పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

మహాపురుషుల జీవితములు



పడదు. అతఁడు చదువుకొన్న గ్రంథములనుబట్టి విచారించితిమా యతఁడు మంత్రిపదములోనుండి గనఁబరచిన రాజనీతి చాతుర్యము మొదలయినవి వాని కెక్కడినుండివచ్చినవో తెలియదు. ఆతనితండ్రి తల్లి లెక్కలలో వానిని నేర్పరిగ జేయుటకు వారిగ్రామములమీఁద నేఁటేఁటవచ్చు శిస్థులమొత్తము మొదలయిన సంగతులు దెలియఁ జేయుచుండినను సలారుజంగు వానినంత శ్రద్ధచేసివినినట్లుకనఁబడదు. హైదరాబాదులోనుండు గొప్పవారికొడుకులు విశేష విద్యావంతులు కాకపోయినను గొప్పయుద్యోగములలోఁ జిన్న తనమందేనియమింపఁ బడుదురు. అందుచేతనే యిరువదియేండ్ల ప్రాయమున సలారుజంగు తాలూకాదారుగ నేర్పరుపఁబడెను. తాలూకాదారనగా జిల్లకలెక్టరని యర్థము. ఈయుద్యోగమునం దతండెనిమిది మాసములు మాత్రమేయుండినను నాస్వల్పకాలములోనే హైదరాబాదు రాజ్యములోని నేపపన్నుల విషయమై జ్ఞానమంతయు సంపాదించెను. 1853 వ సంవత్సరమందు వాని పినతండ్రి మృతినొంద నిజాము మంత్రిపదము వహించి రాజతంత్రము నడుపుటకు సలారుజంగును బిలిచెను. బాలుఁడగు సలారుజంగు శుభమైన యావార్తవిన్నప్పుడు మనసులో నెట్లుతలంచెనో తనమిత్రునకుఁ వ్రాసిన యీయుత్తరము వలన దేటపడును. "రాజతంత్ర నిర్వహణమువలన ముఖ్యముగా నిటువంటి సమయమున సంభవించు మనోవ్యధలకు లోనుగాకుండ నా పినతండ్రి జాగీరుగ్రామములఁ జక్కంపెట్టుకొనుచు నేనుహాయిగా నుండిన బాగుండును. ఈయుద్యోగము నేను మనసార నంగీకరించుట లేదు. ఇది యంగీకరించని పక్షమున నేను నాకుటుంబము పూర్తిగ చెడిపోవుదము. ఇదిగాక తెల్లవారు నల్లవారు సమానముగ నీ యుద్యోగము నంగీకరింపవలసినదని నన్ను బ్రేరణము చేయుచున్నారు గావున సంస్థానమును జిక్కులలోనుండి పయికి లేవనెత్తుటకును