పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివేకానందస్వామి

79

మంచిదిగాదు. ఏలయన, అగ్రవర్ణములకుఁగల ప్రత్యేక గౌరవము లడుగంటినవి. కావున బ్రాహ్మణుఁడు తక్కిన వర్ణముల వృద్ధికొఱకు పాటుపడవలయును. అట్లు చేసినవాఁడు దానినెంతకాలము చేయునో యంతవఱకు బ్రాహ్మణుఁడు. అట్లుచేయక ధనార్జనముచేసి కొన్నవాఁడు బ్రాహ్మణుకాఁడు.

శూద్రులకు నేనొక్కమాట చెప్పుచున్నాను. మీరు తొందరపడక వేచియుండుఁడు. వంక దొరకినప్పుడల్ల బ్రాహ్మణులతో వివాదములాడవద్దు. ఏలయన యింతకాల మణగియుండుట మీలోపమే. బ్రహ్మవిద్యయు సంస్కృతమును మిమ్మెవరు నేర్చుకొనవద్దనిరి? ఇంతకాలము మీరేమిచేయుచుంటిరి? ఇన్నాళ్ళు సోమరులైయుండి యెవ్వరో మీకంటె నెక్కువ తెలివితేటలు నెక్కువ చాక చక్యము నెక్కువ యదృష్టము గలిగియున్నారని యిప్పుడు మొగము ముడుచుకొనిన నేమిలాభము? మీరు సంస్కృతము మొదలయినవి చదువుకొని బ్రాహ్మణులు గండు. మనమందఱ మొక్కయాలోచనమీఁద నడచినప్పుడు బలవంతుల మగుదుము. మరోనిశ్చయమే బలము. దీనికొక్క తార్కాణము చెప్పెద వినుఁడు. నాలుగుకోట్లమంది ఇంగ్లీషువారు ముప్పదికోట్ల మంది హిందువుల నెట్లు పరిపాలించు చున్నారు? ఆనాలుగుకోట్ల జనులు నొక్క యాలోచనపై నడుచు చున్నారు. అందుచే నపరిమితమైన బలము వారికిఁ గలిగినది. మీ ముప్పదికోట్ల జనులు నొకరొకొకరి సంబంధములేకుండ ముప్పదికోట్ల విధముల నడుచుచున్నారు. అందుకే మీగతి యిట్లున్నది.

వివేకానందుని గ్రంథములలో నిట్టిసంగతులనేకము లున్నవి. చోటుచాలమి నిచ్చట వ్రాయుటకు వీలులేదు. వివేకానందస్వామి