పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

మహాపురుషుల జీవితములు



ఆయన యక్కడ క్రైస్తవ మతబోధకులతో వాదముసలిపి వారి నోడించినందున నచ్చటి పండితులందఱుఁ దమ మతమున నిలిపిన మహాత్ముఁడని వానిం గొనియాడిరి. పిదప దేవేంద్రనాధుఁడు సకుటుంబముగా సింహళద్వీపమునకు నావికాయాత్రజేయఁ గేశవచంద్రుడుఁ తనవారికిఁ దెలియకుండగనే వారితోఁ బయనమయి పోయెను. ఆ పయనమునందె వారి కిరువురకును మైత్రి యధికమయ్యెను. అచ్చటి నుండి వచ్చిన పిదప సంగీతసేవ లనుపేర కలకత్తానగరమున భజన సమాజము లేర్పరచి యతఁడచ్చట మతచర్చలు సేయుచువచ్చెను. 1861 వ సంవత్సరమున హిందూ దేశదర్పణమని యర్థమువచ్చు 'ఇండియను మిర్ర' రను పత్రికను కొందఱు మిత్రుల సాయమున బయలుదేరదీసి పక్షమున కొకసారి ప్రకటించుచు వచ్చెను. ఈపత్రిక క్రమంబున దినపత్రికయై కేశవ చంద్రసేనుని పెదతండ్రి కుమారుడగు నరేంద్రనాథసేనుగారిచే నిప్పటికిని కలకత్తా నగరమున మిక్కిలి ప్రసిద్ధముగఁ బ్రకటింపఁ బడుచున్నది. మరుసటి సంవత్సరమున నతఁడు దేవేంద్రనాథుని సాయమునఁ గలకత్తాగళాశాలను స్థాపించి యందు తాను నీతిని గూర్చియుఁ బరిశుద్ధాస్తిక మతమును గూర్చియు బోధించుచు వచ్చెను.

1862 వ సంవత్సరమందే దేవేంద్రనాథుఁడు కేశవ చంద్రసేనుని బ్రహ్మసమాజ మతమునకు బ్రధానాచార్యునిగ నేర్పరచి యొక పెద్ద సభఁజేసి యందతని నభిషిక్తుఁజేసెను. ఆ యుత్సవము మహావైభవముతో నిర్వర్తింపఁబడినది. ఆ యభిషేక సమయమునఁ గేశవ చంద్రుడు తనభార్యను సభకు రమ్మని పిలువ జుట్టములందఱు నట్టిపని వలనుపడదని పెద్దపెట్టున గోలపెట్టిరి. అయిన నతఁడు పట్టిన పట్టు వదలక తనభార్యను సభకుం దీసికొనిపోయెను. వెంటనే తత్ఫలముగ సోదరులును పెదతండ్రియు వాని నింటికి రానీయక బహిష్కరిం