పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

మహాపురుషుల జీవితములు



తుపాకి రెండుసారులు గాల్చెను. అదృష్టవశమున నా రెండుగురులు గూడ మంత్రికిఁదగులక తప్పిపోయెను. వెంటనే సేవకులాదురాత్మునిఁ బట్టుకొనిరి. నిజాము వానికి మరణదండన విధించెను. దుష్టుఁడైనతు వానికి మరణదండనవిధింపవలదనియు గారాగృహబంధనము విధింపు డనియు సలారుజంగు నిజామును వేడుకొనెను గాని నిజాముపట్టు విడువక తన మొదటియాజ్ఞ చెల్లించెను.

1869 వ సంవత్సరమున నప్పటి నిజాముగారు మృతినొందిరి. ఆయన కొక్క చిన్నకుమారుఁ డుండుటచేత నింగ్లీషుదొరతనము వారు పౌర్యాపర్యములు చక్కగ బరిశీలించి సలారుజంగుగారిని షమ్సల్‌దౌలా అమీరీ కాబీరీగారిని బాలునిపక్షమున బ్రజాపరిపాలనము జేయుమని నియోగించిరి. 1872 వ సంవత్సరమున నాయిరువురు మంత్రులు మునుపు తమ నిజామువద్దనుండి పుచ్చుకొన్న బేరారు పరగణా మరలనీయవలసినదనియు దానికై సొమ్ము రొక్కముగ ధరావతు నిలుపుదుమనియు జెప్పియడిగిరి. కాని గవర్నమెంటువారు పుచ్చుకొనుటలోనేకాని యిచ్చుటలోఁజురుకుతనము లేనివారగుటచే దాని కంగీకరింపరైరి. 1875 వ సంవత్సరమున మన ప్రస్తుత చక్రవర్తియగు నెడ్వర్డురాజుగా రప్పుడు యువరాజుగానుండి మనదేశము జూడవచ్చిరి. అప్పుడు సలారుజంగు బొంబాయికిఁ బోయి వారిని స్వయముగ సన్మానము చేసెను. ఆయువరాజుగారు సలారుజంగును సీమకు రమ్మని యాహ్వానముచేసిరి. 1876 వ సంవత్సరమున సలారుజంగు వారు కోరిన రీతిగా నింగ్లాండునకుఁబోయి యచ్చటి జనులచే నమితమైన సన్మానము నందెను. ఇంగ్లాండు బోవుటలోఁ నతని ముఖ్యోద్దేశము బేరారు పరగణా నెటులైన మరల సంపాదించి తన ప్రభువున కీయవలయునని యతఁడు మృతినొందు వఱకు దీని విషయమునఁ బ్రయత్నించుచునే వచ్చెను. అతఁడీప్రయత్నమున నింగ్లం