్రాణేంద్రియం గ్రంధాన్ని గ్రహించటంలో నేర్పుగల దయింది. విరాట్పురుషుడు కంటికి కనిపించని ఆత్మను తనలో చూడగోరాడు. అప్పుడు సూర్యుడు దేవతగా కలిసి, రూపం గ్రహించేవీ అయిన నేత్రాలు రెండు తేజస్సు నుండి పుట్టాయి. మును లందరు భగవంతుని ప్రార్థించగా ఆయన దిక్కులు దేవతగా కలిగి, శబ్దాన్ని గ్రహించే శ్రోత్రింద్రియాన్ని ఉద్భవింపజేసాడు. సృష్టికర్త యైన పురుషుని నుండి త్వగింద్రియానికి అధిష్ఠానమైన చర్మం పుట్టింది. ఆ చర్మం ఆయా వస్తువులలోని మార్థవాన్ని, కాఠిన్యాన్ని, తేలికదనాన్ని, బరువును, వేడిమిని, చల్లదనాన్ని గ్రహిస్తుంది. చర్మమునుండి వెంట్రుకలు పుట్టాయి. వాటికి చెట్లు అధిదేవత లయ్యాయి. త్వగింద్రియాన్ని అధిష్టించినవాడు, స్పర్శ మనే గుణం కలవాడు, లోపలా బయట వ్యాపించిన వాడు నయిన వాయువు నుండి హస్తాలు పుట్టాయి. అవి బలం కలవి, వస్తుగ్రహణంలో నేర్పు కలవి, అనేకమైన పనులు చేయగలవి. వాటికి ఇంద్రుడు అధిదేవత. తనకు ఇచ్చవచ్చిన చోటికి పోయే సామర్థ్యం కల ఈశ్వరుని నుండి పాదాలు పుట్టాయి. వాటికి విష్ణువు అధృతదేవత.
ప్రజానంద మనే అమృతాన్ని కాంక్షించి, భగవంతుని నుండి పురుషాంగం, ఉపస్థు జనించాయి. వాటికి అధిదేవత ప్రజాపతి. స్త్రీసంభోగం మొదలైనవి వాటిపనులు. మిత్రుడు అధిదేవతగా గల “పాయువు” అనే ఇంద్రియాన్ని “గుదం” అని కూడ అంటారు. అది భుక్త పదార్థాలలోని నిస్సారమైన అంశాన్ని, యోగసాధనలోవిడిచే మలమును త్యజించటానికి సాధన మవుతుంది. అనగా స్థూల సూక్ష్మ, ఉభయ మలములను వర్జిస్తుంది.
ఒక శరీరాన్ని వదలి మరొక శరీరం ధరింపగోరి నప్పుడు, మొదటి శరీరం వదలటానికి సాధనంగా “బొడ్డు” అనే ద్వారం పుట్టింది. ప్రాణం, అపానం బంధింపబడే స్థానం అదే. ఆ బంధం విడిపోవడమే మృత్యువు. పై శరీరాన్ని, క్రింద శరీరాన్ని వేరుచేసేది కూడ ఆ నాభి స్థానమే. ఆహార పానీయాదులను ధరించడానికి పేగులు, పొట్ట, నాడీ సమూహము కల్పితము లైనాయి. వాటికి నదులు, సముద్రాలు అధిదేవతలు. వాటివల్ల తుష్టి, పుష్టి అనే ఉదరాన్ని భరించే రస పరిణామాలు కలిగాయి.
ఆ విరాట్పురుషుడు తన మాయను ధ్యానించేటప్పుడు కామానికి, సంకల్పాదులకు స్థానమైన హృదయం పుట్టింది. ఆ హృదయం నుండి మనస్సు, చంద్రుడు, కాముడు, సంకల్పము పుట్టాయి. అటుపిమ్మట జగత్తును సృష్టించే విరాట్పురుషుని శరీరంలో త్వక్కు, చర్మం, మాంసం, రక్తం, మేధస్సు, మజ్జ, ఎముకలు అనే సప్తధాతువులు, పృథివి, జల, తేజో రూపాలైన ఏడు ప్రాణాలు, ఆకాశ జల వాయువుల నుండి జనించిన గుణరూపాలైన ఇంద్రియాలు, అహంకారాన్ని కలిగించే గుణాలు, అన్ని వికారాలు స్వరూపంగా కల మనస్సు, విజ్ఞాన రూపమైన బుద్ధి జనించాయి. ఇదంతా ఆ సర్వేశ్వరుని స్థూలశరీరమే. ఇంతేకాదు.

తెభా-2-270-క.
రుసఁ బృథివ్యాద్యష్టా
ణావృతమై సమగ్ర వైభవములఁ బం
రుహభవాండాతీత
స్ఫుణం జెలువొందు నతివిభూతి దలిర్పన్.

టీక:- వరుసన్ = వరుసగా; పృథివి = పృథివి; ఆది = మొదలైన; అష్ట = ఎనిమిది {అష్టావరణములు - పృథివి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారములు}; ఆవరణన్ = ఆవరణలచే; ఆవృతమున్ = ఆవరింపబడినది; ఐ = అయి; సమగ్ర = సంపూర్ణమైన; వైభవంబులన్ = వైభవములతో; పంకన్ = బురదలో; రుహన్ = పుట్టిన (తామర) లో; భవ = పుట్టిన (బ్రహ్మ); అండ = అండము (బ్రహ్మాండము); అతీత = కంటె మించిన; స్ఫురణన్ = విధమైన; చెలువొందు = సౌదర్యము కలిగి ఉన్నది; అతి = మిక్కిలి; విభూతిన్ = వైభవము; తలిర్పన్ = ఒప్పి యుండగ.
భావము:- ఆ స్థూలవిగ్రహం క్రమంగా పృథివి, జలం, తేజం, వాయువు, గగనం, అహంకారం, మహత్త్వం, అవ్యక్తం అనే ఎనిమిది ఆవరణాలలో వ్యాప్తమై ఉంది. గొప్ప వైభవంతో బ్రహ్మాండాన్ని మించినదై అత్యుజ్జ్వలంగా ప్రకాశిస్తున్నది.

తెభా-2-271-క.
పొలుపగు సకల విలక్షణ
ములు గల యాద్యంత శూన్యమును నిత్యమునై
లి సూక్ష్మమై మనో వా
క్కుకుం దలపోయఁగా నగోచర మగుచున్.

టీక:- పొలుపగు = అందమైన; సకల = సమస్త; విలక్షణములున్ = విశిష్ట లక్షణములు; కల = కలిగినది యును; ఆది = మొదలు; అంత = అంతములు; శూన్యమును = లేనట్టిదియును; నిత్యమున్ = నిత్యమైనదియును; ఐ = అయి; లలి = అత్యంత; సూక్ష్మ = సూక్ష్మము; ఐ = అయి; మనస్ = మనసు; వాక్కులన = మాటల; కున్ = కు; తలపోయఁగాన్ = ఆలోచించుటకు; అగోచరము అగుచున్ = అందనిది అగుచు;
భావము:- విరాట్పురుషుని సూక్ష్మరూపం విలక్షణమైనది. దానికి మొదలు తుది లేవు. అది నిత్యమైనది, సూక్ష్మమైనది. ఆలోచించి చూసిన మనస్సుకు, వాక్కుకు గోచరం కానిది.

తెభా-2-272-సీ.
లఘు తేజోమయంబైన రూపం బిది-
క్షితినాథ! నాచేతఁ జెప్పఁబడియె;
మానిత స్థూల సూక్ష్మస్వరూపంబుల-
లన నొప్పెడు భగత్స్వరూప
మ్మహాత్మకుని మాయాబలంబునఁ జేసి-
దివ్యమునీంద్రులుఁ దెలియలేరు;
సుధేశ! వాచ్యమై వాచకంబై నామ -
రూపముల్ క్రియలును రూఢిఁ దాల్చి

తెభా-2-272.1-ఆ.
యుండు నట్టి యీశ్వరుండు నారాయణుం
ఖిలధృత జగన్నియంతయైన
చిన్మయాత్మకుండు సృజియించు నీ ప్రజా
తుల ఋషులఁ బితృ వితుల నెలమి.

టీక:- అలఘు = గొప్పదైన; తేజో = తేజస్సుతో; మయంబున్ = నిండి ఉన్నది; ఐన = అయిన; రూపంబున్ = స్వరూపము; ఇది = ఇది; క్షితిన్ = భూమికి; నాథ = ప్రభువ, రాజ; నా = నా; చేతన్ = చేత; చెప్పఁబడియెన్ = చెప్పబడినది; మానిత = మన్నింపబడే; స్థూల = స్థూలమైన; సూక్ష్మ = సూక్ష్మమైన; స్వరూపంబులన్ = స్వరూపములు; వలనన్ = వలన; ఒప్పెడున్ = ఒప్పుచుండు; భగవత్ = భగవంతుని; స్వరూపము = స్వరూపము; ఆ = ఆ; మహాత్మకుని = గొప్పఆత్మ కలవాని; మాయా = మాయ యొక్క; బలంబునన్ = బలమైన ప్రభావము; చేసి = వలన; దివ్య = దేవతలు; మునీంద్రులుఁన్ = ఋషులైనను; తెలియలేరు = తెలుసుకొనలేరు; వసుధన్ = భూమికి; ఈశ = ప్రభువ, రాజ; వాచ్యము = వాక్కు; ఐ = అయ్యి; వాచకంబున్ = వాక్కుయొక్క అర్థము; ఐ = అయ్యి; నామన్ = (సమస్త) పేర్లు; రూపముల్ = (సమస్త) రూపములు; క్రియలున్ = (సమస్త) పనులును; రూఢిఁన్ = నిశ్చయముగ; తాల్చి = ధరించి;
ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; ఈశ్వరుండు = ఈశ్వరుడు {ఈశ్వరుడు - ప్రభుత్వము కలవాడు, భగవంతుడు}; నారాయణుండు = నారాయణుడు {నారాయణుడు - నారములందు వసించువాడు, భగవంతుడు}; అఖిలధృత = అఖిలధృత {అఖిలధృత - సమస్తమును ధరించువాడు, భగవంతుడు}; జగన్నియంత = జగన్నియంత {జగన్నియంత - లోకములను నియమించువాడు, భగవంతుడు}; ఐన = అయిన; చిన్మయాత్మకుండు = చిన్మయాత్మకుడు {చిన్మయాత్మకుండు - చైతన్యము నిండిన స్వరూపము కలవాడు, భగవంతుడు}; సృజియించున్ = సృష్టించును; ఈ = ఈ సమస్తమైన; ప్రజాపతులన్ = ప్రజాపతులను; ఋషులఁన్ = ఋషులను; పితృ = పితృదేవతల; వితతులన్ = సమూహములను; ఎలమిన్ = కోరి, వికాశముతో.
భావము:- మహారాజా! మహాతేజస్సుతో నిండిన భగవత్స్వరూపాన్ని గూర్చి నే నిప్పుడు వివరిస్తాను. స్థూలమని, సూక్ష్మమని రెండు రూపాలతో విలసిల్లే ఆ భగవదాకారాన్ని ఆ పరమాత్ముని మాయాప్రభావంవల్ల దివ్య తేజోధనులైన మునులు కూడ తెలిసికొనలేకున్నారు. వాచ్యమై, వాచకమై, నామరూపక్రియలు దాల్చిన ఈశ్వరుడు సమస్త లోకాలకు నియామకుడు అయ్యి ఉన్నాడు. చిన్మయ స్వరూపుడైన ఆ శ్రీమన్నారాయణుడు ప్రజాపతులను, ఋషులను. పితృదేవతలను ప్రీతితో సృష్టిస్తున్నాడు.

తెభా-2-273-వ.
మఱియును.
టీక:- మఱియునున్ = ఇంకను.
భావము:- ఇంకా ఉంది విను.

తెభా-2-274-సీ.
సుర, సిద్ద, సాధ్య, కిన్న, వర చారణ,-
రుడ, గంధర్వ, రాక్షస, పిశాచ,
భూత, వేతాళ, కింపురుష, కూశ్మాండ, గు-
హ్యక, డాకినీ, యక్ష, యాతుధాన,
విద్యాధరాప్సరో, విషధర, గ్రహ, మాతృ-
ణ, వృక, హరి, ఘృష్టి, గ, మృగాళి,
ల్లూక, రోహిత, శు, వృక్ష యోనుల-
వివిధ కర్మంబులు వెలయఁ బుట్టి

తెభా-2-274.1-తే.
ల నభో భూ తలంబుల సంచరించు
జంతు చయముల సత్త్వరస్తమో గు
ములఁ దిర్యక్సురాసుర ర ధరాది
భావముల భిన్ను లగుదురు పౌరవేంద్ర!

టీక:- సుర = దేవతలు {సురలు - దేవతలు - వేల్పులు}; సిద్ద = సిద్ధులు {సిద్ధులు - సిద్ది పొందినవారు}; సాధ్య = సాధ్యులు {సాధ్యులు - గణదేవతావిశేషము, వీరు పన్నెండుగురు - మనువు, హనుమంతుడు, విష్ణువు, ధర్ముడు, నారాయణుడు మొదలగువారు}; కిన్నర = కిన్నెరలు {కిన్నెరలు - అశ్వ ముఖము నర దేహము కల దేవయోనివారు, దేవగాయకులు}; వర = గొప్ప; చారణ = చారణులు {చారణులు - ఒకజాతి ఖేచరులు}; గరుడ = గరుడులు {గరుడ - ఒక జాతి పక్షి}; గంధర్వ = గంధర్వులు {గంధర్వులు - పాటలు పాడుటలో విశిష్టులు, దేవయోని విశేషము}; రాక్షస = రాక్షసులు {రాక్షసులు - రక్కసులు}; పిశాచ = పిశాచములు {పిశాచ - దేహమున మాంసముపై ఆధార పడి వర్తించు శక్తులు}; భూత = భూతములు {భూత - దేహము విడచినను కోరికలు వదలక వర్తించు ఆత్మలు, పిశాచభేదము}; వేతాళ = బేతాళులు {బేతాళ - భూతావశిష్ట మృత శరీరము}; కింపురుష = కింపురుషులు {కింపురుషులు - నరుని ముఖము అశ్వ దేహము కల దేవయోనివారు, దేవగాయకులు}; కూశ్మాండ = కూశ్మండులు {కూశ్మాండ - పిశాచభేదము}; గుహ్యక = గుహ్యకులు {గుహ్యక - యక్షుల భేదము, పాతాళవాసులు}; డాకినీ = డాకినీ {డాకిని - దాగి ఉండు పిశాచభేదము}; యక్ష = యక్షులు {యక్ష - సంచారులు, దేవయోని విశేషము, ఖేచరులు}; యాతుధాన = యాతుధానులు {యాతుధాన - నిరృతి, రాక్షసవిశేషము, యాతనలు కలిగించు శక్తులు}; విద్యాధర = విద్యాధరులు {విద్యాధర - గ్రహణ, ధారణాది శక్తుల కధిపతులు}; అప్సరస = అప్సరసలు {అప్సరస - దేవవేశ్యలు}; విషధర = పాములు {విషధర - విషము ధరించునవి, సర్పములు}; గ్రహ = గ్రహదేవతలు {గ్రహ - గ్రహ అధిదేవతలు, జ్యోతిషాధిపతులు}; మాతృగణ = అమ్మవార్లు {మాతృగణ -అమ్మవార్లు, గ్రామదేవతలు}; వృక = తోడేళ్ళు; హరి = సింహములు; ఘృష్టి = అడవి పందులు; ఖగ = పక్షులు; మృగాళి = లేళ్ళ గుంపులు; భల్లూక = ఎలుగుబంట్లు; రోహిత = కేసరిమృగములు; పశు = పశువులు; వృక్ష = వృక్షములు; యోనులన్ = (మొదలగువాని) యోనులలో; వివిధ = అనేక రకములైన; కర్మంబులున్ = కర్మమములు; వెలయఁన్ = కలుగునట్లు; పుట్టి = జనించి;
జల = నీటి; నభో = ఆకాశ; భూ = భూముల యొక్క; తలంబుల = మండలములలో; సంచరించున్ = సంచరించునట్టి; జంతు = జంతువుల; చయములన్ = సమూహములు; సత్త్వ = సత్వ; రజ = రజో; తమో = తమో; గుణములఁన్ = గుణములుతో; తిర్యక్ = జంతువులు {తిర్యక్కులు - చలనము కల జీవులు, జంతువులు}; సుర = దేవతలు; అసుర = రాక్షసులు; నర = మానవులు; ధర = పర్వతములు; ఆది = మొదలైన; భావములన్ = భావములుతో; భిన్నులు = విభజింప బడినవారు; అగుదురు = అవుతున్నారు; పౌరవ = పురుని వంశస్తులలో; ఇంద్ర = శ్రేష్ఠుడ (పరీక్షిత).
భావము:- ఓ పురువంశపు రాజోత్తమా! జీవులు తాము చేసిన నానా విదాలైన కర్మల్ని అనుసరించి సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, చారణులు, గరుడులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, బేతాళాలు, కింపురుషులు, కూశ్మాండులు, గుహ్యకులు, డాకినులు, యక్షులు, యాతుధానులు, విద్యాధరులు, అచ్చరలు, నాగులు, గ్రహాలు, మాతృగణాలు, తోడేళ్ళు, సింహాలు, సూకరాలు, పక్షులు, మృగాలు, ఎలుగుబంట్లు, చేపలు, పశువులు, చెట్లు మున్నగు బహు జాతులలో పుట్టి నీటిలోను, నింగిలోను, నేలమీద సంచరిస్తారు. సత్త్వగుణ, రజోగుణ, తమోగుణాలు కల్కి ఉంటారు. ఈ ప్రాణిజాత మంత తిర్యక్కులు, సురలు, అసురులు, నరులు, గిరులు ఇలా విభిన్న రూపాలతో ఉంటుంది.

తెభా-2-275-మ.
వొందన్ ద్రుహిణాత్మకుండయి రమాధీశుండు విశ్వంబుసు
స్థితం జేసి, హరిస్వరూపుఁడయి రక్షించున్ సమస్త ప్రజో
త్క సంహారము సేయు నప్పుడు హరాంర్యామియై యింతయున్
రియించుం బవనుండు మేఘముల మాయం జేయు చందంబునన్.

టీక:- ఇరవొందన్ = చక్కగ అమరునట్లు; ద్రుహిణ = బ్రహ్మదేవుని; ఆత్మకుండు = స్వరూపము ధరించిన వాడు; అయి = అయి; రమాధీశుండున్ = లక్ష్మీపతి {రమాధీశుడు - రమ (లక్ష్మీదేవి) కి అధీశుడు (పతి), విష్ణువు}; విశ్వంబున్ = జగత్తును; సుస్థిరతన్ = సమత్వముతో స్థిరముగ ఉన్నదిగ {సుస్థిరత - చక్కగ సరదుచేయబడి స్థిరముగ ఉన్నది}; చేసి = చేసి; హరి = విష్ణువు {హరి - సమస్త దుఃఖములను హరించువాడు}; స్వరూపుఁడు = స్వరూపము ధరించిన వాడు; అయి = అయి; రక్షించున్ = రక్షించును; సమస్త = సమస్తమైన; ప్రజన్ = జీవ; ఉత్కర = రాశిని; సంహారమున్ = ప్రాణహరణము; చేయున్ = చేసే; అప్పుడు = సమయములో; హర = శివుని; అంతర్యామి = లోవ్యాపించిన వాడు; ఐ = అయి; ఇంతయున్ = ఇదంతా; హరియించున్ = అణచుచుండును; పవనుండు = వాయువు; మేఘములన్ = మేఘములను; మాయన్ = మాయమగునట్లు; చేయు = చేసే; చందంబునన్ = విధముగ.
భావము:- లక్ష్మీకాంతుడు చతుర్ముఖుడై జగత్తును సృష్టిస్తాడు. విష్ణు స్వరూపుడై దానిని రక్షిస్తాడు. సంహార సమయంలో హరునికి అంతర్యామిగా ఉంటు, వాయువు మబ్బులను హరించినట్లే సమస్త విశ్వాన్ని సంహరిస్తాడు.

తెభా-2-276-క.
గిదిని విశ్వము సం
స్థాపించును మనుచు నడఁచు ర్మాత్మకుఁడై
దీపిత తిర్యఙ్నర సుర
రూపంబులు దాన తాల్చి రూఢి దలిర్పన్.

టీక:- ఈ = ఈ; పగిదిని = విధముగ; విశ్వమున్ = జగత్తును; సంస్థాపించునున్ = చక్కగ ఏర్పరుచును; మనుచు = రక్షించును; అడఁచున్ = హరించును; ధర్మాత్మకుఁడు = ధర్మస్వరూపుడు; ఐ = అయి; దీపిత = ప్రకాశించిన; తిర్యక్ = జంతువుల; నర = నరుల; సుర = దేవతల; రూపంబులున్ = స్వరూపాలను; తాన = తనే; తాల్చి = ధరించి; రూఢిన్ = ప్రసిద్దము; తలిర్పన్ = ఒప్పునట్లు.
భావము:- ఈ విధంగా ఆ దేవుడు ధర్మస్వరూపుడై తానే పశుపక్ష్యాదులు, నరులు, సురలు మున్నగు సమస్త రూపాలు ధరిస్తాడు. తానే ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు, పోషిస్తాడు, సంహరిస్తాడు.

తెభా-2-277-సీ.
రి యందు నాకాశ; మాకాశమున వాయు-
నిలంబువలన హుతాశనుండు;
వ్యవాహను నందు నంబువు; లుదకంబు-
లన వసుంధర లిగె; ధాత్రి
లన బహుప్రజాళి యుద్భవం బయ్యె-
నింతకు మూలమై యెసఁగునట్టి
నారాయణుఁడు చిదానంద స్వరూపకుం,-
వ్యయుం, డజుఁడు, ననంతుఁ, డాఢ్యుఁ,

తెభా-2-277.1-తే.
డాదిమధ్యాంతశూన్యుం, డనాదినిధనుఁ,
తని వలనను సంభూత మైన యట్టి
సృష్టి హేతు ప్రకార మీక్షించి తెలియఁ
జాల రెంతటి మునులైన నవరేణ్య!

టీక:- హరి = విష్ణువు; అందున్ = అందు; ఆకాశమున్ = ఆకాశము; ఆకాశమునన్ = ఆకాశములో; వాయువు = గాలి {వాయువు - వ్యాపించునది, గాలి}; అనిలంబున్ = గాలి {అనిలము - నిలబడి ఉండనిది, గాలి}; వలనన్ = వలన; హుతాశనుండున్ = అగ్ని {హుతాశనుడు - యజ్ఞములో హుతము చేయుటకు ఆశించు వాడు, అగ్ని}; హవ్యవాహనున్ = అగ్ని {హవ్యవాహనుడు - యజ్ఞమందలి హవ్యములను (ఆయా) దేవతలకు చేర్చువాడు, అగ్ని}; అందున్ = అందు; అంబువున్ = నీరు; ఉదకంబున్ = నీటి; వలనన్ = వలన; వసుంధర = నేల; కలిగెన్ = కలిగినవి; ధాత్రిన్ = నేల; వలనన్ = వలన; బహు = వివిధమైన; ప్రజ = జీవుల; ఆవళి = రాశి, సమూహములు; ఉద్భవంబున్ = పుట్టుట; అయ్యెన్ = జరిగెను; ఇంత = దీనంత; కున్ = కి; మూలము = మూలకారణము; ఐ = అయ్యి; ఎసఁగున్ = అతిశయించును; అట్టి = అటువంటి; నారాయణుండు = నారాయణుడు {నారాయణుడు - నారములందు వసించువాడు, భగవంతుడు}; చిదచిదానంద = సచేతనాచేతన ఆనందముల {చిదచిదానందస్వరూపకుడు - సచేతన అచేతన ఆనందములు తన స్వరూపమే అయిన వాడు, భగవంతుడు}; స్వరూపకుండు = స్వరూపకుడు; అవ్యయుండు = అవ్యయుడు {అవ్యయుండు - వ్యయము (తరుగు) లేనివాడు, భగవంతుడు}; అజుఁడు = అజుఁడు {అజుడు - జన్మము లేనివాడు, భగవంతుడు}; అనంతుడు = అనంతుడు {అనంతుడు - అంతము లేనివాడు, భగవంతుడు}; ఆఢ్యుఁడు = ఆఢ్యుడు {ఆఢ్యుడు - సకల సంపదలు కలవాడు, భగవంతుడు}; ఆది = ఆది {ఆదిమధ్యాంతశూన్యుడు - మొదలు మధ్య అంతములు లేనివాడు, భగవంతుడు};
మధ్యాంత = మధ్యాంత; శూన్యుండు = శూన్యుడు; అనాదినిధనుఁడు = అనాదినిధనుడు {అనాదినిధనః - పుట్టుక చావు లేనివాడు, విష్ణుసహస్రనామములలో 42వ నామం}; అతని = అతని; వలనను = వలన; సంభూతము = పుట్టినది; ఐనన్ = అయినది; అట్టి = అటువంటి; సృష్టిన్ = సృష్టికి; హేతువు = కారణములు; ప్రకార = విధానములు; ఈక్షించి = చూసి; తెలియఁన్ = తెలియుటకు; చాలరు = సరిపోరు; ఎంతటి = ఎంతటి; మునులు = మునులు; ఐనన్ = అయినను; జన = జనులకు; వరేణ్య = శ్రేష్ఠుడ, రాజ.
భావము:- శ్రీహరినుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి వాయువు పుట్టింది. వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు పుట్టాయి. నీటి నుండి భూమి పుట్టింది. భూమి నుండి నానావిధ జీవజాలము పుట్టింది. దీనంతటికి మూలమై ప్రకాశించేవాడు ఆ నారాయణుడే. ఆయన జ్ఞానానంద స్వరూపుడు, అవ్యయుడు, పుట్టుకలేని వాడు, అంతంలేనివాడు, ప్రభువు, ఆదిమధ్యాంత రహితుడు, జనన మరణాలు లేనివాడు. ఆయననుండి జనించిన ఈ సృష్టికి హేతువేమిటో, దాని స్వరూపా మెలాంటిదో ఎంత పరీక్షించినా ఎంతటి మునీశ్వరులైనా తెలుసుకోలేకున్నారు.

తెభా-2-278-వ.
అదియునుంగాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతేకాకుండ.

తెభా-2-279-మ.
ణీశోత్తమ! భూత సృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా
రి కర్తృత్వము నొల్ల కాత్మగత మాయారోపితం జేసి తా
నివద్యుండు నిరంజనుండుఁ బరుఁడున్ నిష్కించనుం డాఢ్యుఁడున్
నిపేక్షుండును నిష్కళంకుఁ డగుచున్ నిత్యత్వముం బొందెడిన్.

టీక:- ధరణీశ = రాజులలో; ఉత్తమ = ఉత్తముడా, రాజా; భూత = జీవుల; సృష్టిన్ = సృష్టిని; ఇటు = ఇలా; సంస్థాపించి = చక్కగ ఏర్పరచి; రక్షించున్ = రక్షించును; ఆ = ఆ; హరి = విష్ణువు; కర్తృత్వమున్ = కర్తృత్వమును; ఒల్లక = అంగీకరింపక; ఆత్మ = తన; గతన్ = అందు; మాయా = మాయ అందు; ఆరోపితన్ = ఆరోపింపబడిన దానిని; చేసి = చేసి; తాన్ = తను; నిరవద్యుండున్ = నిరవద్యుడు {నిరవద్యుడు - నిందలేని వాడు, భగవంతుడు}; నిరంజనుండుఁన్ = నిరంజనుడు {నిరంజనుడు - దోషము లేని వాడు, భగవంతుడు}; పరుఁడున్ = పరుడు {పరుడు - ఉత్తముడు, భగవంతుడు}; నిష్కించనుడున్ = నిష్కించనుడు {నిష్కించనుడు - వెలితి లేని వాడు, భగవంతుడు}; ఆఢ్యుఁడున్ = ఆఢ్యుడు {ఆఢ్యుడు - మించిన వాడు}; నిరపేక్షుండునున్ = నిరపేక్షుడు {నిరపేక్షుడు - దేనిని కోరని వాడు}; నిష్కళంకుఁడున్ = నిష్కళంకుడు {నిష్కళంకుడు - కళంకము (మచ్చ) లేని వాడు}; అగుచున్ = అగుచు; నిత్యత్వమున్ = శాశ్వతత్వమును; పొందెడిన్ = పొందుచుడెన్.
భావము:- ఓ భూపాలకోత్తమ! ఈ విధంగా ప్రాణులను సృష్టించి, రక్షిస్తున్న ఆ శ్రీహరి తనకు కర్తృత్వం అంగీకరించడు. దానినంతా తన మాయకే ఆరోపిస్తాడు. తాను నిరవద్యుడు, నిరంజనుడు, నిష్కించనుడు, నిరపేక్షుడు, నిష్కళంకుడు, పరుడు, ఆఢ్యుడు అయిన వాడై శాశ్వతత్వాన్ని పొందుతాడు.

తెభా-2-280-వ.
బ్రహ్మసంబంధి యగు నీ కల్పప్రకారం బవాంతరకల్పంబుతోడ సంకుచిత ప్రకారంబున నెఱింగిచింతి; నిట్టి బ్రహ్మకల్పంబున నొప్పు ప్రాకృత వైకృత కల్పప్రకారంబులునుఁ, దత్పరిమాణంబులును, కాలకల్పలక్షణంబులును, నవాంతరకల్ప మన్వంతరాది భేదవిభాగ స్వరూపంబును నతి విస్తారంబుగ నెఱిగింతు విను; మదియునుం బద్మకల్పం బనందగు"నని భగవంతుండైన శుకుండు బరీక్షిత్తునకు జెప్పె"నని సూతుండు మహర్షులకు నెఱింగిచిన.
టీక:- బ్రహ్మ = బ్రహ్మకు; సంబంధి = సంబంధించినది; అగు = అయిన; ఈ = ఈ; కల్ప = కల్పముల; ప్రకారంబున్ = విధానములు; అవాంతరకల్పంబున్ = కల్పాంతర ప్రళయము; తోడన్ = తో; సంకుచిత = సంగ్రహ; ప్రకారంబునన్ = రూపముగ; ఎఱింగించితిన్ = తెలిపితిని; ఇట్టి = ఇటువంటి; బ్రహ్మకల్పంబునన్ = బ్రహ్మకల్పములో; ఒప్పు = అమరు; ప్రాకృత = ప్రకృతి యొక్క; వైకృత = జీవుల యొక్క; కల్ప = సృష్టి; ప్రకారంబులునున్ = విధానములును; తత్ = వాని; పరిమాణంబులునున్ = పరిమాణములు; కాల = కాలముల; కల్ప = కల్పముల; లక్షణంబులునున్ = లక్షణాలు; అవాంతరకల్పము = ప్రళయము; మన్వంతర = మన్వంతరములు; ఆది = మొదలైన; భేద = భేదముల; విభాగ = విభాగముల; స్వరూపంబునున్ = స్వరూపములును; అతి = మిక్కిలి; విస్తారంబుగన్ = విస్తారముగ; ఎఱిగింతున్ = తెలిపెదను; వినుము = వినుము; అదియునున్ = దానిని; పద్మకల్పంబున్ = పద్మకల్పము; అనన్ = అనుట; తగున్ = తగును; అని = అని; భగవంతుండు = భగవంతుడు {భగవంతుడు - గొప్ప మహిమ కలవాడు}; ఐనన్ = అయిన; శుకుండున్ = శుకుడు; పరీక్షితున్ = పరీక్షితున; కున్ = కు; చెప్పెన్ = చెప్పెను; అని = అని; సూతుండు = సూతుడు; మహర్షులున్ = మహర్షుల; కున్ = కు; ఎఱింగించినన్ = తెలిపిన;
భావము:- పరబ్రహ్మకు సంబంధించిన ఈ కల్ప స్వరూపాన్ని అవాంతర కల్పంతో సహా సంగ్రహంగా చెప్పాను. ఇలాంటి ప్రాకృతాలు, వైకృతాలు అయిన కల్పాల విధానాలు, వాటి పరిమాణాలు, కాల లక్షణాలు, కల్పాల లక్షణాలు, అవాంతర కల్పాలు, మన్వంతరాలు మొదలైన వాని భేదాలు, విభాగాలు విపులంగా వివరిస్తాను, వినుము. దాన్ని “పద్మకల్ప” మని కూడ అంటారు. అని భగవంతుడైన శుకయోగి పరీక్షిత్తునకు చెప్పినట్లు సూతుడు శౌనకాది మహర్షులకు వెల్లడించాడు.