పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివేకానందస్వామి

71

మతపక్షమున ప్రతాపచంద్రముజుందారును, బౌద్ధమతపక్షమున ధర్మపాలుఁడును మన దేశమునుండియే వెళ్ళిరి. కాని వీరిద్దరికంటెను మత సంబంధములగు చర్చలుజేయుటకు వెళ్ళిన తక్కిన పురుషులకంటెను వివేకానందస్వామి కొక్కనికే యధికఖ్యాతి గలిగెను. చూపరుల మనస్సుల నాకర్షించు మూర్తియు మంచి ముఖవర్చసును గంభీరమైన కంఠనాదమునుగలిగి కాషాయాంబరములు ధరించిన యాహిందువును జూచినది మొదలమెరికావాసులకు వానియం దొకవిధమైన యునురాగ ముదయించుటచే నాతఁడు చేయు నుపన్యాసముల వారు శ్రద్ధతో నాలకింప జొచ్చిరి. వివేకానందస్వామి యమెరికాకు పోక మును పచ్చటి జనులకు మతమును గూర్చియు మన నాగరికతను గూర్చియు నంతగా దెలియదు, మనలను బాగుచేయునెపమున మన దేశమునకుఁ బోయినప్పుడు హిందువులమతము దుర్మత మనియు వారు మనుష్యజాతిలో నెంచఁబడఁ దగినవారు కారనియు నప్పుడప్పుడు చెప్పుచుందురు. గావున నచ్చటిజను లామాటనువిని మనవిషయమున నెంతయు దురభిప్రాయమును గలిగియుండిరి.

వివేకానందస్వామి బోధనలు వినినవారి కందఱకు నట్టి యభిప్రాయములు పోయినవి. ఈయన యాదేశమున బోధించినది వేదాంత మతము. అనగా నుపనిషత్తులలోని మతము. ఆయనకు శంకరాచార్యుని యందును రామానుజా చార్యునియందును మిక్కిలి గౌరవము గలదు. వేదాంతమతము సర్వోత్కృష్ట మయినదనియు నిది తక్కిన మతములవంటిది గాదనియు మహామ్మదీయ మతము క్రైస్తవమతము మొదలగునవి యొక్కొక్క పురుషునిమీఁద నిలిచి యున్నవనియు నాపురుషుఁడు లేడని గాని యా పురుషునియం దట్టి మహిమలు లేవనిగాని నిద్ధారణ చేయఁబడినప్పుడు తప్పక యామతములు నశింపవలసి యున్నవనియు వేదాంత మత మెవరొ యొక