పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుసూదనదత్తు

119

విద్యాసాగరుఁడు ఆఖ్యకుమారబెనర్జీ మొదలగు నవీనపద్ధతి కవులును దత్తుయొక్క గ్రంథము యతిప్రాసలు తీసివేసినందున దుష్కావ్యమైనదని యభిప్రాయ మిచ్చిరి. మంచి యెచ్చటనున్నను దానిని మెచ్చుకొనునట్టి గుణగ్రహణపారీణుఁడు విద్యాసాగరుఁడు తిలోత్తమ భ్రష్ఠ కావ్యమని పలికెను. విద్యాసాగరుఁడే యట్లన తక్కువ ప్రజ్ఞఁగల తక్కిన కవులందఱు దత్తును గేలికొట్టి దూషించిరని వేరెచెప్ప నేల"

ఇట్లనేకులు గ్రంథమును గ్రంథకర్తను నిరసించినను మెచ్చుకొనువారుకొందఱు లేకపోలేదు. జ్యోతీంద్రమోహనటాగూరు డాక్టరు రాజేంద్రలాలుమైత్రా మొదలగు రసికులు కొందరు తిలోత్తమ యందలి రసములను గ్రహించి కవినిం బొగడఁజొచ్చిరి. జ్యోతీంద్రమోహన టాగూరు కావలసిన ధనమిచ్చి గ్రంథము నచ్చొత్తించెను. రాజేంద్రలాలుమైత్రుడు బంగాళీభాషలో యతిప్రాస శూన్యమైన కవిత్వమును గ్రొత్తగాఁ దెచ్చిపెట్టినందుకు సంతసించి దత్తును బొగడెను. రాజనారాయణభానుఁడను పండితుఁడు తద్గ్రంథవిషయమున నిట్లు వ్రాసెను. "దేవేంద్రుఁడు బంగాళీభాషను మాటలాడాఁ దలంచుకొనునేని నిశ్చయముగా నతఁడీ గ్రంథములోనున్న శైలినే మాటలాడును. అ గ్రంథకర్తయొక్క మహోన్నతములయిన కల్పనలను స్వభావవర్ణనమునఁగల ప్రజ్ఞయు రసపుష్టి జేయుటలోఁగల సామర్థ్యము పదలాలిత్యము విశేషించి పద్యముల నడకయు మమ్ము మహానంద భరితులఁ జేయుచున్నవి."

ఇట్లు తిలోత్తమ యను గ్రంథము చక్కఁగా నుండ లేదని విరుద్ధాభిప్రాయముల నిచ్చిన పండితులు మఱికొన్ని దినములకు మధుసూదనదత్తు రచియించిన మేఘనాధవధ యను మఱియొక కావ్యమును జూచి చిన్న బుచ్చుకొనిరి. ఆ పండితు లందఱుఁ జిట్టచివరకు