పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

మహాపురుషుల జీవితములు

హిందూదేశములోవిద్యాభివృద్ధి యెట్లగుచున్నదో కనుగొనుటకీసభ యేర్పడినది. ఈసభలోఁగూర్చుండి యతఁడు పడినపరిశ్రమకురైఫన్ ప్రభువుగారు మిక్కిలి సంతసించి వానికి సి. ఐ. యి, అనుబిరుదము నిచ్చిరి. ఆసభలో నతని సహకారకులై పనిజేసిన కొందఱు పాఠశాలలో నీతిపుస్తకములు కొన్నిటిని బాలుర చేతఁ జదివించి నీతిప్రత్యేకముగా నేర్పవలయునని నాదరింప నీతి బాలురు చదువుచున్నట్లి ప్రతి గ్రంథములో నున్నదనియుఁ బ్రత్యేకముగా నేర్పనక్కర లేదనియు దిలాంగుగారు వారివాదములఁ బూర్వపక్షముచేసి వ్రాసిరి.

1883 వ సంవత్సరమున ఇల్బర్టుబిల్లు అనునది హిందూదేశమునం దంతటఁ జర్చింపఁబడెను. దొరలేవైన నేరములు చేసినప్పుడు నల్ల న్యాయాధిపతులు వారిని విచారింపవచ్చునని యీచట్టముయొక్క ముఖ్యాభిప్రాయము. ఇది దొరల కనిష్టమై వివాదకారణమయ్యెను, ఆదినములలో నీతిలాంగుగారు బొంబాయిలో నొక సభచేయించి యాబిల్లు చాలా శ్రేయోదాయకమని న్యాయమని యుపన్యసించెను. ఈయుపన్యాసమును వాని ప్రతిపక్షులుసయితము గొనియాడిరి. 1884 వ సంవత్సరమున నీతఁడు బొంబాయి గవర్నరుగారి శాసన నిర్మాణసభలో సభికుఁడుగా నియమింపఁబడి హైకోర్టు జడ్జీయగు వఱకు నాసభలోఁ బనిచేసెను. ఆసభలోనుండి మహారాష్ట్రదేశమునకు ముఖ్యముగా బొంబాయినగరమునకుఁ జాల నుపకారముచేసెను. 1885 వ సంవత్సరమున నితఁడు హ్యూందొరగారితోఁ గలసి దేశీయ మహాసభాస్థానమునకుఁ బాటుపడి ప్రథమసభ బొంబాయిలోఁ జరిగించెను. 1888 వ సంవత్సరమున నలహాబాదులోఁ జరిగిన దేశీయమహాసభ కితఁడుపోయి శాసననిర్మాణసభలలో స్వదేశీయ సభికులను మునుపటికంటె నెక్కువగా జేర్పవలసినదని దొరతనమువారికి విన్నవించుచు నుపన్యసించెను. ఇది యాతని యుపన్యాసములలో శ్రేష్ఠ