పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాన మోహన ఘోషు

133

గతిలో జదువలేదను నెపమున బని కనర్హుడని తీసివేయించుటకు బ్రయత్నించిరి. ఓర్వ లేమిచే వారలు చేసిన యాక్షేపణము లన్నియు మహాధైర్య సంపన్నుడు దృఢచిత్తుడునగు మానమోహనునియెడ వ్యర్థములయ్యెను. కాలక్రమమున మానమోహనుని దెలివితేటలు బయలుపడుటచే దొరతనమువారతనికి కలకత్తా ప్రసిడెన్సీ మేజస్ట్రీటు పని నియ్యఁ దలఁచిరి. కాని యతఁ దంగీకరింపఁడయ్యె.

ఇంగ్లాండునుండి వచ్చినది మొదలు మానమోహనుఁడు సివిలుసర్వీసు పరీక్షలో హిందువులకు జరుగు నక్రమములను గూర్చి వరుసగ కొన్ని యుపన్యాసముల నిచ్చెను. 1860 వ సంవత్సరము ఏప్రల్ 20 వ తారీఖున నింగ్లీషు విద్యాభ్యాసము బంగాళీలకుఁ జేయుచున్న చెరుపునుగూర్చి యతఁడొక యుపన్యాసము చేసెను. అది దేశమందు చాల సంక్షోభము గలిగించెను. హిందువులలో ననేకులకు మానమోహనుపై మహాగ్రహము కలిగెను. బారిష్టరుపనిలో మానమోహనునకు హిందువులలోను నింగ్లీషువారిలోను నెవరికి గలుగునంత పేరుం బ్రతిష్టయు లభియించె. అతడు పదవిలో ప్రవేశించిన స్వల్పకాలములోనే యొక గొప్పవానిమీద పెద్దయభియోగము వచ్చెను. అనేరస్థుడు తన పక్షము వాదించుటకు జిర కాలానుభవము గల గొప్ప న్యాయవాది నొకని నేర్పఱచుకొని వానికి సహాయకుడగ నుండుటకు మానమోహనుని గూడ నియమించుకొనెను. దైవవశమున నభియోగము విచారణకు వచ్చునప్పటికి మొదటి యతడు చనిపోవుటంజేసి యాకార్యభార మంతయు మానమోహనునిమీద బడెను. ఆవ్యవహారమున మానమోహనుఁడు గెలువజాలడయ్యెను. కాని వాదము సలుపుటలో నతడు చూపిన సామర్థ్యమునకు బుద్ధి కుశలతకుమెచ్చి ప్రధాన న్యాయాధిపతి వానిని శ్లాఘించెను. కాలక్రమమున నతడు జనుల సన్మానమునకు నాదరమునకు బాత్రుఁడై