పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజా సర్ దినకరరావు

195

జొచ్చిరి. సర్కారునకుఁ జెల్లుబడి గావలసిన సిస్తు సయితము తిన్నగా వసూలుచేయు దిక్కు లేకపోయెను. అందుచేత ధనకోశములు వట్టి వయ్యెను. ఈ దురవస్థకుఁదోడు గోరుచుట్టుపై రోకటిపోటుచందమున సంస్థానమున మన్నెములలోనున్న కాండులును వనచరులు పితూరీలు చేసి, యున్న కొంచెము నెమ్మదికి భంగము గలిగించిరి. కాఁబట్టి సంస్థాన మను నావకుఁ జుక్కాని త్రిప్పుటకు సమర్థుఁ డొకఁడు కావలసి వచ్చెను. తగినవాఁ డెవఁడని యందఱు విచారించుచుండ నంతలోఁ బ్రధాన మంత్రిపదవి కాళీయయ్యెను. వెంటనే సంస్థానము మేలుకోరినవా రందఱు దినకరరావే దానికిం దగినవాఁడని వాని నాపదవియందు 1852 వ సంవత్సరమున బ్రతిష్ఠించిరి.

ఆ మహాపదవి నతఁడు బూని సంస్థానము సరిగా సిస్తు చెల్లక పోవుటచే ధనహీనతచేత జిక్కుపడు చున్నదని గ్రహించి తద్విషయమున ముందుగాఁ బనిచేయుటకు బ్రయత్నించెను. దరి యంచు లేక సంస్థానమందలి ధనమంతయు కర్చగుచుండుటచే నట్టివ్యయము నివారించుటకు నతఁడు చేసినపని మిక్కిలి యాశ్చర్యకరమయి శ్లాఘనీయమయి యున్నది. నిజమయిన స్వామిభక్తిగల దినకరరావు ప్రప్రథమమున తనజీతము నైదువేలరూపాయలనుండి రెండువేలగు నట్లు తగ్గించెను. ఆత్మలాభపరాయణుఁడుగాక కేవలస్వార్ధపరిత్యాగి యయిన యీ సత్పురుషుని పద్ధతి నవలంబించి యనేకులు తమజీతములుగూడ తగ్గించుకొనిరి. అందుచేత ప్రతిసంవత్సరము చాలసొమ్ము కూడివచ్చెను. ఈపని యయిన వెను కతఁడు సర్కారుసిస్తు వసూలు చేయుటనుగూర్చి యెక్కుడు శ్రద్ధచేసెను. ఈపని చక్కఁగా నిర్వహించుటకు దినకరరావు రివిన్యూడిపార్టుమెంటును బలపరచి లెక్కల డిపార్టుమెంటునుగూడ సృష్టించి దానిని సమర్థుఁడయిన యొక యుద్యోగస్తునిచేతిక్రింద నిలిపెను. ఇట్లు మూడు సంవత్సరములు