పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

322

మహాపురుషుల జీవితములు

విద్యాశాఖలోఁ బ్రవేశించి కుంభకోణమందలి దొరతనమువారి పాఠశాలలో సహాయోపాధ్యాయుఁ డయ్యెను. 1857 వ సంవత్సరమున చెన్నపట్టణపు యూనివరిసిటీ స్థాపింపఁబడెను. ఆ సంవత్సరమే గోపాలరావు ప్రవేశపరీక్ష (మెట్రిక్యులేషను) కుఁ బోయి యందుఁ గృతార్థుఁ డయ్యె. తరువాత రెండేండ్లకే యనగా 1859 వ సంవత్సరమందే యతఁడు పట్టపరీక్ష (బి. ఏ.) కుఁ జదివి యందు మొదటితరగతిలో మొదటివాఁడుగఁ గృతార్థు డయ్యెను. అట్లు గోపాలరావు పరీక్షలోఁ బ్రధమగణ్యుఁడై వచ్చుట, మిక్కిలి కష్టసాధ్యము. ఏలయన నతఁ డుపాధ్యాయుఁ డగుటచేఁ బ్రతిదినము బాఠశాలలో నాఱు గంటలు పనిజేసి యలసి యింటికిఁబోయి గృహకృత్యములు నెరవేర్చుకొనుచుఁ దీరికయున్నప్పుడు స్వయముగాఁ గ్రంథములఁ జదువుకొనుచు వచ్చెనేగాని యొకపాఠశాలలోఁ జేర లేదు. ఒక గురువువద్ద పుస్తకముఁబట్టి చదువలేదు. ఆహాహా స్వయంకృషిసహజ పాండిత్యమునను శబ్దములు గోపాలరావునందే సార్థకములైనవి గదా! అప్పుడు గవర్నరు జనరలుగారి యాలోచనసభలో సభికుఁడైన ఫోర్సుదొర కలకత్తానగరమందుండగా నీతడుఁ పట్ట పరీక్షం దేరినట్లు విని గోపాలరావున నీక్రిందివిదమున జాబువ్రాసెను.

"నీవు నాకు వ్రాయకపోయినను బి. ఏ. పరీక్షలో నీనడుమ మొదటివాఁడుగ గృతార్థుఁడ వైనవాఁడవు నీవే యనుటకు నాకు సందేహము లేదు. నేను నీయభివృద్ధియం దిష్టముగలవాఁడనిని నీవు తలంపక పోయినందుకు నాకు విచారముగ నున్నది. ఈ పరీక్షలో దేరినందుకు నిన్ను నేను బహూకరించుచున్నాను ఈ కృతార్థత నీ బుద్ధికి దగియున్నది. ఈవిజయము పునఃపునః ప్రయత్నములకు నిన్ను బురిగొల్పుగాక" హాలోవేదొర యాసమయమున నీ క్రింది లేఖ వ్రాసెను. "నేను చాల జాబులు వ్రాయజాలను. అయినను నీ