పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

మహాపురుషుల జీవితములు

నవి. అతడు స్థాపించిన పాఠశాలలు ముఖ్యముగా నైదున్నవి. ఒక సంస్కృతకళాశాల యొక బాలికాపాఠశాల మగపిల్లల నిమిత్తము మూడింగ్లీషుపాఠశాలలు ఈ యయిదుపాఠశాలలలో జదువుకొను పిల్లల సంఖ్య 1200 లు, వీరిలో నూటి కిరువది యయిదుగురికి ధర్మార్థము చదువు చెప్పబడును. ఇదిగాక తన జన్మదేశమగు కచ్చిలో జిన్నవి పెద్దవి కలసి మఱి యాఱు పాఠశాలలు కలవు. అందొక దానిలో బాలురకుసంస్కృతముమాత్రమేనేర్పబడును. ఇవియన్నియు గాక బారిష్టరు పరీక్షకు వైద్యశాస్త్ర పరీక్షలకు జదువుకొన గోరు విద్యార్థులకు సాయము జేయు నిమిత్తము కొంత మూలధన మతఁ డిచ్చెను. ఈపరీక్షలకు జదువుకొనదలంచి వచ్చినవారిలో దనతెగవారగు భట్టియాలకే యెక్కువ ప్రాముఖ్యత నీయవలసినదని యతఁడు వ్రాసెను. ఇట్లు విద్యాదానము నిమిత్తము సదుపాయములు పెక్కులు చేసి యూరకొనక దేవస్థానములు మొదలగువానికి గూడ నతఁడు కొంతధనమిచ్చెను. అందు ముఖ్యముగానొక దేవాలయమునకు కొంత ధనమిచ్చి యే టేట నచ్చట నుత్సవములు మహావైభవముతో జరుగునట్లు నియమించెను. భట్టియాశాఖలోఁజేరిన దిక్కులేని వితంతువులను దలిదండ్రులులేని బీదబాలురను బోషించునిమిత్తమును దిక్కులేని యాడుపిల్లలకు వివాహము సేయునిమిత్తమును గతిలేనివారికి మరణాంతమున శ్రాద్ధకర్మలు జరుపు నిమిత్తమును గోకులదాసు ప్రత్యేకముగా లక్షాయేబది వేల రూపాయలిచ్చి దానివడ్డీతో బయిన చెప్పిన కార్యములు సేయుమనియెను.

బొంబాయి నగరమున ధన మెంతయున్నదో ధర్మము నంతే యున్నది. ఎందరెందరో ధనవంతులు విశేషదానముల నిచ్చిరిగాని దీనులకు నెల్లవారలకు నత్యంతోపయుక్తముగా నుండునట్టి ధర్మములు