పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

మహాపురుషుల జీవితములు

నతఁడు డోల్పూరు సంస్థానమునకు మంత్రియయ్యెను. 1861 వ సంవత్సరమున గవర్నరు జనరలుగారి శాసననిర్మాణసభలో హిందువుల నేర్పరచవలసి వచ్చినపుడు దినకరరావుగా రొక సభికుఁడుగా నియమింపఁబడెను. అతఁడాసభలోమూఁడుసంవత్సరములు మాత్రమే పనిచేసినను నాస్వల్పకాలమున దేశోపకారకములగుపనులే చేసెను. 1866 వ సంవత్సరమున నతనికి సర్ యను బిరుదమువచ్చెను. 1877 వ సంవత్సరమున జరిగిన ఢిల్లీ దర్బారులో దొరతనమువారు వానికి రాజా బిరుదము నిచ్చిరి. 1886 వ సంవత్సరమున డఫ్రిన్ ప్రభువుగారు రాజాబిరుదము వారివంశస్థు లందఱికుండునట్లు చేసెను. దినకరరావు మిగిలినదినములను నిర్వ్యాపకముగానేగడపి 1896 వ సంవత్సరమున జనవరి 9 వ తారీఖున కాలధర్మమునొందెను.

దినకరరావు పలుచని మొగము గలిగి పచ్చనిచాయ గలిగి యౌవనమున స్ఫురద్రూపియయి యుండెను. అతని యాకృతిపొట్టిగ నుండును. అతనిమాటలు మిక్కిలి మృదువులయి యెదుటివారిం దనపక్షముద్రిప్పుకొనునట్లుండును. అతఁడు నిశ్చలమయిన చిత్తధైర్యము గలవాఁడు. ఇంగ్లీషు విస్తారము రాకపోవుటచే నతఁడు దొరలపద్ధతి నెప్పు డవలంబింపి లేదు. స్త్రీవిద్య మొదలగు సంస్కారము లతనికిష్టములుకావు. కాని సంస్థానపరిపాలనమునుందు మంచి బుద్ధిశాలియయి సహాయుఁడయి పనిచేసెను.