పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేశవచంద్రసేనుఁడు

53


బ్రహ్మసమాజ మొక మతముగా హిందూదేశమున వ్యాపించుటకితఁడే కారణము. ఈతని యుపన్యాసము లసాధారణములు. కుంభవృష్టులు నేలఁగురిసినట్లతి చాక చక్యముతో నుపన్యసించుటకును వినువారి సమ్మోహనాస్త్రముచే గట్టబడునట్లు నిశ్చేష్టితులుగ జేయుట కతఁడే సమర్థుఁడు. ఇంతటి మహావక్త హిందూదేశమున నదివఱకెన్నఁడు నుద్భవింప లేదు. స్వల్పలోపము లొకటి రెండున్నను గేశవచంద్రుఁ డనేక సద్గుణసంపన్నుఁ డగుటచే సర్వసజ్జనస్తవమునకుఁ బాత్రుఁడు.