పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[29]

225

నవాబు సర్ సలార్ జంగు

సలారుజంగు 1829 వ సంవత్సరమున హైదరాబాదు నగరమున జన్మించెను. ఈయన సంపూర్ణమైన పేరు మీఱుతుఱ్ఱాఅల్లీఖాను. ఈయన గొప్ప కుటుంబములోనివాడు. ఈయన పూర్వులు మహమ్మదుగారికిఁ బ్రియపట్టణమగు మదీనానగరమునుండి హిందూస్థానమునకు వచ్చి హైదరాబాదులో కాపురముండిరి. ఇంగ్లీషువారికి మైసూరుప్రభవగు టిప్పుసుల్తానుకు 1799 వ సంవత్సరమున యుద్ధము జరిగిన కాలమున సలారుజంగుయొక్క ముత్తాత మీరాలమ్మను నతఁడు హైదరాబాదు నిజాముగారివద్ద దివానుగా నుండెను. హైదరబాదు సంస్థానమునకు చందులాలు దివానుగా నున్నప్పుడు సలారు జంగుయొక్క తాత మనీరుల్ముల్కు వానితోగలసి రాజ్యతంత్రము నడిపెను. అనంతరము చందులాలు మంత్రిపదమును మానుకొన్నపుడు సలారుజంగు పినతండ్రి సురాజుల్ముల్కు నిజాముచే దివానుగా నియమింపఁబడెను. కాబట్టి హైదరాబాదు దివానుపదవికి సలారు జంగునకు న్యాయమైన హక్కుగలదు. హక్కున్నను దనకదియంతటి పిన్నవయస్సులో వచ్చునని యాయన యెన్నడు తలంప లేదు.

సలారుజంగు పాఠశాలకుఁబోయి యెన్నడు విద్య నేర్వ లేదు. వచ్చినచదువేమో యింటివద్దనే చదువుకొనెను. చిన్నతనమందే యతడరబ్బీ పారసీ భాషలయందు బ్రవీణుఁడై యింగ్లీషొక విధముగా నేర్చుకొనెను. కుమారదశయందే తండ్రియుఁ దాతయు మృతి నొందుటచే వాని విధ్యాభ్యాసమునకు విఘ్నములు గలిగి యుండవచ్చును. అతనికి బాల్యమున నుపాధ్యాయు నేర్పరచి యింటివద్ద నేడుసంవత్సరములు విద్య నేర్పించెను. ఆకాలమునం దతఁడుబుద్ధికుశలతనుగాని యేకార్యమైన జేయుటకు తమకమునుగాని జూపినట్లు గన