ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం)3

వికీసోర్స్ నుండి
అనంతదైవజ్ఞుఁడు — అనంతపాలుఁడు


దోచుకొనుచుండెను. పద్మరా జను పరదేశీయుఁడు, తమలపాకు లమ్మువాఁడు రాజున కెంతయో అప్పు పెట్టి అతని సింహాసనమును గుదువ యుంచుకొనెను. అప్పుడు సూర్యమతి తనయొద్ద నున్న ధనమునొసంగి రాజును ఋణవిముక్తుని జేసెను. అప్పటినుండియు రాజ్యభారమంతయు సూర్యమతియే వహించెను. అనంతదేవుఁడు పేరునకు మాత్రము రాజుగా నుండెను. ఆమె ప్రభుత్వమున 'హలధరుఁ' డనువాఁడు ముఖ్యమంత్రిగ నుండెను. ఇతఁడు మిక్కిలి జాగురూకతతో రాజ్యభారమును నడపెను. ఆకాలమున అనంతదేవుడుఁడు శాల, కంపాదిదేశముల జయించెను. ఊరశ, వల్లాపుర దేశాధిపతులపై దండువెడలఁబోయెను గాని పరాజితుఁడై తిరిగివచ్చెను. అనంతదేవుఁడు మనఃస్థైర్యము లేనివాఁ డగుటచే సూర్యమతి యనుమతి నాతఁడు 1063లో రాజ్యమును తన కుమారుఁడైన కలశునకిచ్చివైచెను. కాని కలశునకును, అనంతదేవునకును పడనందున రాజుమరల రాజ్యభారము వహించుటకు ప్రయత్నించెను. తుద కీతఁడు క్రీ.శ. 1081లో కుటుంబకలహమునకు విసివి ఆత్మహత్య గావించుకొనెను.

అనంతదైవజ్ఞుఁడు - జ్యోతిష్య శాస్త్రవేత్త. మాహారాష్ట్రుడు. విఖ్యాతుండైన గణేశదైవజ్ఞునితమ్ముడు. ఇతడు క్రీ.శ.1859 జయనాం సంవత్సరమున వరాహమిహిరకృత 'లఘుజాతకము' పై టీక వ్రాసెను. అది ఉత్పలకృతమైన వ్యాఖ్యకంటె లఘుతర మైన దనియు, సులభ మైన దనియు, నీతనియభిప్రాయము.

అనంతహళ్ళి - బళ్ళారిజిల్లా హర్పణహళ్ళి తాలూకా యందలి ఈనాంగ్రామము. జనసంఖ్య 127 (1831).

అనంతనారాయనుడు - 1. సుప్రసిద్ధుడగు దక్షిణదేశపు సంస్క్రుతకవి; ఆనందవల్లీస్తోత్రము, శరభోజచరిత్రము అను గ్రంధములు రచించెను. 2. సుప్రసిద్ధుడగు తార్కిక పండితుడు. కారికావళి తర్క సంగ్రహములకు టీక వ్రాసెను.

అనంతనార్యుడు రేవూరి - ఆంధ్రకవులందరి త్రయం దితని ఇంటి పేరు తాళవవారని యున్నది. ఇతడు వైధిక భ్రాహ్మణుడు. కాండిన్యప గోత్రుడు. ఆపస్తంబసూత్రుడు. కాళహస్తికవి యీతనితాత. లింగ కవి యితనితండ్రి. 18వ శతాబ్ది పూర్వభాగమందలివాడు. ఇతడు రచించిన గ్రంథములు రెండు. గాధేయోపాఖ్యానము, వృద్ధాచల మహత్మ్యము. ఇందు మొదటిది బదిర కృష్ణ బూపాలునకును, రెండవది పంట లింగాజీరెడ్డికి నంకితము. గాధేయోపాఖ్యానము అయిదాశ్వాసముల గ్రంథము, విశ్వామిత్రుని రాచరికముమొదలుకొని వసిష్టునిచే బ్రహ్మర్షి యనిపించుకొనుటవఱ్ఱకు గల కథ యిం దతిప్రాఢముగ సరళశైలిని వర్ణింపబడినది. వృద్ధాచల మహత్మ్యము క్షేత్రమహత్త్వమును దెల్పు నైదాశ్వాసముల సరసమైన గ్రంథము.

అనంతపండితుడు - భామదత్తుని 'రసమంజరి' కి వ్యాఖ్య వ్రాసినవాడు; త్ర్యాంబకపండితుని కుమారుడు; బాలోపండితుని పౌత్రుడు; నీలకంశపండితుని ప్రపౌత్రుడు. ఈ వంశమువారి నివాసస్థలము గౌతమీనదితీరమున గల పుణ్యస్తంభము. దేశభాషయందు దానికి పుంటాంబేం అని పేరు. అహమద్‌నగరజిల్లా యందున్నది. అనంత పండితుడు రసమంజరీవ్యాఖ్యను శకవర్షము 1692లో అప్పుడు కాశీ నగరమును పాలించుచుండిన చంద్రభానుభూపతి యాఙ్ఞ ననుసరించి కాశియందు రచించెను.

అనంతపంథీ - సంయిక్తరాష్ట్రములయందలి బరేలీ, సీతాపూర్ జిల్లాలయందలి వైష్ణవులలో పునఃసంస్కాజెందిన వైష్ణవులసంప్రదాయము. వీరి సంఖ్య చాలాదక్కువ. పరమేశ్వరుడొక్కడే యని నమ్మి యితనిని అనంతదేవుడనుపేర నారాధింతురు. ముండ్వాలోని సాధుమున్నాదాస్ అను సువర్ణకారుడు ఏతన్మత కర్త. కఱవుకాలమున నిత డెందఱినో కడుపుమంటనుండి కాపాడెనట. భేరి, సీతాపూర్, బహరాయచ్ జిల్లాలవారెందరో యితని శిష్యులయిరట. మున్నాదాసు ఉపదేశించిన వైష్ణవమునకు, సాధారణ వైష్ణవమునకు ఎక్కువ భేద మేమియూ కనిపింపదు.

అనంతపద్మనాభపురం - 1. చిత్తూరు జిల్లా కాళహస్తితాలూకా యందలి ఈనాంగ్రామము. జనసంఖ్య 39 2. దీనికి గురమపేట గదమపాలెమను పేరుగలదు. విశాఖపట్టణముజిల్లా గోల్గొండతాలూకాలోని ఈనాంగ్రామము. ఇందలి జనసంఖ్య 26 (1931).

అనంతపల్లి - పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెం తాలూకాయందలి గ్రామము. జనసంఖ్య 3,844 (1931).

అనంతపాలుడు - కళ్యాణము రాజధానిగ బాలించిన పశ్చిమచాళుక్యవంశజుడగు త్రిభువనమల్ల ఆఱవవిక్రమాదిత్యుని ప్రధానదండనాయకుడు: మహేశదండనాయకుని నలువురు తనయులలొ బ్రసిద్ధుడు. విక్రమాధిత్యసామంతుడుగ బెళ్వొళ 300లు, పుఱిగెఱె 300ల రాజ్యములను పాలించెను. వేంగి రాజ్యమును చాళుక్యచోళ సామంతులు పాలించుచుండిన కాలము నితడా రాజ్యముపయి నెత్తివచ్చి వారినోడించి విక్రమాదిత్యుని పక్షమున గొన్నివత్సరములు తద్రాజ్యమును పాలించెను. ఈతని శాసనములు కృష్ణా, గుంటూరు మండలములదును, గోదావరి మండలముననూ గానవచుచున్నవి. ఈతడీ రాజ్యమునేఏలుచు బెజవాడయందుండిన కాలమున శ్రీపతిపండితు డీతనికి గురుడయి యుండెను (చూడుడు: