ఈ నల్లని రాలలో

వికీసోర్స్ నుండి

అమరశిల్పి జక్కన (1964) సినిమా కోసం సి. నారాయణ రెడ్డి రచించిన లలితగీతం.


పల్లవి :

ఈ నల్లని రాలలో

ఏ కన్నులు దాగెనో

ఈ బండల మాటునా

ఏ గుండెలు మ్రోగెనో ||| ఈ నల్లని రాలలో |||


చరణం 1 :

పాపాలకు తాపాలకు

బహుదూరములో నున్నవి || 2 ||

మునులవోలె కారడవుల

మూలలందు పడియున్నవి ||| ఈ నల్లని రాలలో |||


చరణం 2 :

కదలలేవు మెదలలేవు

పదవి విప్పి పలుకలేవు || 2 ||

ఉలి అలికిడి విన్నంతనె

జలజలమని పొంగిపొరలు ||| ఈ నల్లని రాలలో |||


చరణం 3 :

పైన కఠినమనిపించును

లోన వెన్న కనిపించును || 2 ||

జీవమున్న మనిషికన్న

శిలలే నయమనిపించును ||| ఈ నల్లని రాలలో |||