పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

మహాపురుషుల జీవితములు

కాశికిఁబోయి జగత్ప్రసిద్ధ సన్యాసియగు త్రైలింగస్వామిని సందర్శించి గోకులబృందావనమున గంగామాతయను మహాత్మురాలిని సేవించి ధన్యుఁడయ్యె. మరల వారింటికివచ్చుచున్న మధ్యమార్గమున నొక పల్లి యలో జనులు దారిద్ర్యమున బాధపడుచుండుటఁ జూచి పరమహంస వారిదైన్యమునకు వగచి యా యూరందరి నాదరించినఁ గాని నేనిచ్చటనుండి కదలనని కూర్చుండె. అప్పుడు మధురనాథుఁడు చాల సొమ్ము వెచ్చబెట్టి కొన్ని నాళ్ళన్నప్రదానము చేసి కట్టగుడ్డలిచ్చి యాదరించె ఈతడు పరమపావనుఁడు. వాని దర్శనము చేసినవారందఱు వెంటనే పవిత్రులగుదురు. అతని సాన్నిధ్యవిశేషమున కొందఱు సమాధిగతులయి యీశ్వరుని గనువారు కొందఱు తమ దురాలోచనల విడిచి యిండ్లకు నిష్కలుషచిత్తులయి పోయెడువారు. వేయేలఁ ఆయన నొకసారి చూచినపిదప జారులకు కాంతాసక్తియు లోబులకు ధనాసక్తియుఁ బోయెడునవి; ధనముపేరు చెప్పిన నతని కెంతరోతయో యీ క్రింది సంగతినిబట్టి తెలిసికొనవచ్చును.

వెండి బంగారునాణెముల నతఁడు స్పృశించినమాత్రమునఁ జేతులు గజగజ వణకును, చరమకాలమునం దతఁడు వెండి బంగారమునే గాక యినుమును సయితము తాకజాలఁడయ్యె. అతనివద్ద మహిమ లనేకములు కలవు? కాని ప్రజ్ఞం బ్రకటించుటకై యామహిమల నెన్నడు నతఁడు ప్రదర్శింపఁడయ్యె. ఆయన యాగతానాగతములను జెప్పఁగలఁడు. తన పరోక్షమున జరగు కార్యములఁ బేర్కొనఁగలఁడు. తన యెదుటనున్న వారి మనసులో యాలోచన యెరుఁగగలఁడని యనేకులు చెప్పుదురు. కొందఱు మనుష్యులు దేవగుణములతోఁడను గొందఱు మనుష్యులు రాక్షస గుణములతోడను జన్మింతురనియు నట్టివారిని జులకఁగ గనిపెట్టవచ్చుననియుఁ బూర్వజన్మమునఁ జక్రవర్తులై సకల సౌఖ్యములఁ దనివితీర ననుభవించినవా రీజన్మమున