పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[28]

217

మహాదేవగోవింద రెనడీ

మహాదేవగోవిందరెనడీ 1842 వ సంవత్సరం జనవరి 20 వ తేదీని జన్మించెను. ఈయన మహారాష్ట్ర బ్రాహ్మణుఁడు. తండ్రి కొల్లాపురసంస్థానములో నుద్యోగస్థుఁడు. రెనడీ ఎల్ఫినిష్టనుకాలేజీలో జేరి క్రమముగా విద్యాభ్యాసముచేసి 1862 వ సంవత్సరమున బి. ఎ. పరీక్షయందును. 1863 సంవత్సరమందున యమ్. ఎ. పరీక్షయందును గృతార్థుఁడై బంగారుపతకమును బహుమానముగ బడసి 1866 వ సంవత్సరమున యల్. యల్. బి. పరీక్షయందుఁ దేరెను. విద్య ముగించినపిదప నతఁడు గవర్న మెంటువారికి మహారాష్ట్రభాష నింగ్లీషులోనికి భాషాంతరీకరించు నుద్యోగమునందు బ్రవేశించెను. తరువాత నతనికిఁ గొల్లాపుర సంస్థానములో జడ్జీపనియైనది. 1868 వ సంవత్సరమందు మున్ను దాను చదువుకొన్న కళాశాలలోనే ఇంగ్లీషు భాషా పండితుఁడుగ నతఁడు నియమింపఁబడుట చే జడ్జీపని స్వల్పకాలములోనే మానుకొనెను. హిందూ దేశస్థు నొకనిని దొరతనమువా రింగ్లీషు భాషాపండితుఁడుగ జేయుట మన కపూర్వ గౌరవము చూపుటగదా! బొంబాయి రాజధానిలో విద్యాశాఖకధిపతిగాఁ (అనగాఁడైరెక్టరుగ) నుండిన సర్ అలగ్జాండరు గ్రాంటుదొరగారు సీమకు బోవునపుడు రెనడీగారిని గూర్చి మాటలాడుచు నతఁడా కళాశాలకు భూషణమనియు నతని బుద్ధిసూక్ష్మత నిరుపమాన మనియు మిక్కిలి కొనియాడెను. ఒకసారి రెనడీ విద్యార్థిగా నున్నపుడు గ్రాంటుదొరగారు వానిని దేశచరిత్రలలో బరీక్షించి తన ప్రశ్నల కతఁ డిచ్చిన యుత్తరములను మున్ను దాను చదువుకొన్న యాక్స్ఫర్డుకాలేజీకి పంపెను. హిందూవిద్యార్థుల తెలివితేటలు సీమలోనున్న దొరలకుఁ దెలుపుటకై యతఁడీపని జేసెను. చెన్నపట్టణములో నుండిన పూండీరంగ