ఓహో బస్తీ దొరసానీ
అభిమానం (1960) సినిమా సోసం ఆరుద్ర రచించిన లలితగీతం.
ఓహో బస్తీ దొరసానీ, బాగా ముస్తాబయిందీ
అంద చందాల వన్నెలాడీ ఎంతో బాగుందీ ||| ఓహో బస్తీ దొరసానీ |||
ముచ్చటయిన కురులను దువ్వీ, పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది ||| ముచ్చటయిన |||
మాపై కోపం వచ్చింది
వచ్చిన కోపం హెచ్చింది
అంద చందాల వన్నెలాడి అయినా బాగుంది ||| ఓహో బస్తీ దొరసానీ |||
కొత్త పెళ్లికూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది
మత్తు మత్తు కన్నులతోను, మనసు తీర చూసింది ||| కొత్త పెళ్ళికూతురు |||
ఆమెకు సరదా వేసింది
జరిగి దగ్గరకొచ్చింది
అంద చందాల వన్నెలాడి కోపం పోయింది ||| ఓహో బస్తీ దొరసానీ |||
పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండిందీ
పల్లెసీమలో హాయీ వెల్లివిరిసి నిండింది ||| పడుచువాళ్ళ |||
చివరికి చిలిపిగ నవ్వింది
చేయి చేయి కలిపింది
అంద చందాల వన్నెలాడి ఆడిపాడిందీ ||| ఓహో బస్తీ దొరసానీ |||