పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

మహాపురుషుల జీవితములు



టికిని దినపత్రికయయి కలకత్తానగరమున వెలువడుచున్నది. దేవేంద్రనాథుఁడు తన ప్రియశిష్యుని వానిప్రజ్ఞకుఁ దగినంత గొప్పవానిగఁ జేయవలయునని నిశ్చయించి యొక దినమునఁ బౌరులన నేకులఁరావించి వానిసమక్షమునఁ గేశవచంద్రుని బ్రహ్మసమాజమత ప్రధానాచార్యునిగ నభిషిక్తునిఁజేసి బ్రహ్మానందుఁడను బిరుదమునిచ్చి బంగరుబందుల చట్రములో నమర్చిన యొకపటమును దంతపుముద్రయుఁదనరచించిన బ్రహ్మధర్మగ్రంథ ప్రతియు వాని కొసంగి మహావైభవముతో నుత్సవముఁ జేసెను. ఆదినము మొదలు బ్రహ్మసమాజమత మెంత మహోన్నతదశకురావలెనో యంతమహోన్నతదశకు వచ్చెను.

ఉపన్యాసములిచ్చుటలో మనహిందూదేశమునఁ గేశవచంద్రు నంతవాడు మరలజన్మింప లేదని యనేకులు యభిప్రాయపడియున్నారు. ఇతని కారణముననే బ్రహ్మసమాజమున నప్పుడనేకులు చేరిరి. కాని యాగురుశిష్యుల స్నేహ చిర కాలమునిలువదయ్యె. దేవేంద్రనాథుడు యజ్ఞోపవీతము దీసిపారవైచి మతాంతరులతో భోజనాదికముల జేయుచుండెనుకాని స్త్రీలను సభలకుఁదోడ్కొనివచ్చుట యితర వర్ణములవారితో సంబంధ బాంధవ్యములు జేసికొనుట మొదలగు కొన్ని కార్యముల కిష్టపడఁడయ్యె. కొన్ని విషయములఁ బూర్వపద్ధతుల ననుసరింపదలఁచిన గురువునకు నన్నిట నవీన పద్ధతుల నవలంబింపఁ దలఁచు శిష్యునకు నభిప్రాయభేధములు గలుగుటంజేసి వారిరువురు చిట్టచివఱకు విడిపోయిరి. దేవేంద్రనాధుఁడుతనమతమున కాదిబ్రహ్మ సమాజమని నామమిడియెను. కేశవచంద్రుఁడు తనమతమునకు హిందూదేశ బ్రహ్మసమాజమని పేరు పెట్టెను. అది మొదలు దేవేంద్రనాథమహర్షి ప్రపంచసంబంధము వదలుకొని యీశ్వర సేవయందే కాలముఁ బుచ్చుచుఁ బ్రతిసంవత్సరము హిమాలయమునకుఁ బోవుచు తన పరిశుద్ధజీవనమువలనను బవిత్ర చరిత్రమువలనను సత్ప్రవర్తనము