పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[43]

పూండి రంగనాథము మొదలియారి

337



వానియుపన్యాసముగూర్చి నీక్రిందివిధముగా వ్రాయఁబడెను. "ఎదుటనుండి రంగనాథము మొదలియారి చేయు నుపన్యాసము వినినవారు తప్పక యాతఁడు స్వదేశస్థు డనుకొందురు. కాని చాటుననుండి వినిన పక్షమున శైలింబట్టి పదప్రయోగమును బట్టి యుచ్ఛారణముంబట్టి మాటలాడుచుండిన వాఁ డాంగ్లేయుఁ డనుకొనవలసినదే కాని నల్లవాఁడనుటకుఁ వీలులేదు." ఆయుపన్యాసమును మనవారు తెల్లవారు గూడ బహువిధముల శ్లాఘించిరి.

రంగనాథము నిజముగా హిందూసంఘమున కొక యలంకారమని చెప్పవచ్చును. ఈయలంకారము 1893 వ సం|| డిశంబరునెల 10 వ తేదీని దేశముశోక మగ్నమగునట్లు నేలపాలయ్యెను. ఆయనకొద్దిదినములు జ్వరముతో బాధపడిలో కాంతరగతుఁడయ్యెను. ఆజ్వరమువానిం దుదముట్టించునని యెవ్వరు దలంప లేదు. మరణమునకుముందు నాలుగు దినముల క్రిందటివఱకు నతడు పాఠశాలకుబోవుచునేయుండెను. అతఁ డతిపరిశ్రమవలన నకాలమృత్యువు వాతబడెనని లోకులు తలంచిరి. వాని మరణమునకు వగవని హిందువులు కాని మహమ్మదీయులు కాని యూరోపియనులుకాని లేరు. ప్రెసిడెన్సీకాలేజీ కౌన్సిలువారు కాలేజీకి రంగనాథము మొదలియారు చేసిన మహోపకారమునుగ్గడించి గణితశాస్త్రమునందెగాక తత్వశాస్త్రమందు, జరిత్రాశాస్త్రమందు వాని కసమాన ప్రజ్ఞ గలదని, వానిమరణమువలన దమకాలేజీకి గలిగిన నష్టమునకు మిక్కిలి విచారించిరి. అప్పుడు డైరక్టరుగానుండిన డాక్టరు డంకనుదొరగారు రంగనాథముతోగలిసి చిరకాలము పనిచేసిన సహకారియగుటచే వాని మరణమునకు మిక్కిలివగచి వానిపెద్దకుమారునిపేర నొక జాబు వ్రాసెను. అందులో నీక్రింది సంగతులున్నవి. "కొట్టకొనవఱకు నీతండ్రి నాయభిప్రాయమున మిక్కిలి యున్నతపదము నాక్రమించెను. చెన్నపట్టణములోనుండిన యేయూరో