ఎవరికి వారౌ స్వార్ధంలో
స్వరూపం
గుడి గంటలు (1964) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన పాట.
ఎవరికి వారౌ స్వార్ధంలో
హృదయాలరుదౌ లోకంలో
నాకై వచ్చిన నెచ్చెలివే
అమృతం తెచ్చిన జాబిలివే
నాకమృతం తెచ్చిన జాబిలివే
ధనము కోరి మనసిచ్చే ధరణి మనిషిని కోరి వచ్చావే
నా అనువారే లేరని నేను కన్నీరొలికే కాలంలో
ఉన్నానని నా కన్నతల్లివలె ఒడిని జేర్చి నన్నోదార్చేవే
నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే
నాకమృతం తెచ్చిన జాబిలివే
ప్రేమకొరకు ప్రేమించేవారే కానరాక గాలించాను
గుండె తెరచి వుంచాను గుడిలో దేవుని అడిగాను
గంటలు గణగణ మ్రోగాయి నా కంటిపాప నువ్వన్నాయి |గంటలు|
నాకై వచ్చిన దేవతవే అమృతం తెచ్చిన జాబిలివే
నాకమృతం తెచ్చిన జాబిలివే
ఈ అనురాగం ఈ ఆనందం
ఎవ్వరెరుగని ఈ అనుబంధం
ఊడలు పాకి నీడలు పరచి ఉండాలి వెయ్యేళ్ళు
చల్లగ ఉండాలి వెయ్యేళ్ళు తీయగ పండాలి మన కలలు ||ఎవరికి||