పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

మహాపురుషుల జీవితములు

అతడు దానములుచేయునపుడు కుడిచేయి ఇచ్చినదానిని నెడమచేయి నెఱుగదన్నట్లు దానము సేయువాడు. కళ్యాణనగరమున కట్టించిన ధర్మవైద్యశాలయు బొంబాయినగరమున స్థాపించిన బాలికపాఠశాలయు వాని యౌదార్యమును ఘోషించుచున్నవి.

మంగళదాసునాథూభాయి ఆ 1890 వ సంవత్సరమున లోకాంతరగతుడయ్యెను. అతడు మృతినొందునప్పు డొక్కమరణ శాసనము వ్రాసి యందు రమారమి యెనిమిదిలక్షల రూపాయలు ధర్మకార్యముల నిమిత్తము వ్యయముచేయుమని నియమించెను. అందు ముఖ్యదానములివ్వి. వాకేశ్వరగ్రామమువద్ద ధర్మవైద్యశాల గట్టించుటకు డెబ్బదివేలరూపాయలు. వానిపేరస్థాపింపబడిన బాలికా పాఠశాలకు రెండు వేలరూపాయలు, తన తెగకోమటులలో బీదలకు సాయముచేయుటకు వేయిరూపాయలు, వాకేశ్వరధర్మశాల మరమ్మతు చేయుటకయిదువేల రూపాయలు. ఇంగ్లాండునకు బోయి చదువుకొను హిందూవిద్యార్థుల నిమిత్త మిదివఱకిచ్చిన ఇరువది వేలు గాక మఱియు గొంత ధనమిచ్చునట్లు మరణ శాసనములో వ్రాసెను.