పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదాసుమూల్జీ

187

వలయు నను మంచియుద్దేశముతో నేర్పడియుండవచ్చును. కాని యిటీవల మహారాజులను పేళ్ళతో బయలుదేరిన గురువులుదురాశా పాతకులయి శిష్యులను వంచించి మూర్ఖులనుజేసి వారిధనము నపహరించుటయేగాక వారిచేత నీచమయిన సేవలు చేయించుకొనుటయే కాక శిష్యులయింట నుండు పడుచుపడంతుల సయితము భక్తితోఁ గాపురమునకుఁ బంపకమునుపు వ్యభిచారమునిమిత్తము గురువుల వద్దకు పంపవలయునని శిష్యులు కుపదేశించు చున్నారు.

ఈ గురూపదేశము విని యందువలన పుణ్యము వచ్చునని నమ్మి యా మతస్థులు తమ భార్యలను పుత్రికలను దోఁబుట్టువులను గురువులగుం దార్చి తాము కృతార్థుల మయితిమని సంతసింతురు. ఈ మూర్ఖుల భక్తి యింతతో సరిపోవలేదు. ఈ గురుమహారాజులు నడిచిన నేలమీఁది దుమ్ము వారిపాదపద్మ సంసర్గముచేతఁ బావన మైనదని శిష్యు లామట్టిభక్షింతురు. వారిపాదుకలు వారుకూర్చుండు పీఁటలు పూల పూజింతురు. వారి యడుగులను బంగారునగలతో నర్చింతురు. గురువులు నమలి యుమిసిన తమలపాకులతమ్మి స్త్రీపురుషులు వెలయిచ్చి కొని కన్నుల నద్దుకొని తినిధన్యులగుదురు. గురువు కాళ్ళు గడుగుకొన్న నీరు త్రావుదురు. అతని యుచ్ఛిష్టాన్న మారగింతురు వేయేల? అతనిబట్టలు పిడిచిననీరుసహితము పరమభక్తితో గ్రహించి పానము చేయుదురు. జనులయందున్న యీ మూర్ఖత చూచి గురువులు పై నుదహరింపఁబడిన పనులు చేయనిచ్చినందుకు శిష్యుల వద్దనుండి చాలధనము గ్రహింతురు. ఈ విషయమున మున్నొకసారి రావుబహుదూరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు వ్రాసిన వాక్య మొక టిందుదహరించుచున్నాము.

'ఈమహారాజులు శిష్యులవలన, దర్శనమిచ్చినందున కయిదు రూపాయిలును శరీరములు ముట్టనిచ్చినందుకు ............