పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

49

శశికళ

సంగీత మేలనే


సంగీత మేలనే
పొంగేటి లయలేల

              సంతోషమే లేని జన్మకిక
              సంగీత మేలనే !

గొంతెత్తి పాడితే
గొణుగు పోయెను స్వరము

              పాట రానేరాదు
              బరువెక్కెనే గుండె

                           సంగీత మేలనే ?

ఆనంద రూపమై
అవతరించే గీతి

              ఆర్తిలో వికృతమై
              అపయానమై పోవు

                           సంగీత మేలనే ?