పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

మహాపురుషుల జీవితములు

మేఘనాధవధ మిక్కిలి సుందరముగా నున్నదని యొప్పుకొనక తప్ప దయ్యె. అట్లొప్పుకొన్న వారిలోనగ్రగణ్యుఁడు గుణగ్రహణపారీణుఁడు నగు విద్యాసాగరుఁడే. మహాభారతము బంగాళీభాషలో వ్రాసిన కాళీప్రసన్న సింహుఁడు మధుసూదనదత్తుయొక్క బుద్ధికుశలతకు మెచ్చి యీకవిపేరుపెట్టి యొక విద్యాసంఘము నేర్పరచేను. ఆ సంఘముననే దత్తు కృష్ణకుమారి యను నాటకమును నప్పటికి సమాప్తము కాని వీరాంగన యను పద్య కావ్యమురచించెను. 1862 వ సంవత్సరమున మధుసూదనుఁడు యూరపుఖండమునకుఁ బయనమయి తన చిర మనోరథమును నెరవేర్చుకొనెను.

అప్పు డతఁ డింగ్లాండునకుఁ బోయి యా దేశమునఁ నైదు సంవత్సరములుండి బారిష్టరు పరీక్షకుఁ జదివి 1867 వ సంవత్సరమున మరల మన దేశమునకువచ్చి కలకత్తా హైకోర్టులో బారిష్టరుగాఁ బనిచేయఁ జొచ్చెను. ప్రారంభము సరిగానే యుండెను. కాని వాని వృత్తిలో వానికి రావలసినంత పేరుమాత్ర మెందుచేతనో రాలేదు. బారిష్టరయిన పిదప నతఁ డాఱుసంవత్సరములు మాత్రమే జీవించి యుండెను. ఆకాలమయినను సుఖముగా గడువక కష్టములతోను దారిద్ర్యముతోను మనస్తాపములతోను వెళ్ళెను. ఆయన 1873 వ సంవత్సరమున అల్లిపురము నందలి యాసుపత్రిలో కాలధర్మము నొందెను. మరణమునకు సిద్ధముగానున్న కాలమునందును మధుసూదనదత్తు బంగాళీభాషలో మాయకనా రను పద్య కావ్యమును వ్రాసి తనజీవిత మెట్టు దుఃఖకరముగా ముగిసెనో దానిలో కథయు నంత దుఃఖకరముగా ముగించెను.

వెనుక నతఁడు చెన్నపురిలో నున్నపుడు నీలిమందుపంట పండించు నొక ఇంగ్లీషువారి కొమార్తెను పెండ్లియాడెను. కాని యీ వివాహము వానికి సుఖప్రదము గాకపోవుటచే నతఁడు భార్య