ఓ దేవదా (పెరిగి పెద్దయిన తర్వాత)
స్వరూపం
ఓ దేవదా!
ఓ పార్వతి!
చదువు ఇదేనా
మన వాసి వదిలేసి
అసలు దొరల్లే సూటు బూటా?
ఓ దేవదా!
పల్లెటూరి పిల్లకు కులుకు వచ్చిందే
బదులు పల్కటమూ పట్టుబడిందే
పసికూన సిసలైన జాణా అయిందే బాగో బాగు
ఓ పార్వతి!
ఉన్న తీరు మారినా ఊరు మారినా
తమరు ఎన్నటికీ పసివారేనో
అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా
ఓ పార్వతి!
నా ఎదుటే నీ బడాయి
జీవితమే ఓ లడాయి
లడాయిలా సరే మనకు
బిడాయిలే అయేనే
ఆ నాడు ఈ నాడు ఒకటే మాట ఉడుకు మూట
ఓ చిలిపి పార్వతి!
ఓ దుడుకు దేవదా!